పోలీస్ అకాడమీలో 35% మంది ట్రైనీ డిఎస్పీలు ఫెయిల్

- వ్యవస్థాగత వైఫల్యమా? లేక నియామక కుంభకోణమా?
- టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్థాయి న్యాయ విచారణ
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీజీపీఏ) నుంచి వస్తున్న దిగ్భ్రాంతికరమైన వార్తల పట్ల భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపికైన దాదాపు 35% మంది ట్రైనీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లు ఫెయిల్ కావడంపై తక్షణమే స్వతంత్ర, కాలపరిమితితో కూడిన న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు నేతృత్వంలో.. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం కు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డా. శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపికైన 112 మంది ట్రైనీ డీఎస్పీలలో 40 మందికి పైగా అధికారులు టీజీపీఏలో ఫెయిల్ అయ్యారని వెల్లడించారు.
10 సబ్జెక్టులలో 1,600 మార్కులకు గాను 10 నెలల పాటు తీవ్ర శిక్షణ పొందిన వీరు, కేవలం 50% పాస్ మార్కులు కూడా సాధించలేకపోయారని తెలిపారు. సాధారణంగా పోలీస్ అకాడమీ పరీక్షలను ఎంతో వెసులుబాటుతో, ఉదారంగా మూల్యాంకనం చేస్తారన్న సంగతి తెలిసిందేనని, అలాంటిది 35% మంది ఫెయిల్ కావడం ఎంపికైన అభ్యర్థుల అసలు సామర్థ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. “పది నెలల కఠిన శిక్షణ తర్వాత అత్యున్నత ర్యాంకులు సాధించిన ఎలైట్ అధికారులు ప్రాథమిక పరీక్షల్లోనే ఫెయిల్ అయితే, అది కేవలం శాఖాపరమైన లోపం కాదు మొత్తం మూల్యాంకన వ్యవస్థే భ్రష్టుపట్టిపోయిందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం” అంతేకాకుండా, ఈ వైఫల్యం కేవలం పోలీసు శాఖకే పరిమితం కాలేదని, డా. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫౌండేషన్ కోర్సులు శిక్షణ పొందుతున్న ఇతర గ్రూప్-1 అధికారులలో కూడా ఇలాంటి ఆందోళనకరమైన ఫలితాలే వస్తున్నాయని ఆయన తెలిపారు.
మూడు ప్రమాదకరమైన అనుమానాలు: టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి. ఈ భారీ వైఫల్యం వెనుక ప్రభుత్వం మరియు టీజీపీఎస్సీ ముందు కేవలం మూడు అవకాశాలు మాత్రమే ఉన్నాయని డా. శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు:
అకాడమీ వైఫల్యం: బలహీనమైన బోధన, జాయింట్ డైరెక్టర్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం లేదా వివాదాస్పద పోస్టింగ్‌ల కారణంగా టీజీపీఎస్సీ అకాడమీ శిక్షణలో విఫలమై ఉండాలి. ఎంపిక ప్రక్రియ వైఫల్యం: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సరైన ప్రతిభను అంచనా వేయడంలో విఫలమవడం వల్ల, కనీస ప్రాథమిక అర్హత లేని వారికి కూడా టాప్ ర్యాంకులు వచ్చి ఉండాలి.
ప్రక్రియలో గోల్‌మాల్: ఎంపిక ప్రక్రియలో మార్కులు, ర్యాంకులు లేదా మూల్యాంకనంలో అక్రమాలు జరిగి ఉండాలి.
“టీజీపీఎస్సీ తనను తాను రక్షించుకోవడానికి మొదటి దానినే కారణంగా చూపించి తప్పించుకోలేదు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయా లేదా అని దర్యాప్తు చేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత కమిషన్‌పై ఉంది,” అని డా. దాసోజు చెప్పారు.
తరువాత వెలుగుచూసిన వాస్తవాల సిద్ధాంతం & రాజ్యాంగ బాధ్యత. చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ… ఫిబ్రవరి 2026 నాటి డివిజన్ బెంచ్ తీర్పు, ఏప్రిల్ 2026 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వంటి గత కోర్టు ఆదేశాలు ఎలాంటి కార్యనిర్ವಾహక లేదా రాజ్యాంగబద్ధ విచారణను నిరోధించలేవని డా. దాసోజు స్పష్టం చేశారు:
కొత్త అనుభవ ఆధారాలు : శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ విపత్కర వైఫల్యం అనేది గతంలో ఏ న్యాయస్థానం ముందు లేని సరికొత్త వాస్తవిక పరిణామం. పరిపాలనా లా సూత్రాల ప్రకారం, గణాంకాల ఆధారంగా ఇచ్చిన గత తీర్పులు… తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వాస్తవాలపై విచారణ జరపకుండా ఏ విధంగానూ ఆటంకం కలిగించలేవు.
ఆర్టికల్ 320 ప్రకారం విధి: రాజ్యాంగంలోని ఆర్టికల్ 320 ప్రకారం, ఎంపికల పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమైనప్పుడు వాటిని స్వయంగా తనిఖీ చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉంది.
న్యాయస్థానం వర్సెస్ పరిపాలనా విచారణ: కోర్టులో రద్దు చేయాలంటే పక్కా సాక్ష్యాలు కావాలి, కానీ ఒక స్వతంత్ర విచారణ చేపట్టడానికి లేదా పునఃపరిశీలించడానికి పరిపాలనా విభాగానికి స్పష్టమైన కారణాలు ఉంటే సరిపోతుంది.
అకాడమీ ఫలితాలతో హైకోర్టు తీర్పులోని అంశాల బేరీజు
హైకోర్టు సింగిల్ జుడీషియ్ బెంచ్ (09.09.2025 నాటి W.P. No. 11439/2025 తీర్పు) Procedural lapses, ప్రైవేట్ కోచింగ్ ట్యూటర్లతో మూల్యాంకనం, మోడరేషన్ లేకపోవడం, కొన్ని కేంద్రాలకే పరిమితమైన ర్యాంకులను ఎత్తిచూపిందని ఇప్పుడు అకాడమీ ఫెయిల్యూర్ డేటాతో వీటిని సరిపోల్చి చూడాలని డా. దాసోజు డిమాండ్ చేశారు.
మూల్యాంకన ఆడిట్: ఫెయిల్ అయిన ట్రైనీ డీఎస్పీల పేపర్లు నాన్-సబ్జెక్ట్ ఎవాల్యుయేటర్లు లేదా ప్రైవేట్ ట్యూటర్ల ద్వారా దిద్దబడ్డాయా? మార్కుల వ్యత్యాసం: ఈ ఫెయిల్ అయిన అభ్యర్థులకు 2వ, 3వ మూల్యాంకనంలో అకస్మాత్తుగా భారీగా మార్కులు పెరిగాయా?
కేంద్రం వారీగా అనుమానాలు: మిగతా కేంద్రాలతో పోలిస్తే కేవలం 18, 19 సెంటర్ల నుంచే సుమారు 35 చొప్పున ఎంపిక కావడం వెనుక మతలబు ఏంటి?
Bullet డేటా లొసుగులు: ప్రిలిమ్స్, మెయిన్స్, అకాడమీ ఎంట్రీల వద్ద బయోమెట్రిక్ రికార్డులు సరిపోలుతున్నాయా, ఇంగ్లీష్ అర్హత పరీక్ష ఫెయిల్ అయిన వారు ఎవరైనా ఉన్నారా?
టీజీపీఎస్సీ చైర్మన్‌కు సమర్పించిన 6 ప్రధాన డిమాండ్లు
స్వతంత్ర న్యాయ విచారణ ప్యానెల్: సిట్టింగ్ హైకోర్టు జడ్జి మరియు ఫోరెన్సిక్ స్టాటిస్టిషియన్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరాలి.
అకాడమీ రికార్డుల స్వాధీనం: హోంశాఖ మరియు టీజీపీఏ నుంచి 112 మంది ట్రైనీల సబ్జెక్టులవారీ మార్కులు, రీ-ఎగ్జామ్ ఫలితాలు, గత (2009, 2012) బ్యాచ్‌ల పాస్ శతశాతాన్ని భద్రపరచాలి. కార్లేషన్ ఆడిట్: అకాడమీ మార్కులను, మెయిన్స్ మార్కులు, కేంద్రాలు, మీడియం, ఎవాల్యుయేటర్ల హిస్టరీతో బేరీజు వేయాలి.
కేవలం డీఎస్పీలే కాకుండా అన్ని 563 గ్రూప్-1 పోస్టుల శిక్షణ ఫలితాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి.
సాక్ష్యాల భద్రత: జవాబు పత్రాలు, బార్‌కోడ్ మ్యాపింగ్ కీలు, ఎవాల్యుయేటర్ల లాగ్స్, బయోమెట్రిక్ డేటా, సీసీటీవీ ఫుటేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా వెంటనే సీజ్ చేయాలి. విచారణ ఫలితాలను anonymized రూపంలో ప్రజల ముందుంచి, ఆర్టికల్ 323(2) ప్రకారం గవర్నర్‌కు సమర్పించే వార్షిక నివేదికలో పొందుపరచాలి.
టీజీ పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చిన “టీజీపీఎస్సీపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే నా బాధ్యత” అనే మాటను గుర్తు చేస్తూ… ఆయన తన మాటను నిలబెట్టుకోవాలని డా. శ్రవణ్ దాసోజు కోరారు. ఈ విచారణపై 15 రోజుల్లోగా తీసుకున్న చర్యలపై స్పష్టమైన బదులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
