– రేవంత్ ఢిల్లీ వెళ్ళేది కేవలం సంచులకోసం మాత్రమే
– తెలంగాణ ప్రజల జేబులు కొట్టి ఢిల్లీకి కప్పం
– రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట
సీల్డ్ కవర్ లో ఇచ్చిన నివేదిక ఎట్లా లీక్ అవుతుంది?
– మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి,తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవమానం
– కాళేశ్వరం. ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చింది మేమే.
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ తో అర్థశతకం పూర్తి అయింది. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5లక్షల కోట్లు ఖర్చుచేసింది. ఇందులో 2లక్షల కోట్ల అప్పు ఉంది. దాదాపు 50వేల కోట్లు ఢిల్లీకి మూటలు సమర్పణ అని మోదీ గతంలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం అయిందని మోదీ విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో పది సార్లు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి 20నెలల కాలంలో నెలకు రెండు సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ రెడ్డి,మంత్రులు గప్పాలు కొట్టడంలో ఆరితేరారు. రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రులు నిస్సిగ్గుగా చెప్తున్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే గొప్పగా ఉంటుందని ఓట్లు వేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఉన్న పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో వచ్చాయి. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాను వాడుకుని మా ప్రభుత్వంపై బురదచల్లారు. ఇప్పుడు మీడియాను చూస్తే భయపడుతున్నారు. గతంలో ఇష్టమైన ప్రాంతం అశోక్ నగర్ అని అన్నారు. ఇప్పుడు అశోక్ నగర్ అంటే రేవంత్ రెడ్డికి భయంపుడుతుంది. ప్రియాంకగాంధీ వచ్చి స్కూటీ ఇస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు..
సోనియాగాంధీ మీటింగ్ కు రావడంలేదని లెటర్ రాస్తే, అది అవార్డు అని సీఎం అంటున్నారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లి 50పైసలు తేలేదని అవార్డు కోసం రేవంత్ రెడ్డి లెటర్ రాయాలి. ఢిల్లీ వెళ్ళేది కేవలం సంచులకోసం మాత్రమే. నిన్న సీఎం,మంత్రులు ఢిల్లీ వాటాల గురించి మాట్లాడుకున్నారు.
మాజీ సీఎం గురించి, మాజీ మంత్రుల కోసం ఇష్టం వచ్చినట్లు మీడియాలో మాట్లాడవద్దు. బిఆర్ఎస్,గత ప్రభుత్వం గురించి జాగ్రత్తగా రాయాలని కోరుతున్నా. తెలంగాణ నుంచి ఎందుకు సడెన్ గా పైసలు మాయమయ్యాయి? తెలంగాణలో ఉండాల్సిన 50వేల కోట్లు ఢిల్లీకి వెళ్లాయి. తెలంగాణ ఆర్ధిక రంగం,పారిశ్రామిక రంగం,రియల్ ఎస్టేట్ రంగం కోమాలోకి వెళ్లాయి.
తెలంగాణ ప్రజల జేబులు కొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. 50వ పర్యటనలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటో సీఎం చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడులో జ్ఞానిని మించి బ్రహ్మ జ్ఞానిలా మాట్లాడుతున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి మహేష్ కుమార్ స్వామిలా బనకచర్లపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బనకచర్ల అంటే ఏంది అనేది ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కు తెలియదు.
సీఎం రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసినప్పుడు అయినా మహేష్ కుమార్ గౌడ్ బనకచర్ల గురించి తెలుసుకోవాలి. సీఎం,పీసీసీని కాదని ఢిల్లీ నుంచి మీనాక్షి నటరాజన్ ను పంపారు. మీనాక్షి నటరాజన్ చేసే యాత్రలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కాళేశ్వరం కమీషన్ నివేదిక విషయంలో ఒక్కొక్కరు పరకాయప్రవేశం చేసి రాస్తున్నారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై ఏ అధికారి చెప్పినా,ఏ నాయకుడు మాట్లాడినా మీరు చూపించండి. కేసీఆర్ ను,బిఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేవిధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయవద్దు. సిఎంఓ నుంచి వచ్చే వార్తలు రాస్తే నిజం అవుతాయా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్య,భర్తలు మాట్లాడుకున్న వీడియోలు ఎక్కడ విన్నారు? ఎవరు చెప్పారు?సీఎంఓ ఆఫీసులో ఎవరు చెప్పారో వారి పేర్లు డైరెక్ట్ గా రాయండి.
కుట్రలో వార్తలు రాసి భాగస్వాములు కావద్దు. మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు తప్పుడు వార్తలు రాసేవారిపై కచ్చితంగా చర్యలు
ఉంటాయి. సీల్డ్ కవర్ లో ఇచ్చిన నివేదిక ఎట్లా లీక్ అవుతుంది? కాళేశ్వరం కమీషన్ నివేదిక విషయంలో మీడియాలో వస్తున్న
వార్తలన్నీ అబద్ధం. నేను కేవలం స్లాటర్ హౌస్ ల గురించి మాట్లాడుతున్నా. నేను మీడియా గురించి ఎక్కడా మాట్లాడటంలేదు.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి,తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అవమానం. ఆత్మగౌరవం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క క్షణం పదవిలో వుండే వారు కాదు. ఈ ముఖ్యమంత్రి కాబట్టి పదవిలో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ద్వారా మంత్రులు పనిచేయట్లేదు అన్నట్లే కదా? ఉమ్మడి నల్గొండ జిల్లాకు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు భివృద్ధికి దిక్సూచి.
పోలవరం ఇప్పటికీ మూడుసార్లు వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది. పోలవరం ప్రాజెక్టు రిపేర్లకు కేంద్రం రెండువేల కోట్లు ఇచ్చింది. పోలవరం మొదలుపెట్టి 20 ఏళ్ళు దాటింది. మొదలుపెట్టి నాలుగు ఏళ్ళలొనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. వరదలతో రెండు పిల్లర్లు కుంగితే మోడీ,రేవంత్ రెడ్డి,చంద్రబాబు కలసి అసత్య ప్రచారం చేస్తున్నారు.
పోలవరం లో జరిగిన దుర్మార్గాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేమే. కాళేశ్వరం. ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చింది మేమే. తెలంగాణను పంటల విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలిపింది మేమే. కేసీఆర్ మల్లెపువ్వులాగా తిరిగి వస్తారు అని నిరూపిస్తాం.
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ లింగయ్య యాదవ్ ,ఎన్ .భాస్కర్ రావు ,రవీంద్ర కుమార్ ,బీ ఆర్ ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.