Suryaa.co.in

Telangana

ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

హైదరాబాద్ : దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవలె ప్రకటించింది. కాగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

1). కాజీపేట – సికింద్రాబాద్, కాచిగూడ – నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు..
2). కాచిగూడ – కర్నూల్ సిటీ, మేడ్చల్‌ – ఉందానగర్ రైళ్లు రద్దు..
3). మేడ్చల్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ఉందానగర్ రైళ్లు రద్దు..
4). తిరుపతి – కట్‌పడి, గుంతకల్ – డోన్, కర్నూల్ సిటీ – గుంతకల్లు రైళ్లు రద్దు..
5). రేపల్లె – తెనాలి, విజయవాడ – నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు..
6). మచిలీపట్నం – విజయవాడ, మచిలీపట్నం – గుడివాడ రైళ్లు రద్దు..
7). నర్సాపూర్ – నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు..
ఎంఎంటీఎస్‌లు రైళ్లు రద్దు..

ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన ద.మ. రైల్వే..
24వ తేదీ కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది.
ఇందులో హైదరాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌లు ఉన్నాయి.

LEAVE A RESPONSE