– దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం
– హిల్ట్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డికి లంకె బిందెలు
– ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి తమ అనుచరులను అక్కడి 22 ఎస్టేట్స్ కి పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం
– పరిశ్రమలను తరలించడానికి గల ముఖ్య కారణమేంటో చెప్పాలి
– దీనిపై ఇదివరకు ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమైనా జరిగిందా ?
– ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా బయట పెట్టినారా ?
– రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా రుజువులతో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో హిల్ట్ భూ కుంభకోణంపై వివరించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ కుంభకోణానికి పథకం వేశారని అన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరిస్తూ.. నవంబర్ 22 న G.O నెంబర్ 27 తీసుకొచ్చి 9292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్స్ లను మల్టీ జోన్స్ క కన్వర్ట్ చేయడానికి ఈ పథకం వేశారన్నారు. కేవలం SRO వాల్యూ లొ 30% శాతానికి దారదాత్తం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. అనేక పారిశ్రామిక వాడల భూములు లాభసాటిగా లేవని, మూతపడినదని, పొల్యూషన్ పేరిట SRO వాల్యూ లో కేవలం 30% కే అప్పజెప్పి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. దాదాపు ఈ ఆస్తి విలువ 6.30 లక్షల కోట్లకు పైనే ఉంటుందని, దీంతో రాష్ట్ర అప్పును సైతం తీర్చేయొచ్చునని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పాలకులు ప్రజల ఆస్తిని కొల్లగొడుతూ క్లెప్టోక్రిసి పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. సామాన్యులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించుటకొరకు గతంలో పారిశ్రామిక వాడలుగా గుర్తించిన ఈ భూములను, ORR వెలుపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. హిల్ట్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డికి లంకె బిందెలు దొరికాయని అన్నారు. ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి తమ అనుచరులను అక్కడి 22 ఎస్టేట్స్ కి పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ పాలసీ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
ఈ 6 లక్షల 30 వేల కోట్లను రాష్ట్ర ఖజానాకు తరలిస్తే, రాష్ట్ర అప్పు తీర్చొచ్చని, లేని యెడల అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. కేవలం తమ స్వార్థం కోసమే, దేశంలో రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని ఉద్దేశ్యంతో ఈ కుంభకోణానికి తెరలేపారని అన్నారు. మొన్నటికీ మొన్న ORR పరిధిలో కోకపేట లో ఎకరాకు 137 కోట్లు వేలం పలికిందని తెలిపారు. ఈ లెక్కన సగానికి అనుకున్న 68 కోట్ల చొప్పున చూసిన 6.30 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. కనీసం TGIIC రేట్ ను కూడా లెక్కలోకి తీసుకోకుండా కేవలం SRO వాల్యూ లో 30 శాతానికి ఇచ్చి, వారికి సకలార్యాధలు చేసి రాష్ట్ర ఖజానాకు గండి పడే విధంగా ఈ జీ ఓ ఎందుకు తీసుకొచ్చారో తెలపాలన్నారు. అనేక సార్లు రాష్ట్ర అప్పు గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ ఆస్తి తో రాష్ట్రాన్ని గాడిలో పెట్టవచ్చని తెలియదా అని అన్నారు.
గత ప్రభుత్వంలో సీఎం గా కేసీఆర్ సైతం ఇలాంటి పాలసీ తీసుకొచ్చి వేల ఎకరాల భూ కుంభకోణం చేశారని దుయ్యబట్టారు. వాళ్ళు దొంగలుగా మారారని మీరు గజ దొంగలుగా మారతాము అనడం సబబు కాదన్నారు, గత పాలకులు తప్పిదం చేస్తే ఎంక్వైరీ వేసి దోషులను శిక్షించాల్సింది పోయి, అదే తోవలో నడవడం సరికాదన్నారు. కనీసం కేబినెట్ లో లోతైన చర్చ జరపకుండా డ్రాఫ్ట్ కాపీలను సైతం మంత్రులను నమ్మకుండా వారి వద్ద నుండి తిరిగి తీసుకున్నారంటే దీనిపై లోతైన చర్చ తప్పక జరపాలని డిమాండ్ చేశారు. బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడుతూ దీనిపై సబ్ కమిటీ వేశామని అంటున్నారు, మరి ఈ సబ్ కమిటీలో ఎవరెవరూ పాల్గొన్నారు, ఏ అధికారులు పాల్గొన్నారు, ఈ వివరాలు ప్రజా క్షేత్రంలో బయట ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పాలన్నారు.
పరిశ్రమలను తరలించడానికి గల ముఖ్య కారణమేంటో చెప్పాలి, కేవలం పొల్యూషన్ పేరిట షిఫ్ట్ చేస్తామనడం పట్ల దీనిపై ఇదివరకు ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమైనా జరిగిందా అన్నారు. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా బయట పెట్టినారా అని అన్నారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వాడల్లో పేరుకుపోయిన పారిశ్రామిక వ్యర్థాలు, మరియు కలుషితమైన భూమి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రెసిడెన్షియల్ జోన్ కి కన్వర్ట్ చేయడానికి అక్కడ తిరిగి ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమైనా జరిగిందా, పారిశ్రామిక వాడల వ్యర్థాలతో అక్కడ గ్రౌండ్ వాటర్ సైతం కలుషితం అవుతుందని ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. మరి నిజంగా ఈ 22 పారిశ్రామిక వాడల్లో అన్ని పరిశ్రమలు పొల్యూషన్ కి చెందినవేనా, అందులో ఇతర పొల్యూషన్ ప్రభావం లేని పరిశ్రమలు లేవా లేదా అన్ని పరిశ్రమలు షిఫ్ట్ చేస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ హిల్ట్ పాలసీ ను ఉపసంహరించుకోవాలి అలాగే ఈ జీ ఓ ను రద్దు చేయాలన్నారు.
మరి భావితరాలకు చెందాల్సిన ఆస్తిని అప్పనంగా ఎవరికి దారబోస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. SRO వాల్యూ లో 30 శాతానికే ఎందుకు కేటాయించాల్సి వచ్చింది, సబ్ కమిటీ రిపోర్ట్, ఎన్విరాన్మెంటల్ స్టడీ రిపోర్ట్ ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ హిల్ట్ పాలసీని, సంబంధిత G.O ను తక్షణమే రద్దు చేయాలని లేని యెడల భారతీయ జనతా ఖచ్చితంగా ఈ కుంభకోణం పై ఉద్యమం చేస్తుందని, ప్రజా క్షేత్రంలో దోషులను నిలబెట్టేవరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.





