– సప్తముఖ గణేశుడిరూపంలో దర్శనం
హైదరాబాద్ : గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు.
ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి లంబోదరుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఖైరతాబాద్ గణేషుడు రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈసారి కూడా హైట్‌లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో… ఈ ఏడాది సప్తముఖ గణేశుడిరూపంలో దర్శనమివ్వనున్నాడు. గతేడాది (2023) పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.