– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 11 :మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తోపాటు నోడల్ అధికారి దివ్యతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ డ్రైవర్ కమ్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలల్లో పెరిగినందున ప్యాకేజీ పెంచాలని కోరారు.
అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.