– విరిగి పడిన కొండచరియలు 80 మంది మృతి
– కేరళలో నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ ప్రభుత్వం
వయనాడ్ : కేరళలోని వయనాడ్ లో ప్రకృతి విలయం ధాటికి మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మృతదేహాలు లభ్యమయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని సీఎస్ వేణు తెలిపారు. దాదాపు 116 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. కాగా అక్కడ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. బాధితులు తమను కాపాడాలంటూ ఆత్మీయులకు ఫోన్లు చేసి వేడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.