Suryaa.co.in

Andhra Pradesh

సర్వర్లు మొరాయించటంతో జనం పడిగాపులు

-ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ధరలు
-ధరలు పెంచనుండటంతో జనం క్యూ

ఏపీ వ్యాప్తంగా భూముల ధరలు పెరగనున్నాయి. అయితే.. గతేడాది రేట్లు పెంచిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన చోట్ల మాత్రమే పెంచనుంది. ప్రధానంగా డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రేట్ల పెంపునకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. అదేసమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్లు మొరాయించటంతో జనం ఇబ్బంది పడ్డారు.ఏపీలో భూముల ధరలు పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఫస్ట్‌ నుంచి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగనుంది.

దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు హైక్‌ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది.

అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్‌ రేట్లు పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది ఏపీ సర్కార్ భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది.

ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం దండిగా వచ్చింది. సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటున 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ నడుస్తోంది.

ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటీవల తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తాజాగా.. ఇవాళ కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భూముల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్యూ కట్టారు. అయితే.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని సర్వర్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సర్వర్లు మొరాయించటంతో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల దగ్గర జనం పడిగాపులు కాయాల్సి వచ్చింది.

గుంటూరు జిల్లా పెదకాకాని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు రిజిస్ట్రేషన్ లు అదిక సంఖ్యలో ఉన్నాయి రిజిస్ట్రేషన్లు చాలా నెమ్మదిగా జరిగుట వలన ప్రజలు ఉదయం నుండి అదిక సంఖ్యలో వెచి ఉన్నారు వివిధ కారణాలు చెప్పి రిజిస్ట్రేషన్లు సరిగా చేయని కార్యాలయ సిబ్బంది మహిళలు అదిక సంఖ్యలో ఉన్నారు వీరికి కనీసం త్రాగడానికి నీరు ఉండటానికి నీడ కూడ లేకుండా చెట్ల క్రింద ఉండవలసి రావడం విచార కరం

LEAVE A RESPONSE