– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
‘నీళ్లు’ నిధులు’ నియామకాలు’ అనే స్ఫూర్తికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుంది అంటున్న కేటీఆర్ మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది.కేటీఆర్ చెబుతున్న ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి వెళ్లాయి. కేటీఆర్ అంటున్న ‘సమగ్ర, సమతుల్య, సమ్మిళిత’ అభివృద్ధి పేరుమీద… కోట్ల రూపాయలు దండుకున్నారు.
తెలంగాణ ప్రజల సొమ్ముతో… విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నారు.’ధరణి’ పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూములను కొల్లగొట్టారు.దేశ ప్రజలకు చేసిన మంచి ఏంటో దమ్ముంటే చెప్పాలని బిజెపికి కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నా… ఎక్కడికి రమ్మంటారో… టైం & డేట్ కేటీఆరే చెప్పాలి. కేసీఆర్ ‘కుటుంబ, అవినీతి, నియంతృత్వ’ పాలనపై కూడా ఎక్కడైనా చర్చకు సిద్ధం. దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలి.
కేటీఆర్ పొర్లు దండాలు పెట్టినా… కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కారు. ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ నే.తెలంగాణలో దోచుకున్న అవినీతి సొమ్ముతో… దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్న ‘బీఆర్ఎస్’ ను, ప్రజలే బొందబెడతారు.ప్రపంచవ్యాప్తంగా మోడీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే… కేటీఆర్ బిజెపిపై, మోడీపై చిల్లరమల్లర ఆరోపణలు చేస్తున్నారు.
మీలా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు… సమిష్టి నిర్ణయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుంది. కేసీఆర్ ‘కమీషన్ల సర్కార్’ ను సాగణంపాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు.అవినీతిరహిత, పారదర్శక ప్రభుత్వానికే ప్రజలు పట్టం గడతారు. అది బిజెపి తోనే సాధ్యం.