– దార్శనికత, భవిష్యత్ ఆలోచనలు, సంపదసృష్టిలో చంద్రబాబుని మించినవారు లేరనే వాస్తవాన్ని వైసీపీనేతలు, మంత్రులు, పేటీఎమ్ బ్యాచ్ తెలుసుకోవాలి
• మహిళల ఆర్థిక, సామాజిక, ఉన్నతికి తెలుగుదేశం ఎప్పుడూ ముందే ఉంటుంది
• జగన్ అమలుచేస్తున్నపథకాల్ని టీడీపీ తప్పుపట్టలేదు. వాటి అమలుతీరు, అనుసరిస్తున్న విధానాలనే ఎత్తిచూపింది
• ప్రజలకు 10పైసలిస్తూ, వారిజేబులనుంచి 100పైసలు లాక్కోవడం సంక్షేమంకాదు
– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ఆవిర్భావంనుంచే తెలుగుమహిళల ఆర్థిక, సామాజిక ఉన్నతికి తెలుగుదేశం పార్టీ అనేకచర్యలు తీసుకుందని, మహిళల్ని సంబోధించే తీరునుంచి వారిని గౌరవించేవరకు స్వర్గీయఎన్టీఆర్, చంద్రబాబులు అమిత ఆదరాభి మానాలతో వ్యవహరించారని, మహిళలకు ప్రత్యేకస్థానంకల్పించడంలో టీడీపీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా ట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
“ చంద్రబాబు మహానాడులో మహిళాశక్తిపేరుతో ప్రకటించిన హామీలన్నీ తెలుగింటి ఆడపడచుల్ని అన్నిరంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తాయని చెప్ప డం అతిశయోక్తికాదు. మహిళల భద్రత, భరోసా, వారి బంగారుభవిష్యత్ కు బాటలువేసేలా టీడీపీఅధినేత మహిళాశక్తిపేరుతో పథకాలు ప్రకటించారు. రాష్ట్రం లోని అన్నివర్గాలప్రజల భవిష్యత్ కు గ్యారంటీ ఇస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీ లపై వైసీపీనేతలు, ఆపార్టీ సోషల్ మీడియా, అవినీతిమీడియాలు కారుకూతలు కూస్తున్నాయి.
సంక్షేమపథకాలు అమలుచేయడమంటే ప్రజలచేతికి పదిపైసలు ఇచ్చి, వారి జేబులనుంచి 100పైసలు లాక్కోవడం కాదు
జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమపథకాల్ని చంద్రబాబు తప్పుపట్టలేదు . వాటి అమలుని, విధానపరమైన నిర్ణయాలనే తప్పుపట్టారు. రాష్ట్రాన్నిలూఠీ చేస్తూ, ప్రజల్ని అప్పులపాలుచేస్తూ, సంక్షేమపథకాలు అమలుచేయడాన్ని తీ వ్రంగా వ్యతిరేకించారు. ప్రజలచేతికి పదిపైసలు ఇస్తూ, వారిజేబులనుంచి 100పై సలు లాక్కోవడంపై టీడీపీఅధినేత ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకి సంపద సృష్టించే శక్తి, ఆలోచన, దార్శనికత ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రకటించిన హామీ ల అమలుపై వైసీపీనేతుల, పేటీఎమ్ బ్యాచ్ ఎలాంటిసందేహాలు పెట్టుకోనవసరం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్కకుమిక్కిలిహామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాల్ని నకిలీరత్నాలుగామార్చి, ప్రజల్ని దారుణంగా వంచించాడు
అధికారంలోకి రావడానికి ఆడబిడ్డలకు మాయమాటలుచెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాకకూడా వారినివంచిస్తూ, తనపబ్బం గడుపుకుంటున్నా డు. ప్రతిపక్షంలోఉన్నప్పుడు లెక్కకుమిక్కిలి హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రి కాగానే వాటన్నింటిని చెత్తబుట్టలో పడేసి, ననరత్నాలన్నాడు. పోనీ అవైనా సక్ర మంగా అమలుచేశాడా అంటే అదీలేదు. నవరత్నాల్ని నకిలీరత్నాలుగా మార్చాడు.
సన్నబియ్యం హామీపై ప్రశ్నించినవారిని నీయమ్మమొగుడు చెప్పాడా అని దూషించడం మొదలు అమ్మఒడి, మద్యపాననిషేధం వరకు అన్నింట్లో మహిళల కు వంచనే మిగిల్చాడు. అమ్మఒడిపై భారతిరెడ్డితో కల్లబొల్లి మాటలు చెప్పించి, అంతిమంగా మహిళల్ని వంచించిన జగన్ తీరుని తప్పుపడుతూ చంద్రబాబు ‘తల్లికి వందనం’ కార్యక్రమంప్రకటించారు.
ధరలుపెంచి, పన్నులతో మహిళల్ని దోచుకుంటున్న జగన్ రెడ్డికి మహిళలపై జరిగే దారుణాలు కనిపించవా?
రాష్ట్రంలో దిగువ, ఎగువమధ్యతరగతివర్గాలతో పాటు, ఉన్నత వర్గాల వారు కూడా పెరిగిన నిత్యావసరాలధరలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అన్నింటికంటే ఘోరంగా జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలపై కన్నెర్రచేస్తున్నారు. ఆస్తిపన్ను, చెత్త పన్ను, కుళాయి పన్నులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి 45ఏళ్లు నిండినమహిళలకు ఇస్తా నన్న పింఛన్ హామీని తుంగలోతొక్కాడు. ఒకఇంట్లో ఎంతమంది చదువుకుంటే, అందరికీ అమ్మఒడిఅనిచెప్పి, ముఖ్యమంత్రికాగానే లేదు ఒక్కరికే ఇస్తానని నా లుక మడతేశాడు. దళితమహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగు తున్నా ముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడు?
జగన్ దుర్మార్గపు పాలనలో పుస్తెలుతాకట్టుపెట్టు దుస్థితికవచ్చిన మహిళల్ని అదుకోవడానికి, వారికి అండగా నేనున్నాను అనిచెప్పడానికే చంద్రబాబు మహళాశక్తిపేరుతో పథకాలు ప్రకటించారు
జగన్ దుర్మార్గపు పాలనలో ఆఖరికి పుస్తెలు తాకట్టుపెట్టే దుస్థితికివచ్చి, నిత్యం కన్నీళ్లతో బతుకుతున్న మహిళలకు అండగా ఉండాలనే మహిళాశక్తిపేరుతో చంద్రబాబు పథకాలు ప్రకటించారు. వాటిపై మంచిమనసున్న వ్యక్తులుగా చేత నైతై వైసీపీనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. అంతేగానీ నోటి కొచ్చినట్లు మాట్లాడటం ఏమిటి? మాజగనన్న..మాజగనన్న అనిఎగిరిపడిన వాళ్లకు జగన్ సభలకు వస్తున్న మహిళల్ని వేధించినతీరు కనిపించడంలేదా?
కాలకృత్యాలుకూడా తీర్చుకోవడానికి వీల్లేకుండా మహిళలు ముఖ్యమంత్రి సభ ల్లో మగ్గిపోతున్నా ఏనాడూ మహిళాకమిషన్ స్పందించలేదు. నిన్న హానుమా యమ్మను వైసీపీనేత కిరాతకంగా ట్రాక్ట్రర్ తో తొక్కించిచంపితే మహిళా కమిషన్ నిద్రపోతోందా? పాలకొల్లులో దళితులభూముల్లోని మట్టిని వైసీపీఎమ్మెల్యే దారు ణంగా దోచుకుంటుంటే, దాన్నిప్రశ్నించిన మహిళలచీరలులాగి, వారిని అనరాని మాటలన్నారు. ఈదారుణం మహిళాకమిషన్ కు కనిపించలేదా? సంబంధంలేని వాటిపై అతిగాస్పందించి కొవ్వొత్తులతో నిరసనలు తెలిపే మహిళాకమిషన్ కు మహిళలు అనుభవిస్తున్నదారుణాలు కనిపించడంలేదా?
తల్లులముందు బిడ్డల్ని, బిడ్డల ముందు తల్లుల్ని వేధించడం, చంపడం, రాజధా ని మహిళల్ని పోలీసులతో కొట్టించడం ఇదేనా జగన్ అమలుచేస్తున్న మహిళా సంక్షేమం? హోంమంత్రి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే నోరుతెరుస్తుంది. ఆడవాళ్లు కూడా సాటిఆడబిడ్డల్ని పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటే, బాధ్యతగల నాయకుడిగా చంద్రబాబు మహిళలకోసం మహిళాశక్తిని ప్రకటించారు. ఎన్నికల కోసం టీడీపీఎదురుచూడటంలేదు..ప్రజలే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని తరిమేద్దామా అని వేయికళ్లతోఎదురుచూస్తున్నారు. 151 మంది సంతోషంగా ఉంటే, ప్రజలంతాసంతోషంగా ఉన్నట్టుకాదు. సోషల్ మీడియాలో మమ్మల్ని ఉద్దేశించి దుష్ప్రచారంచేసేవారి లెక్కలన్నీ తేలుస్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పే.టీ.ఎమ్ బ్యాచ్ కు చుక్కలుచూపిస్తాం.” అని అనిత హెచ్చరించారు.