Suryaa.co.in

Andhra Pradesh

చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు

-టీడీపీ నేతల మాటలనే అమిత్‌షా చెప్పారు
-ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి, అప్పుడు -బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేది
-వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి

చిత్తశుద్ధితో నడుస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. బీజేపీ.. టీడీపీ ట్రాప్‌లో పడిందని విమ‌ర్శించారు. టీడీపీ నేతల మాటలనే అమిత్‌షా చెప్పారు. అమిత్‌షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలే. వారంతా పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే అని సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాలో మాట్లాడారు.

బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడింది.. పసుపు కండువా మార్చి, కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళ మాటల్ని అమిత్ షా పలకడం దారుణమని మండిపడ్డారు. చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని ఫైరయ్యారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి, అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని హితవు పలికారు.

2014-19 వరకు టీడీపీతో కలిసున్న బీజేపీ.. అప్పుడు ఏం చేసిందని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్కమాటైన చెప్పకుండా.. 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని అమిత్ షా అడుగుతున్నారని త‌ప్పుప‌ట్టారు.

LEAVE A RESPONSE