విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ కుటుంబసభ్యులు, ఆయన ఆడిటర్‌ను సామూహికంగా కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ హేమంత్‌కు ఘనమైన నేర చరిత్ర ఉంది. ఇప్పుడు విశాఖ జనం హేమంత్ గురించే చర్చించుకుంటున్నారు.
విశాఖ ఎంపీ ఎం. వి. వి. సత్యనారాయణ భార్య, కుమారులతో పాటు ప్రముఖ ఆడిటర్ జీ వెంకటేశ్వరరావు (జీవీ)ని కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ హేమంత్ రేవిడి పద్మనాభం దగ్గర దొరికినట్టు తెలిసింది.
ఎం. వి. వి. సినిమాలు తీసే సమయంలో రౌడీషీటర్ హేమంత్ ఆయన వెంటనేవుండేవాడని తెలిసింది. అయితే గన్ మాన్లు ఎంపీ ఎంవీవీని అలర్ట్ చేయడంతో అప్పటి నుంచి హేమంతు ను దూరంగా పెట్టారు. అయితే ఎం. వి. వి. దగ్గర వున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో ఈ రౌడీషీటర్కు పరిచయం వున్నట్టు తెలిసింది.
ఈ పరిచయంతోనే ఎం. వి. వి. కుమారుడ్ని సునాయాసంగా హేమంత్ కిడ్నాప్ చేయగలిగాడు. తరువాత ఎం. వి. వి భార్యను కూడా కిడ్నాపర్ పిలిపించి బంధించాడు. వారు కోరిన సొమ్ము పట్టుకొని ఆడిటర్ జీవీ వెళ్ళి ఆయన కూడా కిడ్నాపర్ల చెరలో చిక్కు కున్నట్టు తెలుస్తోంది.
హేమంతకుమార్ గతంలో కార్పొరేటర్ విజయారెడ్డి హత్య కేసులో ముద్దాయి. అంతేకాకుండా గతంలో రెండు సార్లు ఇద్దరు రియల్టర్లను కిడ్నాప్ చేసిన చరిత్ర ఈ రౌడీషీటర్ హేమంత్ కు వుంది.