– 2014-19 మధ్య చంద్రబాబు మూలధన వ్యయానికి భారీ కేటాయింపులతో ఎక్కువ శాతం ఖర్చు చేసి రాష్ట్రానికి సంపద సృష్టిస్తే.. 2019-23 మధ్య జగన్ రెడ్డి మూలధన వ్యయానికి భారీగా కోతపెట్టి ఉన్న రాష్ట్ర సంపదను లూటీ చేసి నేడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అవతరించాడు
-జగన్ రెడ్డి విధ్వంసకర పాలనకు అధ:పాతాళానికి పడిపోయిన మూల ధన వ్యయం తాజా తార్కాణం
– రివర్స్ గేర్ లో నడిచే జగన్ సర్కార్ దేశంలో మూలధన వ్యయం ఖర్చులో కూడా రివర్స్ లో నడిచి నేడు క్రిందినుంచి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది
– 2022-23లో దేశంలోని 25 రాష్ట్రాలలో మూల ధన వ్యయానికి ఎంత ఖర్చు చేశారో బ్యాంక్ ఆఫ్ బరోడా తన నివేదికలో వెల్లడించింది
– ఈ నివేదికలో మనమందరం తల దించుకునేలా మన రాష్ట్రం 23% ఖర్చుతో అట్టడుగున 25వ స్థానంలో నిలిచింది
– 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూలధన వ్యయానికి బడ్టెట్ లో కేటాయించిన దానిలో సగటున 93% ఖర్చు చేయటం జరిగింది
– జగన్ సర్కార్ 2019-23 మధ్య మూల ధన వ్యయానికి బడ్జెట్ కేటాయింపులో సగటున కేవలం 44.2% మాత్రమే ఖర్చు చేసింది. ఇది చంద్రబాబు పెట్టిన ఖర్చులో సగం కంటే తక్కువ
-ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే మూల ధన వ్యయం చాలా అవసరం
-చంద్రబాబు 2014-19 మధ్య మూల ధన వ్యయానికి భారీగా ఖర్చు చేసి రాష్ట్రానికి సంపద సృష్టించారు
-2019-నుండి జగన్ రెడ్డి రాష్ట్ర సంపదను దోచుకోవడమే తప్ప మూలధన వ్యయం చేసి రాష్ట్రానికి సంపద సృష్టించిన దాఖలాలు లేవు
-గత నాలుగు సంవత్సరాలలో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా ఎదిగిన జగన్ రెడ్డి రాష్ట్రంలో సంపదను సృష్టంచడంలో ఘోరంగా విఫలమయ్యాడు
-దేశంలో 4 రాష్ట్రాలు మూలధన వ్యయం కేటాయింపుల కంటే అదనంగా ఖర్చు చేసి వంద శాతంకు పైగా పర్సంటేజీని సాధించటం జరిగింది
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
2014-19 మధ్య చంద్రబాబు మూలధన వ్యయానికి భారీ కేటాయింపులతో ఎక్కువ శాతం ఖర్చు చేసి రాష్ట్రానికి సంపద సృష్టిస్తే.. 2019-23 మధ్య జగన్ రెడ్డి మూలధన వ్యయానికి భారీగా కోతపెట్టి ఉన్న రాష్ట్ర సంపదను లూటీ చేసి నేడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అవతరించాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
జూన్ 22వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మూల ధన వ్యయానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో వారు అధ్యయనం చేసిన దేశంలోని 25 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందన్న విషయం తెలిసి రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘనతకి కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయానికి బడ్జెట్ లో చేసిన కేటాయింపుల్లో కేవలం 23.1 శాతం మాత్రమే ఖర్చు చేసి రాష్ట్రానికి దేశంలోనే అట్టడుగు స్థానం సంపాదించి పెట్టారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
దేశంలోని 4 రాష్ట్రాలు మూల ధన వ్యయానికి సంబంధించి చేసిన కేటాయింపుల్లో 100%కు మించి ఖర్చు చేస్తే.. 11 రాష్ట్రాలు 80 శాతం కు మించి ఖర్చు చేయడం జరిగింది. ఆఖరికి ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్, త్రిపుర కూడా 47.7, 41.3 శాతం అంటే మనకంటే మెరుగ్గా ఖర్చు చేస్తే.. మనం మాత్రం అత్యంత హీనంగా వాటిలో సగం కూడా ఖర్చు చేయకుండా కేవలం 23.1 శాతంతో అట్టడుగున నిలిచాం.
ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మూలధన వ్యయం అత్యంత కీలకం. రాష్ట్రాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలు, ఎయిర్ పోర్టులు, ఆసుపత్రలు, విద్యాలయాలు మెదలగు మౌలిక సదుపాయాలు మెరుగు పడాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మూల ధన వ్యయానికి ఎక్కువగా బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేయాల్సి వుంటుంది. కాని మన దురదృష్టం గత 4 సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ రెడ్డి ఆ విధంగా ఖర్చే చేయకపోవడంవల్ల మూల ధన వ్యయం భారీగా పడిపోయి, రాష్ట్రం నేడు దేశంలోనే అట్టడుగు స్థానానికి చేరుకుంది.
అదే 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏ రకంగా జరిగిందో మనకు ప్రత్యక్ష ఉదాహరణలు అనేకం కనబడతాయి. పోలవరం ప్రాజక్టు నిర్మాణం వేగంగా ముందుకు కదలినా, గుంతలు లేని రోడ్లు రాష్ట్రం మొత్తం విస్తరించినా, అమరావతి రాజధాని నిర్మాణం పరుగులు పెట్టినా, ఇంకా అనేక ప్రజా ఉపయోగ నిర్మాణాలు సాకారమైనా అది చంద్రబాబు గారు 2014-19 మధ్య మూల ధన వ్యయానికి బడ్జెట్ లో చేసిన కేటాయింపుల్లో అత్యధిక శాతం ఖర్చు చేయడం వల్ల సాధ్యమైంది. 2014-19 మధ్య చంద్రబాబుగారు బడ్జెట్ కేటాయింపుల్లో మూలధనానికి చేసిన ఖర్చు శాతం గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తేటతెల్లమవుతుంది.
చంద్రబాబు హయాంలో…
సంవత్సరం మూలధన వ్యయం బడ్జెట్ కేటాయింపుల్లో చేసిన ఖర్చు శాతం
2014-15 92 %
2015-16 144 %
2016-17 98 %
2017-18 61%
2018-19 70%
5సంవత్సరాల కాలంలో సగటున 93%
పై పట్టిక గమనించినట్లైతే 5 సంవత్సరాల కాలంలో సగటును 93 శాతం చంద్రబాబునాయుడుగారు తెలుగుదేశం హయాంలో మూల ధన వ్యయానికి చేసిన కేటాయింపులలో ఖర్చు చేయటం జరిగింది. అదే జగన్ సర్కార్ 2019లో అధికారంలోకి వచ్చాక గత 4 సంవత్సరాలలో మూల ధన వ్యయానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు శాతం భారీగా పడిపోయింది.
జగన్ రెడ్డి హయాంలో …
సంవత్సరం మూలధన వ్యయానికి
చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు శాతం
2019-20 38 %
2020-21 63 %
2021-22 53 %
2022-23 23%
4 సంవత్సరాల కాలంలో సగటున 44.2%
పై పట్టిక గమనించినట్లైతే జగన్ రెడ్డి గత 4 సంవత్సరాల కాలంలో మూల ధన వ్యయానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో చేసిన ఖర్చు సగటున 44.2 శాతం మాత్రమే. ఇది చంద్రబాబు గారు చేసిన ఖర్చు శాతంలో సగానికంటే తక్కువ. ఈ గణాంకాల ద్వారా రాష్ట్రంలో అదనంగా సంపద సృష్టించిందెవరు? ఉన్న సంపదను ధ్వంసం చేసి దోచుకున్నదెవరో చాల స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు ఉన్నా రాష్ట్ర విభజనానంతరం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర బడ్జెట్ నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నా కూడా మూల ధన వ్యయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయింపులు చేసి దానిలో అత్యధిక శాతం ఖర్చు చేశారు.
ఆ విధంగా రాష్ట్రానికి సంపద సృష్టించి తద్వారా పేదరిక నిర్మూలనకు చంద్రబాబు నడుం కట్టి రాష్ట్ర భవిష్యతుతకు బంగారు బాట వేశారు. కాని మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సంపదైన ప్రజా వేదిక కూల్చివేతతో తన పరిపాలనను ప్రారంభించింది. 4 సంవత్సరాల కాలంలో ఏమాత్రం సంపదను సృష్టించకుండా విపరీతంగా రాష్ట్ర సంపదను లూటీ చేసి నేడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అవతరించాడు. రాష్ట్ర ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపి, మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్ర బడ్జెట్ ను అమాంతం పెంచినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో దోహదపడే మూల ధన వ్యయానిన మాత్రం పూర్తిగా విస్మరించి రాష్ట్రాన్ని నాశనం చేశాడు.
ఈరోజు గుంతలమయమైన రోడ్లు దర్శనమిస్తున్నా, పోలవరం అటకెక్కినా అమరావతి నిర్మాణం కుదేలైనా వాటన్నింటికి కారణం జగన్ రెడ్డి మూల ధన వ్యయానికి దుర్మార్గంగా కోత వేయడమే.
దేశంలో నేడు మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిథితి లేదు. ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాలు మరియు మన పొరుగున ఉన్న రాష్ట్రాలు గత 4 సంవత్సరాల కాలంలో మూలధన వ్యయానికి బడ్జెట్ కేటాయింపుల్లో చేసిన ఖర్చు శాతం గమనిస్తే కఠోరమైన వాస్తవాలు బయటపడతాయి.
రాష్ట్రం 2019-23 మధ్యమూలధన వ్యయానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో సగటున చేసిన ఖర్చు శాతం
కర్ణాటక 110%
తమిళనాడు 86.2%
ఒరిస్సా 83.2%
తెలంగాణ 79.6%
ఛత్తీస్ గడ్ 75.1%
కేరళ 72.5%
ఆంధ్రప్రదేశ్ 44.2%
పై పట్టిక గమనించినట్లైతే చాలా ష్పష్టంగా 2019-23 మధ్య దక్షిణాది రాష్ట్రాలు, పొరగున ఉన్న రాష్ట్రాలు మూలధన వ్యయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారీగా ఖర్చు చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అభివృద్ధికి దోహదపడే మూలధన వ్యయాన్ని పూర్తిగా తగ్గించేసి తీరని నష్టం చేశాడు.
ప్రతి దానికి కోవిడ్ పై నెంప నెట్టే రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలోమూలధన వ్యయానికి ఇతర రాష్ట్రాల్లో చేసిన ఖర్చు చూసి ఏం జవాబు చెబుతారు? ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి కుంటుపడి ప్రజల ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అక్కడ మౌలిక సదుపాయాల నిరమమాణంకు పెద్దపీట వేసి మూల ధన వ్యయానికి చేసే ఖర్చును పెంచి తద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచి వారు ఆర్థికంగా తిరిగి నిలదొక్కుకోవడానికి అయా ప్రభుత్వాలు నడుం కడతాయి.
అదే పంథాలో మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వంగానీ, వివిధ రాష్టరాల ప్రభుత్వాలుగానీ కోవిడ్ వల్ల కొంత మందగించిన ఆర్థిక వ్యవ్థను తిరిగి గాడిలో పెట్టడానికి మూలధన వ్యయానికి, మౌలిక సదుపాయాల రూపకల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చి భారీగి ఖర్చు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయానికి కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపు కంటే అధికంగా 100శాతం మించి (101.2%)ఖర్చు పెట్టడం దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
ఈవిధంగా ఆయా రాష్ట్రాలలో ఉపాధి అవకాశాల నిర్మాణ రంగం ద్వారాగాని, వాటి అనుబంధ రంగాల ద్వారాగానీ లక్షలాద మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి వారు కొంత ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశంకలిగింది. మన దౌర్భాగ్యం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి ప్రయాత్నాలేమీ క పోవడం వల్ల మన రాష్ట్రంలోని కార్మికులు లక్షలాది మంది నేటికి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు… లేకపోతే ఇక్కడే ఆకలి చావులకు బలౌతున్నారు.
పై విషయాలన్నీ గమనించిన తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి జగన్ రాష్ట్రంలో ఎంత విధ్వంసం సృష్టించాడో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేశాడో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా గత 4 సంవత్సరాల కాలంలో కూడా మౌలిక సదుపాయాల రూపకల్పనకు మూల ధన వ్యయానికి ఎటువంటి ప్రాధాన్యత జగన్ రెడ్డి ఇవ్వలేదని గణాకాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితికి కారకులైన జగన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి లు రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం.