-జానారెడ్డి హయాంలోనే సాగర్ అభివృద్ధి
-మాటలు చెప్పే వారిని నమ్మకండి
-కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సాగర్ మనుగడ
-ఇందిరమ్మపాలన తెచ్చే బాధ్యత గిరిజనులదే
-జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి
‘‘అభివృద్ధికి జానారెడ్డి చిరునామా. సాగర్ అభివృద్ధిలో జానారెడ్డి అడుగుజాడలు కనిపిస్తాయి. పనులు చేయకుండా ముచ్చట్లు చెప్పే నాయకులను ఎన్నుకున్నందుకే నాగార్జునసాగర్ మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే సాగర్‌కు మనుగడ’’అని సీనియర్ నేత జానారెడ్డి తనయుడు, కాంగ్రెస్ పార్టీ యువనేత జైవీర్‌రెడ్డి అని పిలుపునిచ్చారు.
జానారెడ్డి ఎమ్మెల్యేగా లేని లోటు సాగర్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందుబాటులో ఉండని ఎమ్మెల్యే చెప్పినా అధికారులు మాట వినని పరిస్థితిలో ఉన్నారని, ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజల నాడి తెలిసిన కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ప్రజలదేనని, ముఖ్యంగా గిరిజన తండాల సమస్యలు తీరాలంటే మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించుకోవలసిన బాధ్యత మీపై ఉందని, ఆయన తండా ప్రజలనుద్దేశించి పిలుపునిచ్చారు.
జైవీర్‌రెడ్డి నిర్వహిస్తున్న గిరిజన చైతన్యయాత్రలో, గిరిజనుల స్పందన అపూర్వరీతిలో కనిపిస్తోంది. గిరిజన తండాల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. జానారెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండగా తమ సమస్యలు చెప్పిన వెంటనే పరిష్కారమయ్యేవని గిరిజనులు గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టు ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఓట్ల కోసం తమ తండాలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలయితే, అసలు కనిపించడం మానేశారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. బీఆర్ఎస్ను గెలిపించి తప్పు చేశామని పలువురు గిరిజనులు వాపోయారు.
దానికి స్పందించిన జైవీర్‌రెడ్డి.. అభివృద్ధికి చిరునామా అయిన జానారెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారో, మా కంటే మీకే ఎక్కువ తెలుసన్నారు. అలాంటి నాయకుడిని దూరం చేసుకున్న మీరు, ఇప్పటికయినా వాస్తవం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నెరవేరని హామీలు, ఎన్నికల సమయంలో అనేక ప్రలోభాలతో గెలిచిన ఎమ్మెల్యే అసమర్థతను గుర్తించారన్నారు. ఇకనయినా ఇందిరమ్మ పాలన తెచ్చుకోవడం తండాల బాధ్యత అన్నారు.
గిరిజన చైతన్య యాత్రలో భాగంగా మండలం లోని సపావత్తండా, గాసీరాం తండా, తేనేపల్లితండాల్లో జైవీర్‌రెడ్డి పర్యటించారు. మోసపూరిత హామీలతో తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ, గృహనిర్మాణానికి రూ.5లక్షలు, రూ.500లకే వంటగ్యాస్, నిరుద్యోగభృతి, రైతుబంధులాంటి పథకాలు అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, తగుళ్ళ సర్వయ్యయాదవ్, సూదిని జగదీష్‌రెడ్డి, కంచర్ల వెంకటేశ్వ ర్‌రెడ్డి, చెలమల్ల జగదీశ్వర్‌రెడ్డి, జాల చిన్నసత్తయ్య, రాధాకృష్ణ, నర్సింహ్మరావు, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.