– సొంత నియోజకవర్గం లో రోడ్లు వేయించలేని అసమర్థ ముఖ్యమంత్రి, రాష్ట్రానికేం చేస్తాడు?
• అన్నమయ్యప్రాజెక్ట్ ఎప్పుడు పునర్నిర్మిస్తాడో, కడపస్టీల్ ప్లాంట్ ఎప్పుడు పూర్తవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
• పేదలకు పంచాల్సిన భూమిని తనపార్టీవారికి, తనభజన బృందానికి దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు
• జగన్ అడ్డగోలుగా భూములు పంచితే న్యాయస్థానాల్ని ఆశ్రయించైనా అర్హులకు న్యాయంజరిగేలా చూస్తాం
• ప్రశ్నించేవారిని, ప్రతిపక్షాలను వేధించడానికి వెచ్చించే సమయంలో సగమైనా జగన్మోహన్ రెడ్డి తననియోజకవర్గ అభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేది
– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి తనతండ్రి జయంతి సందర్భంగా రెండురోజులు పులివెందుల వెళ్తు న్నారని, ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గానికి ఏంచేశాడో చెప్పాకే జగన్ అక్కడికి వెళ్లాలని, నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రంనిధుల్ని సక్రమంగా వినియోగించుకోలేని అసమర్థుడు జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ ముఖ్యమంత్రిస్థానంలో ఉండీ, పులివెందుల నియోజకవర్గానికి మంజూరైన రోడ్లను ఎందుకు పూర్తిచేయించలేక పోయాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎక్స్ టర్న్ లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద పంచాయతీరోడ్ల నిర్మాణానికి 500కోట్లు మంజూరైతే, 10శాతం పనులుకూడా చేయలేదు. సొంత నియోజకవర్గంలోని రహదారుల్ని తనకు ఓట్లేసిన ప్రజలే బాగుచేసుకోవడం ముఖ్యమంత్రికి కనిపించడంలేదా?
పులివెందుల నియోజకవర్గంలో రోడ్లువేయడానికి కాంట్రాక్టర్లు ఎందుకురావడంలేదు? భయపడి పనులు ఆపే సి ఎందుకు వెళ్తున్నారు? తనపార్టీ వారిదోపిడీ, బెదిరింపులు, కమీషన్ల కక్కుర్తికి జడిసే కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదని ముఖ్యమంత్రికి తెలియదా? పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
అన్నమయ్య ప్రాజెక్ట్ ని ఎప్పుడు పునర్నిర్మిస్తాడో, కడపస్టీల్ ప్లాంట్ ఎప్పుడు పూర్తవుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
మూడేళ్లక్రితం మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రూ.1200కోట్లు మంజూరైతే, ఆ పనులు 10శాతం పూర్తికాలేదు. 2019 నుంచి నేటివరకు పులివెందుల ఆయకట్టులో ఒక్క ఎకరాకు అదనంగా జగన్ రెడ్డి నీళ్లివ్వలేకపోయాడు. కేంద్రప్రభుత్వ నిధుల్ని కూడా నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు. పేదలకు కడతానన్న 8వేలఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలి.
నాలుగేళ్లలో రోడ్లు విస్తరించకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణకోసం కేటాయించిన రూ.600కోట్లు ఏమయ్యాయి? పులివెం దుల నియోజకవర్గానికి కేటాయించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల అంచనాలుపెంచి, దోపిడీకి సిద్ధమ య్యారుతప్ప, నాలుగేళ్లలో ఎక్కడా ఒక్కప్రాజెక్ట్ పూర్తిచేయలేదు. జమ్మలమడుగు మైదుకూరు నియోజకవర్గాలకు ఉపయోగపడే రాజోలి బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తాడో జగన్ సమాధానం చెప్పాలి. కడపస్టీల్ ప్లాంట్ నిర్మాణంలో జగన్ రెడ్డి ఒక్కఇటుకకూడా వేయకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్ని ఓట్లు అడుగుతాడు?
ఏడాదిన్నరక్రితం రాజంపేట నియోజకవర్గంలో కొట్టుకుపోయిన అన్నమయ్యప్రాజెక్ట్ ని ఎప్పుడు పునర్నిర్మిస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు సర్వంకోల్పోయిన కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ న్యాయంచేయలేదు. ప్రశ్నించేవారిని, ప్రతిపక్షాలను వేధించడానికి వెచ్చించే సమయంలో సగమైనా జగన్మోహన్ రెడ్డి తననియోజకవర్గ అభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేది.
పేదలకు పంచాల్సిన భూమిని తనపార్టీవారికి, తనభజన బృందానికి దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. జగన్ అడ్డగోలుగా భూములు పంచితే న్యాయస్థానాల్ని ఆశ్రయించైనా అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం.
భూమిలేని నిరుపేదలకు భూమిని కేటాయిస్తామన్న జగన్, వైసీపీ కండువా వేసు కున్నవారికి, తనపార్టీకి ఓటేసేవారికే భూములు కట్టబెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు? అసైన్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించకుండా, అనర్హుల కు భూములు కట్టబెట్టడంపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడు? వైసీపీ జడ్జీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వారి కుటుంబసభ్యులకు భూములు కేటాయిం చడానికి కడపజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సంతకాలు పెట్టడం సిగ్గుచేటు.
ముఖ్యమంత్రి అడ్డగోలుగా తనకు నచ్చినవారికి భూములు పంచుతానంటే చూస్తూ ఊరుకోం. దానిపై న్యాయ స్థానాలను ఆశ్రయించి అయినా అర్హులైన వారికి న్యాయంజరిగేలా చూస్తాం. అధికారయంత్రాంగం భూముల పంపిణీపై నిజాయితీతో వ్యవహరించాలని కోరుతు న్నాం. కడపజిల్లా కలెక్టర్, సీ.సీ.ఎల్.ఏ చట్టప్రకారం పనిచేసి, అసైన్ మెంట్ కమిటీ నియమనిబంధనలప్రకారం నడుచుకొని, అర్హులకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం. అహంకారంతో జగన్మోహన్ రెడ్డి తనపార్టీవాళ్లకు, తనభజన బృందానికి భూములుపంచితే టీడీపీప్రభుత్వం రాగానే వాటన్నింటినీ వెనక్కుతీసుకొని అర్హులకు పంచుతాం.
విలేకరులు అడిగినప్రశ్నలకు రామ్ గోపాల్ రెడ్డి సమాధానాలు…
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించిన చేపలమార్కెట్ ఎత్తేసేపరి స్థితికి వచ్చింది. రూ.2.50కోట్ల ప్రజాధనం దుర్వినియోగంచేయడం తప్ప, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదు. రాయలాపురం గ్రామంవద్ద బ్రిటీష్ హాయాంలో నిర్మించిన బ్రిడ్డిని కూల్చేసి, సాధారణబ్రిడ్జినే నిర్మిస్తున్నారుగానీ, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడంలేదు. తన నియోజకవర్గంలో రోడ్లువేయడానికి కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకురావడంలేదో ముఖ్యమంత్రే చెప్పాలి.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంకింద మూడుసం వత్సరాల క్రితం 214కిలోమీటర్ల రోడ్డు మంజూరైతే, ఈశ్వర్ రెడ్డి అండ్ కంపెనీకి పనులు కట్టబెట్టారు. మూడేళ్లైనా రెండుమీటర్లరోడ్డుకూడా వేయలేదు. ఇటీవల జిల్లాపరిషత్ సమావేశం లో ఇతర ఫోరంలలో నేను మాట్లాడితే, ఆ కాంట్రాక్ట్ సంస్థకు ఒకప్యాకేజీకి 10లక్షలు, మరోప్యాకేజీకి రూ.15లక్షల పెనాల్టీ వేశారు.
పెనాల్టీలు వేస్తే సమస్య పరిష్కారమవుతుందా? ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కాంట్రాక్టర్లు పనులు చేయకపోతే, రాష్ట్రంలో ఏంచేస్తారు? కేంద్రప్రభుత్వం రోడ్లువేయడానికి ఇచ్చిననిధుల్ని దుర్వినియోగం చేశారు కాబట్టే, కాంట్రాక్టర్లు పనులుచేయడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రిని నమ్ముకుం టే లాభంలేదనుకొనే ప్రజలు వారి సొంతఖర్చుతో రోడ్ల మరమ్మతులకు సిద్ధమయ్యారు.” అని రామ్ గోపాల్ రెడ్డి ఎద్దేవాచేశారు.