– అధికారం ఉంది కదా అని బరితెగించి వ్యవహరిస్తున్న వారికి ఎన్నికల తర్వాత బడితె పూజం ఖాయం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి రాష్ట్రంలో రౌడీయిజాన్ని చట్టబద్దం చేశారు. వైసీపీ అక్రమాలని వెలికితీసిన వారిపై వైసీపీ గూండాలు దాడులు తెగబడటం దుర్మార్గం. ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమాలు బహిరంగం చేశారని చదలవాడ అరవిందబాబుపై, కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గం.
మరో వైపు చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన టీడీపీ నేతలపై చెవిరెడ్డి అనుచరులు దాడులు చేశారు. పట్ట పగలే వైసీపీ గూండాలు బరితెగించి వ్యవరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
టీడీపీ నేతలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జగన్ రెడ్డి రౌడీ పాలనకు పుల్ స్టాప్ పడే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారం ఉంది కదా అని బరితెగించి వ్యవహరిస్తున్న వారికి ఎన్నికల తర్వాత బడితె పూజం ఖాయం.