శ్రీ కంచి శంకర పీఠం, శంకర మఠం, శ్రీ విద్యా సరస్వతీ శనైశ్చర క్షేత్రం, వర్గల్ లో 15, 16 తేదీలు శని, ఆదివారాల్లో జరిగే తెలంగాణ విద్వత్సభ సప్తమ వార్షిక విద్వత్సమ్మేళన ప్రారంభ కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణులు మరియు పండితుల గూర్చి చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సమాజ శ్రేయస్సుకై జరిపే విద్వత్సభ కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా ప్రోత్సాహించడం మన అదృష్టం అని ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్దిపేట జిల్లా చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు.
రాష్ట్రంలోని పండితులందరి సంపూర్ణ సహకారంతో ఈ విద్వత్సభ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధి లాగా కృషి చేస్తుందని సభాధ్యక్షులు, వర్గల్ దేవాలయ వ్యవస్థాపకు లైన యాయవరం చంద్రశేఖర శర్మ సిధ్ధాంతి అందరి హర్షధ్వానాల మధ్య అన్నారు.
ప్రస్తుత సమాజంలో కొందరు పండితులు ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేయుట శోచనీయమని ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ బగళాముఖి ఆలయ వ్యవస్థాపకులు శాస్త్రుల వేంకటేశ్వర శర్మ శాస్త్ర ప్రమాణం లేకుండా ప్రకటనలు ఎవ్వరూ చేయకూడదని సభాముఖంగా హితవు పలికారు. తెలంగాణ విద్వత్సభ కృషి అభినందనీయమని సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయ వ్యవస్థాపకులు చెప్పెల హరనాథశర్మ అన్నారు.
మన తెలంగాణ విద్వత్సభను ఇతర రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకుని ప్రయత్నం చేయుట గర్వకారణమని తె. రా. బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి గాడిచర్ల నాగేశ్వరరావు సిధ్ధాంతి సభికుల హర్షధ్వానాల మధ్య పలికారు. పండుగల నిర్ణయ విషయంలో మన సిద్ధాంతులందరు ఒక వేదికపైకి రావడం హర్షనీయమని తెలంగాణ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ అన్నారు. ఈ ఏడు సంవత్సరాలలో తెలంగాణ విద్వత్సభ ఏడు విజయాలు సాధించిందని, భేద దృష్టి లేనందువల్ల ఇది ఇలాగే శాశ్వతంగా కొనసాగుతుందని, ఇందులో అందరి కృషి ఉందని విద్వత్సభ ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిధ్ధాంతి కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు.
ఈ సభలో పాల్గొన్న వారందరికీ విద్వత్సభ కోశాధికారి మరుమాముల వేంకటరమణ శర్మ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మధ్యాహ్నం సభలో రాష్ట్రంలోని సిధ్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష, శాస్త్ర పండితులు అందరూ, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నుండి విచ్చేసిన ప్రధాన అర్చకులు, ప్రధాన పురోహితులు, స్థానాచార్యులు, ఇంకా రాష్ట్రం నలు మూలల నుండి విచ్చేసిన పురోహితులు, అర్చకులు, వేదపండితుల సమక్షంలో ధర్మ శాస్త్రానుసారం నిర్ణయిస్తారు. రేపు జరిగే సభలో విద్వత్సభ అధ్యక్షులు ప్రకటిస్తారని తెలిపారు.
ఉదయం 8 గంటలకు పార్నంది శివ కుమార శర్మ బాసర, వేదపండితులు వేద స్వస్తితో ప్రారంభమైంది. గంటి నరేశ్ శర్మ శంఖనాదం తర్వాత కొడకండ్ల రాధాకృష్ణ శర్మ , దేశపతి శ్రీనివాస శర్మ బృందంతో నామ సంకీర్తన కార్యక్రమం అద్భుతంగా జరిగిన అనంతరం జ్యోతి ప్రకాశనంతో సభ ప్రారంభమైంది.
ఈ సభలో గుడి సోమనాథ శర్మ సిధ్ధాంతి, జోషి ప్రశాంత శర్మ సిధ్ధాంతి, తూండ్ల కమలాకర శర్మ సిధ్ధాంతి, యతీంద్ర ప్రవణాచార్య సిధ్ధాంతి, నరేశ్ కులకర్ణి సిద్ధాంతి, త్రిగుళ్ల శ్రీనివాస శర్మ మొదలైన వారందరూ పాల్గొన్నారు.
ముందుగామరుమాముల వేంకట రమణ శర్మ స్వాగతం పలుకగా, రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి విద్వత్సభకు పూర్తి సహకారం అందిస్తుందని సభాధ్యక్షుల తొలిపలుకులలో అన్నారు. ప్రస్తుత అత్యంత ఆధునిక నెట్ కాలంలో ఈ విద్వత్సభ ఇంత ఘనంగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్వాలా నరసింహారావు కొనియాడారు.
తరువాత సుమారు 50 మంది సిధ్ధాంతులచే వంద మంది పాల్గొన్న సభలో ఏకోన్ముఖమై నిర్ణయించిన క్రోధి నామ సంవత్సర పండుగల జాబితాను విద్వత్సభ అధ్యక్షులు అందరి కరతాలధ్వనుల మధ్య ముఖ్య అతిథి గారికి అందజేశారు. అతిథులందరిని విద్వత్సభ ఘనంగా సత్కరించిందిదివ్యజ్ఞాన సిధ్ధాంతి వందన సమర్పణతో, శాంతి మంత్రాలతో కార్యక్రమం ముగిసింది.
ఈ సభలో ప్రతి సంవత్సరం ఆషాఢ బహుళంలో విద్వత్సభ విద్వత్సమ్మేళనం జరుగుతుందని, వచ్చే సంవత్సరం శ్రీ యాదాద్రి ప్రధానార్చకుల కోరిక మేరకు యాదాద్రిలో అష్టమ వార్షికోత్సవ విద్వత్సమ్మేళనం జరుగుతుందని తీర్మానం చేసారు.
సాయంత్రం 7 గంటల నుండి చిరంజీవి యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు చే అష్టావధానం జరిగింది. సభాధ్యక్షులుగా శాస్త్రుల వేంకటేశ్వర శర్మ , ముఖ్య అతిథిగా డా. జి. యం. రామ శర్మ , విశిష్ట అతిథిగా చెప్పెల హరనాథ శర్మ గారు, సంయోజకులుగా యం. దత్తాత్రేయ శర్మ , పృఛ్చకులుగా డా. జి. రఘురామ శర్మ, , నిషిధ్దాక్షరి, గీతా వ్యాఖ్యానం కె. వి యన్ ఆచార్య , ఎ. రాజశేఖర్ శర్మ అప్రస్తుత ప్రసంగం. కె పవన్ శర్మ న్యస్తాక్షరి, కె. హరిణి గారు వర్ణన, జి సత్యనారాయణ శర్మ సమస్య, శ్రీమాన్ నరసింహాచార్య ఆశువు, దత్తపది ఆర్. విశ్వేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అమరవాది రాజశేఖర్ శర్మ రచించిన సత్యనారాయణ స్వామి వ్రత పద్య గ్రంథం ఆవిష్కరణ చేసారు. అందరిని విద్వత్సభ పక్షాన అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిధ్ధాంతి ఘనంగా సత్కరించారు.
తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది. విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిధ్ధాంతి సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు, శ్రీమాన్ తి.న.చ. సంపత్కుమార కృష్ణమాచార్య సిధ్ధాంతి గారు సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ,రాబోవు శ్రీ క్రోధి నామ సంవత్సర పండుగల నిర్ణయం గూర్చి సమగ్రంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావడం జరిగింది.
ఈ సభలో పాల్గొన్న సిధ్ధాంత ప్రముఖులు, పంచాంగ కర్తలు
గాడిచర్ల నాగేశ్వరరావు సిధ్ధాంతి, చికిలి లక్ష్మీ వేంకటేశ్వర శాస్త్రి సిధ్ధాంతి, శ్రీ గుడి సోమనాథ శర్మ సిధ్ధాంతి, శ్రీ ఓరుగంటి మనోహర శర్మ సిధ్ధాంతి, శ్రీ తూండ్ల కమలాకర శర్మ సిధ్ధాంతి, శ్రీ బోర్పట్ల భాస్కరాచార్య సిధ్ధాంతి, శ్రీ బ్రహ్మాభట్ల శ్రీనాథశర్మ సిధ్ధాంతి, శ్రీ ఓరుగంటి రామారావు సిధ్ధాంతి, శ్రీ జోషి ప్రశాంత శర్మ సిధ్ధాంతి, శ్రీ S. T. G. యతీంద్ర ప్రవణాచార్య సిధ్ధాంతి, శ్రీ రాంభట్ల రాజేశ్వర శర్మ సిధ్ధాంతి, శ్రీ కొమ్మెర దత్తుమూర్తి సిధ్ధాంతి, శ్రీ బొర్రా వేంకటేశ్వర శర్మ సిధ్ధాంతి, శ్రీ నరేశ్ కులకర్ణి సిధ్ధాంతి,
శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శర్మ సిధ్ధాంతి, శ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ సిధ్ధాంతి, శ్రీ చింతలపల్లి రవి శర్మ సిధ్ధాంతి, శ్రీ యాత్రా యోగేశ్వర సిధ్ధాంతి,
శ్రీ యాయవరం రాజశేఖర శర్మ సిధ్ధాంతి మొదలైన వారే గాక శ్రీ యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీమాన్ నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన పురోహితులు శ్రీ గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గార్లతో పాటు మిగతా దేవాలయ ప్రధాన అర్చకులు, పురోహితులు, వేదపండితులు, స్థానాచార్యులు, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్వత్సభ సప్తమ వార్షికోత్సవ విద్వత్సమ్మేళనం – 2023 జులై 15, 16 తేదీలు శని,ఆది వారాల్లో జరిగిన రెండు రోజులలో రెండవ రోజు ఆదివారం ఉదయం 6 గంటలకు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి సిధ్ధాంతి , శ్రీ శంకరమంచి శివ శర్మ సిధ్ధాంతి , శ్రీ జ్యోషి ప్రశాంత శర్మ సిధ్ధాంతి గార్లు కలిసి శ్రీ సూర్య సిధ్ధాంత పారాయణంతో ప్రారంభమైంది. 9 గంటలకు శ్రీ విద్యా సరస్వతీ క్షేత్ర వేద పాఠశాల ఆచార్య, విద్యార్థులచే వేదపఠనం జరిగింది. తదుపరి శ్రీమతి మహావాది సంధ్యాలక్ష్మి, శ్రీ పాలెపు రాజేశ్వర శర్మ , శ్రీమతి కల్పవల్లి గారలచే జ్యోతిష ప్రధానమైన అంశాలపై ప్రవచనం జరిగింది.
11 గంటలకు సమాపనోత్సవ సభా కార్యక్రమం ప్రారంభమైంది. సభాధ్యక్షులుగా శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిధ్ధాంతి గారు, ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి శ్రీ జ్వాలా నరసింహారావు గారు, విశిష్ట అతిథులుగా శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, శ్రీ చెప్పెల హరనాథ శర్మ గారు, డా.శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి సిధ్ధాంతి గారు, శ్రీ యాదాద్రి దేవస్థాన ప్రధానార్చకులు శ్రీమాన్ నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.