Suryaa.co.in

Andhra Pradesh

పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఆదేశం

– వాలంటీర్లపై వ్యాఖ్యలు

అమరావతి: వారాహి యాత్రలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

జులై 9న ఏలూరు సభలో పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్‌ అయ్యారు.. మిగతా వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు.
G-O-RT-NO-16-001-2

LEAVE A RESPONSE