Suryaa.co.in

Andhra Pradesh

అదనపు పనిభారం, పలు నిబంధనలతో వీఆర్ ఏ, వీఆర్వోలను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది

– నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలిందిస్తున్న వారిని వేధించటం సరికాదు
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనిభారం పెంచి, పలు నిబంధనలు విధించి వీఆర్.ఏ, వీఆర్వోలను వేధింపులకు గురిచేస్తోంది. తమకు సంబంధం లేని విధులు కేటాయించి రాత్రింభవళ్లు పనులు చేయిస్తున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వీఆర్వోలకు ఏం సంబందం? ఇప్పటికే పలు రకాల పనులతో సతమతమవుతుంటే అధనంగా ఫిర్యాదుల కోసం వచ్చే ఫోన్ కాల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? రీ సర్వే పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

సర్వే సమయంలో భోజన ఖర్చులు వీఆర్వోలే భరిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వాటికి బిల్లులు చెల్లించటం లేదు. 8 ఏళ్ల నుంచి వీర్వోలుగా పనిచేస్తున్న వారిని గ్రేడ్ 1 పోస్టులో నియమించకుండా ప్రత్యేకంగా గ్రేడ్ 2 పోస్టు పేరుతో కేవలం రూ. 15 వేలు వేతనంగా ఇస్తున్నారు. వీ ఆర్వోలు పనిచేసేది తహసీల్దార్ కార్యాలయంలో కానీ వారికి వేతనాలిచ్చేది మాత్రం ఎంపీడీవో కార్యాలయంలో. ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి.

నిత్యం ప్రజలకు అందుబాటులో సేవలందిస్తున్న వీఆర్.ఏ, వీఆర్వోలను వేధించటం మానుకోవాలి. సర్వేకు సంబంధించి నిబంధనలు సడలించి ఒత్తిడి తగ్గించాలి. వీఆర్ఏ నుండి గ్రేడ్ -2 విఆర్వోలుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను వెంటనే ప్రొషిబేషన్ డిక్లేర్ చేసి పే స్కేలు అమలు చేయాలి.

వీఆర్వోలకు సచివాలయ విధులు ఎక్కువగా ఉన్నందున వారికి కావలసిన కంప్యూటర్ సిస్టంతో పాటు స్టేషనరీ ఏర్పాటు చేయాలి. సెలవులు, పండగ దినాలలో పని కల్పించకుండా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలి. అప్ గ్రేడ్ చేసిన పోస్టుల స్థానంలో అర్హులైన వీఆర్వోలను ఎంఆర్ఐ లుగా నియమించాలి.

LEAVE A RESPONSE