– రవాణా శాఖ కమిషనర్ క్లారిటీ
20,000 వేలు కాదు 2000 ఏపీలో వాహనాల డ్రైవర్లు ఇయర్ ఫోన్ లేదా హెడ్ సెట్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల రూపాయల ఫైన్’ ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారం దావానంలా వ్యాపించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఇంతలా జరిమానా విధిస్తారా అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. మరికొందరైతే గతంలో కోర్టులు తీర్పులను తెరపైకి తీసుకువచ్చి ఇది తప్పుడు నిర్ణయం అని ఖండిస్తున్నారు.ఆలు లేదు సూలు లేదు అల్లుడుపేరు సోమలింగం అన్నట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుందని కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఎట్టకేలకు రవాణా శాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ని
ధనల ప్రకారమే ఇప్పటివరకూ ఫైన్లు విధిస్తున్నట్లు వెల్లడించారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఇప్పటివరకూ హెడ్ సెట్ లేదా ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.1500 నుంచి రూ.2000 వరకూ జరిమానాలు విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
అలాగే వాహనదారులు పదే పదే ఈ నిబంధనను ఉల్లంఘించి ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే గరిష్టంగా రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీనికి విరుద్ధంగా రూ.20 వేల వరకూ ఫైన్ విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని…ఈ ప్రచారాన్ని నమ్మవద్దని రవాణా శాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు.