Suryaa.co.in

Andhra Pradesh

దొంగలు, అవినీతి పరులతో సిఎం కార్యాలయం

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

సిఎంఓలో సిఎం కి అధికారులకు తెలియకుండా క్రింది స్థాయి ఉద్యోగులు అధికారుల డిజిటల్ సిగ్నేచర్స్‌లో, లాగిన్ అయ్యి కొన్ని ఫైల్స్ క్లియర్ చేశారని పోలీసు కేసు పెట్టి కిందిస్థాయి ఉద్యోగులను అరెస్టు చేయడం శోచనీయం. పై అధికారులకు తెలియకుండా, ఫైల్స్ సిఎం సంతకంతో ఆమోదం పొందకుండా క్రిందిస్థాయి ఉద్యోగస్తులు ఆ ఫైల్స్ ఎలా క్లియర్ చేస్తారు?

ముమ్మాటికీ ఈ ఫైల్స్ అన్నీ పై అధికారులకు తెలిసే దొంగ డిజిటల్ సంతకాలతో, దురుద్దేశంతో లాగిన్ చేశారు. పై అధికారులను అరెస్టు చేయకుండా క్రిందిస్థాయి ఉద్యోగస్తులను తూతూ మంత్రంగా అరెస్టు చేయడం సరైనది కాదు.సిఎంఓ లోని వసూల్ రాజా, ఆయనే (మిస్టర్ 20%) కు తెలియకుండా ఏ ఫైల్ ముందుకు నడవదు, అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది.

వసూల్ రాజా (మిస్టర్ 20%) అవినీతి సంపాదనపై దర్యాప్తు చేయడం కోసం ఇద్దరూ రిటైర్డ్ పోలీసు అధికారులను మా పార్టీ నియమించింది. వసూల్ రాజాకి సంబంధించిన అవినీతి భాగోతం తమిళనాడు రాష్ట్రంలో పూనమల్లి హైవేలో ఆయన కొన్న భూములు వివరాలు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఆయన, ఆయన బినామీల పేరిట కొన్న ఆస్తుల వివరాలు సేకరించమని వారిని నియమించాం.

సిఎంఓ ప్రమేయం లేకుండా దొంగతనంగా క్లియర్ చేసిన ఫైళ్ల వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అవినీతి సామ్రాట్, వసూల్ రాజా, మిస్టర్ 20% గా పేరుగాంచిన అధికారిని, సిఎం సిఎంఓ నుంచి తరిమి కొట్టాలి.ముఖ్యమంత్రికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

సీఎంఓ లో జరిగిన అవినీతి బాగోతంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలి. సీఎంఓలో అవినీతి సూత్రధారిగా చెప్పబడుతున్న మామ ఎవరు? ఎవరికి మామ? ముఖ్యమంత్రి చెప్పాలి?

LEAVE A RESPONSE