Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాదు.. ఆయన క్యాష్ మహేష్ రెడ్డి

-చెత్త ఫెలోస్ ..మీరేంట్రా మా గురించి మాట్లాడేది? మేము పులులం. మీరు గుంటనక్కలు
-జగన్ రెడ్డి పెద్ద సైకో అయితే కాసు చిన్న సైకో
-కేవలం అవినీతి సొమ్ముతో కాసు బ్రహ్మానందరెడ్డి ట్రస్ట్
-తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మడం ద్వారా రోజూ ఎమ్మెల్యేకి రూ. కోటి
-నీ కూతురు వయసున్న 8 మంది పిల్లలు గుంతలో పడి చనిపోయారు
-మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు

గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన యువగళం పాదయాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టం. గురజాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్ అన్నట్టు మా నారా లోకేష్ కి ప్రజలు స్వాగతం పలికాం. గురజాల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అలియాస్ క్యాష్ మహేష్ రెడ్డి …నారా సారా అని విమర్శిస్తున్నాడు.

కాసు మహేష్ ఒకటి గుర్తుంచుకోవాలి. సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బ్రాండెడ్ లిక్కర్ తీసేసి రూ. 5 రూపాయల చీప్ లిక్కర్ అమ్ముతూ నెలకు రూ. 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. నాశిరకం మద్యంతో 60 వేలమంది ప్రాణాలను తీశాడు. లక్షమందికి పైగా ఆ విషపు నీరు తాగి పక్షవాతం బారిన పడ్డారు. జగన్ రెడ్డి పెద్ద సైకో అయితే కాసు చిన్న సైకో. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్మడం ద్వారా రోజూ ఎమ్మెల్యేకి రూ. కోటి అందుతోంది.

తాడేపల్లిలో ఉండే సైకోగాడు గురజాలలో ఉండే సైకో గాడిలా మేము ఎవరి పొట్ట కొట్టలేదు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు సారా డబ్బుతో కట్టారని విమర్శిస్తున్నారు. ఆయన ఇల్లు ఎప్పుడు కట్టారో మీకు తెలుసా? సారాయితో ఇల్లు కట్టుకోవాల్సిన ఖర్మ చంద్రబాబుకు లేదు. తాడేపల్లి కొంప అవినీతి డబ్బుతో కట్టారు. లక్ష కోట్ల అవినీతి చేసి ఖైదీ నెంబర్ 6093 కట్టిందే ఆ తాడేపల్లి కొంప. మీకూ మాకు రాజకీయాల్లో పోలికేలేదు. మీరు నరహంతకులు.

మా అధినేతది పదిమందికి తిండిపెట్టే కుటుంబం. కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించడం, అందరికీ సాయం చేయడం నారా కుటుంబానికి అలవాటు. మీకు ఒక్క ట్రస్ట్ అయినా ఉందా? 2014 వరకూ నేను అద్దె ఇంట్లో ఉన్నా. ఆ తర్వాత బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకున్నాను. రూ. 50 కోట్లతో నేను ఇల్లు కట్టి ఉంటే ఆ ఇల్లు మీరు తీసేసుకోండి. నేను గొడ్డుకారం తిని కూడా బతకగలను. మీ చీకటి బాగోతాలు గురించి మాట్లాడేందుకు మేము సిద్ధం.

కాసు బ్రహ్మానందరెడ్డి ట్రస్ట్ కేవలం అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసింది. నా ఇంటి పేరు కాసుకానీ నా దగ్గర కాసుల్లేవని లేదని మహేష్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు. నీ అధికార దాహానికి 11 మంది ఎస్సీ, ఎస్టీ , మైనారిటీలను హత్య చేశావ్. నీ కూతురు వయసున్న 8 మంది పిల్లలు గుంతలో పడి చనిపోయారు. పల్నాడు చరిత్ర తెలియని కాసు మహేష్ రెడ్డిని ఇక్కడి నుంచి తరిమికొడతాం. డబ్బు కోసం గడ్డి తినే నువ్వా మాట్లాడేది?

బ్రహ్మయ్య అనే రైతును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. లిక్కర్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన ఎందరో నాశనమైయ్యారు. నీకూ , సైకో జగన్ రెడ్డికీ అదే గతి పడుతుంది. గుంటనక్కలు మీరు. చంద్రబాబు, నారా లోకేష్ సింహాలు. చెత్త ఫెలోస్ ..మీరేంట్రా మా గురించి మాట్లాడేది? మేము పులులం. మీరు గుంటనక్కలు. మేము పల్నాటి పులులం. పులి ఆకలేస్తే గడ్డి మేయదు.

అందర్నీ జైలుకు పంపాలని జగన్ రెడ్డి లక్ష్యం :కన్నా లక్ష్మీ నారాయణ
తాను బెయిల్ పై ఉన్న ముద్దాయి కాబట్టి అందరూ వేలెత్తి చూపిస్తున్నారనే అక్కసుతో అందర్నీ జైలుకు పంపాలని జగన్ రెడ్డి లక్ష్యం పెట్టుకున్నాడు. దేశంలో అత్యంత ధనికుడిని కావాలి, ఏపీలోని నేతలందర్నీ జైలుకు పంపాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు పోలీసులను ఉపయోగిస్తున్నాడు. పెద్దా చిన్నా చూడకుండా ప్రతిపక్షాలపై తప్పుడు కేసులను పోలీసులు పెడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగానికి పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రాజెక్టులు సందర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు పై కేసులు పెట్టడం జగన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం. డీజీపీ ఏం చేస్తున్నట్టు?

జగన్ చర్యలతో కేంద్రానికీ అప్రదిష్ట : ప్రత్తిపాటి పుల్లారావు
చంద్రబాబు గారిపై కేసులు పెట్టడం దుర్మార్గం. కేసులు పెట్టిన తీరును బట్టే జగన్ రెడ్డి పని అయిపోయిందని అర్ధమవుతోంది. సైకో ప్రవర్తన వల్ల రాష్ట్రంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.పుంగనూరులో మీరే రెచ్చగొట్టి, మీరే దాడులు చేసి మాపై కేసులా?ఇలాంటి అక్రమ కేసులు బ్రిటీష్ పాలనలోనూ పెట్టి ఉండరు. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడు జగన్ . ఆల్రెడీ నువ్వు జైలుకి పోయివచ్చావుగా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుపై పెట్టిన కేసులపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. పార్లమెంటులో చర్చ జరగాలి. ఎస్పీ రిషాంత్ రెడ్డి తీరు దారుణంగా ఉంది. జగన్ చర్యలతో కేంద్రానికీ అప్రదిష్ట వస్తోంది. జగన్ రెడ్డిని కేంద్రం కట్టడి చేయాలి. జగన్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులను కేంద్రం రీకాల్ చేయాలి. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.

దమ్ముంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయండి చూద్దాం : జి.వి ఆంజనేయులు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. పెద్దిరెడ్డితో కలిసి జగన్ కుట్ర ప్రకారమే చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు. రాళ్ల దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెడతారా? దమ్ముంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయండి చూద్దాం. క్లేమోర్ మైన్స్ కే చంద్రబాబు గారు భయపడలేదు. మీరెంత?

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలి. కళ్లముందే వైసీపీ గూండాలు రాళ్లేసి విధ్వంసం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు. దాడులను ఆపలేకపోయిన డీఎస్పీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రాజెక్టులు కట్టడం చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. రైతులంటే నిర్లక్ష్యం కాబట్టే ప్రాజెక్టులను వదిలేశారు. పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. రైతులంటే మీకు నిర్లక్ష్యం. మీ తప్పులు, దుర్మార్గాలు , అవినీతి బాగోతాలు బయటకు వస్తాయని ఇలాంటి దారుణాలను ఒడిగడతారా? జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపే రోజులు ఎంతో దూరంలో లేవు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని,మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.

LEAVE A RESPONSE