• అర్హుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదు కోసమే వైసీపీప్రభుత్వం తాడేపల్లిలోని ఓ హోటల్లో, హైదరాబాద్ లో 800మందితో ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటుచేసింది
• రిప్రంజటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్- 1956 లోని కొత్త నిబంధనను కాదని, 1950 యాక్ట్ లోని పాత నిబంధనలప్రకారం, జగన్ ప్రభుత్వం అర్హుల ఓట్లు తీసేస్తోంది
• ఓటర్లకు తెలియకుండా వైసీపీ నియమించిన కిరాయి వ్యక్తులే ఇష్టానుసారం ఫామ్-7 దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తున్నారు
• వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పర్చూరు నియోజకవర్గంలో 40వేల ఓట్లు తొలగించి గెలవాలన్నదే అధికారపార్టీ ఆలోచన.
– టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు
నాలుగేళ్ల పాలనలో ప్రజల్ని మోసగించి, వారి ఆస్తులు.. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని గుర్తించిన పాలకులు, మరలా ఎన్ని కుట్రలు కుతంత్రాలైనా పన్ని అధికారంలోకి రావాలన్న దుర్భుద్ధితో దొంగఓట్ల తంతుకి తెరలేపారని టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రశ్నించేనోళ్లకు తాళాలేస్తూ, ప్రజల్ని భయపెడుతూ ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వం, అర్హుల ఓట్లు తొలగించి దొంగఓట్లతో మరలా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఆ క్రమంలోనే పాలకులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్నో అక్రమాలకు తెరలేపారు. ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని వారికి లేకుండా చేసి, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న వారి ఆగ్రహాన్ని తొక్కిపెట్టేలా తెరవెనుక కుట్రలకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దొంగఓట్లు నమోదుచేయించడంతో పాటు, టీడీపీ కార్యకర్తలు, సాను భూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు.
కుప్పం, ఉరవకొండ, విశాఖపట్నం, పర్చూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వం అనేక అక్రమాలకు తెరలేపింది. పాలకుల అక్ర మాలకు సహకరిస్తున్న అధికారులంతా తాము నాగుపాము పడగనీడలో ఉన్నారని గ్రహిస్తే మంచిది.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాల్సిన అధికారులు స్వార్ధ ప్రయోజనాలకోసం అడ్డదారులు తొక్కి విలువైన జీవితాలను పాడుచేసుకోవద్ద ని హితవు పలుకుతున్నాం. పాలకుల వికృతక్రీడలో పావులుగా మారి, ఉరవకొండ నియోజకవర్గంలో ఇష్టానుసారం అర్హుల ఓట్లు తొలగించిన అనేకమంది అధికారులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారనే వాస్తవాన్ని అధికారయంత్రాంగం గ్రహిస్తే మంచిది .
అర్హుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదు కోసమే వైసీపీప్రభుత్వం తాడేపల్లిలోని ఓ హోటల్లో, హైదరాబాద్ లో 800మందితో రెండు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటుచేసింది
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ప్రజాస్వామ్యబద్ధంగా అరాచక ప్రభుత్వంపై పోరాడుతోంది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వాలంటీర్లతో పాలన సాగిస్తున్న ముఖ్యమం త్రి, తనకు, తనప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ప్రజల ఓట్లు తొలగిం చేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే నిర్వహిస్తున్నాడు.
తాడేపల్లిలోని శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో 400 మంది సిబ్బందితో కూడిన ఒక బృందం, ఒక పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న మరోబృందం వాలంటీర్ల సాయంతో టీడీపీకి పడతాయనుకున్న ఓట్లను తొలగించే ఘట్టాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించి, దాని ఆధారంగా ఒక్కో నియోజకవర్గంలో టీడీపీకార్యకర్తలు, సానుభూతిపరులకు చెందిన 10వేల ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దానిలో భాగంగానే 2, 3 నెలల క్రితం పర్చూరులో స్థానిక వైసీపీ ఇన్ ఛార్జ్, గ్రామ మండలస్థాయి అధికారులు, బీఎల్వోలతో సమావేశమై, వారి సహకారంతో ఓట్లు తొలగింపుకు శ్రీకారం చుట్టాడు. ఈ ప్రక్రియలో గ్రామ, మండలస్థాయి వైసీపీనేతల సాయంతో వేలసంఖ్య లో ఫామ్ -7 దరఖాస్తుల్ని ఆన్ లైన్లో అప్ లోడ్ చేయిస్తున్నారు.
ఒకే వ్యక్తి పేరుతో 300, 400 దరఖాస్తులు అప్ లోడ్ చేయిస్తున్నారు. దీనిపై మేం నియోజవర్గ, రాష్ట్ర, కేంద్రస్థాయి ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేశాం. ఎవరైనా ఒకవ్యక్తి 5కు మించి ఫామ్-7 దరఖాస్తులు అప్ లోడ్ చేస్తే, వాటిని విచారించే అధికారం స్థానిక బీఎల్వోలకు లేదు. వాటిని పరిశీలించి విచారించే అధికారం వీఆర్వోలకు మాత్రమే ఉంది. ఒక రాజకీయ పార్టీ బీఎల్ఏ తనవైపు నుంచి రోజుకి 10దరఖాస్తులకు మించి పెట్టడానికి కూడా వీల్లేదు.
కానీ ఇప్పుడు జరుగు తున్న తంతు మొత్తం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఒకే వ్యక్తి వందల సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడం, వాటిని బీఎల్వోలే ఎలాంటి విచారణ జరపకుండా ఓకే చేయడం జరుగుతోంది.
ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి, ప్రతిఒక్కరికీ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనలు, ఆశయాలను ఏపీలోని అధికార యంత్రాంగం తుంగలో తొక్కుతోంది. తమకు పడవనుకున్న ఓట్లు తొలగించడానికి ముందు ఈ ప్రభుత్వం వాటిని దొంగఓట్లుగా చూపుతోంది. అసలైన, అర్హులైన వారిని ఓటు వేయకుండా చేయాలన్నదే ఈ ప్రభుత్వ కుట్ర.
పర్చూరు నియోజకవర్గంలో 40వేల దొంగ ఓట్లు ఉన్నాయనడం అవాస్తవం
ప్రభుత్వంలో ఉండి పర్చూరు నియోజకవర్గంలో 40వేలు దొంగఓట్లు ఉన్నాయని, 2014 ఎన్నికలసమయంలో టీడీపీ వాటిని నమోదు చేయించిందని వైసీపీనేత ఆమం చి కృష్ణ మోహన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు సాధారణంగా కొత్తగా నమోదయ్యే ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ విధంగా నమోదయ్యే ఈ.పీ నిష్పత్తి అనేది సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతుంది.
2013 తర్వాత పర్చూరు నియోజకవర్గ ప్రజలు నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండుసార్వత్రిక ఎన్నికలతో పాటు, పర్చూరు నియోజకవర్గంలో చిన్నాచితకా ఎన్నికలు 10వరకు జరిగాయి. 10 ఎన్నికలు జరిగితే ఏనాడూ దొంగఓట్లపై మాట్లాడని వైసీపీ ఇప్పుడే ఎందుకు వాటిని ప్రస్తావించింది.
ఇన్నాళ్లు ప్రజల్నినమ్ముకొని అన్ని ఎన్నిక ల్లో పోటీచేసిన అధికారపార్టీకి ఇప్పుడే అర్హులైన వారి ఓట్లు దొంగఓట్లుగా ఎందుకు కనిపించాయి? కేవలం పర్చూరు నియోజకవర్గంలో 40వేల ఓట్లు తొలగించి, టీడీపీ గెలుపును అడ్డుకోవాలన్న అధికారపార్టీ కుట్రపూరిత ఆలోచనలకు నిదర్శనమే ఆమం చి కృష్ణమోహన్ నిరాధార ఆరోపణలు.
పర్చూరు నియోజకవర్గ ప్రజలంతా టీడీపీ పక్షా న ఉన్నారు.. తమను, తమపార్టీని నమ్మడంలేదన్న అక్కసుతోనే స్థానిక వైసీపీనేత లు ప్రభుత్వంతో కలిసి దొంగఓట్ల ముసుగులో నిజమైన ఓట్లు తొలగించేందుకు సిద్ధ మయ్యారు. ఆ నియోజకవర్గంలో సాగునీటిసమస్యతో ఉపాధిలేక అనేకప్రాంతాలకు వలసవెళ్తారు. అలా వలసవెళ్లిన వారి ఓట్లు తొలగించాలన్నదే ప్రభుత్వ కుట్ర. దానికో సం స్థానిక వైసీపీనేతలు, వాలంటీర్లు ఇప్పటికే ఊళ్లల్లో లేనివారితోపాటు, వైసీపీని వ్యతిరేకిస్తున్న వారి వివరాలు సేకరించారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనావళికి విరుద్ధంగా వైసీపీ అర్హుల ఓట్లు తొలగిస్తోంది. అధికారపార్టీ కుట్రలపై అధికారయంత్రాంగం , ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారత ఎన్నికల సంఘ నిబంధనావళి ప్రకారం ఓట్లు ఇష్టానుసారం తొలగించడానికి వీల్లేదు
దాని ప్రకారం గ్రామా ల్లో నివాసంలేని వారు ఇంతకాలం నివాసం ఉండాలనే నిబంధన ఏదీలేదని, వారు అక్కడే నివాసం ఉంటున్నారు అనడానికి స్థానిక బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, లేటెస్ట్ రెంటల్ అగ్రిమెంట్, లేటెస్ట్ కరెంట్, గ్యాస్ బిల్లులు, ఇన్ కం ట్యాక్స్ అసెస్ మెంట్ ఆర్డర్ వంటివి స్థానిక చిరునామాతో ఉండాలని, అవేవీ లేకపో తే పైన పేర్కొనబడిన వాటిలో ఆయా చిరునామాలో ఉండే కుటుంబసభ్యులకు సంబంధించి ఏవైనాకొన్నింటిని సదరు ఇంట్లో నివసించేవారు తమ చిరునామా ధృవీకరణలుగా చూపవచ్చని సదరు యాక్ట్ పేర్కొంది.
అవికూడా లేని పక్షంలో వారి చిరునామాతో కూడిన ఒక పోస్టల్ కార్డుపై పోస్టల్ శాఖ ముద్ర ఉన్నా చాలని చెప్పడం జరిగింది. రిప్రంజటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్- 1956 లోని కొత్త నిబంధనను కాదని, 1950 యాక్ట్ లోని పాత నిబంధనలప్రకారం, జగన్ ప్రభుత్వం అర్హుల ఓట్లు తొలగించ డానికి కుట్రలు పన్నుతోంది. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినా, కచ్చితంగా తిరిగొస్తామని చెప్పేవారి ఓట్లు వారికి తెలియకుండా తొలగించే అధికారం, హక్కు ఎవరికీ లేదు.
అందుకు విరుద్ధంగా అర్హులైన వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించాలనుకుంటున్న అధికారపార్టీ ప్రయత్నాలను అడ్డుకుంటాం. పర్చూరు నియోజకవర్గంలో గంపగుత్తగా నమోదైన 15వేల ఫామ్-7 దరఖాస్తులపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖద్వారా ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట కూర్చొని ఇష్టానుసారం వందల సంఖ్యలో ఫామ్ -7 దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నారు.
ఒకేవ్యక్తి పలు సిమ్ కార్డుల సాయంతో ఈ విధంగా చేస్తున్నాడు. దీనివెనక ఎవరున్నారో, ఎవరి అండదండలతో కొందరు పనిగట్టుకొని ఇష్టమొచ్చినట్లు ఓట్లు తొలగింపునకు సహకరిస్తున్నారో కనిపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఉంది. గతంలో కూడా పర్చూరు నియోజకవర్గంలో పనిచేసే గ్రామ, మండలస్థాయి అధికారుల్ని అధికారపార్టీ బెదిరించి, ఫామ్ -7 దరఖాస్తుల అప్ లోడ్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
దానిపై అధికారులు వెంటనే అప్రమత్తమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తో అప్పుడు వెనక్కు తగ్గారు. ఓటర్లకు తెలియకుండా వారిపేరుతో తమఓట్లు తీసేయం డని వైసీపీవారే ఫామ్ -7 కింద దరఖాస్తు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా అధికారయంత్రాం గం మొత్తం అప్రమత్తంగా ఉండాలి.
కింది స్థాయి అధికారుల్ని చైతన్యం చేస్తూ, ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఉంది. రాష్ట్రంలో చొరబడిన ఓట్ల దొంగల్ని ఒక కంట కనిపెట్టి, వారిని కట్టడిచేయడంపై ప్రజలు కూడా అప్రమత్తులై ఉండాలి.” అని సాంబశివరావు సూచించారు.