• రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ
• రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్డిసిప్లెయిన్ (ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం) పై కాగ్ నివేదిక అంశాలను ప్రస్తావిస్తూ లేఖ
• గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులూ చేశామని, నిబంధనలు పాటించామని ప్రభుత్వం చెపుతున్న అంశాలను ప్రశ్నిస్తూ ఆధారాలతో లేఖ రాసిన యనమల
• కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ….కాగ్ కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను లేఖలో ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు
• కాగ్ 2022 ఆడిట్ నివేదిక లో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలంటూ లేఖ
• అప్పులు రూ. 10 లక్షల కోట్లకు చేరిన వైనాన్ని వివరిస్తూ లేఖ రాసిన యనమల రామకృష్ణుడు
• ఈ వివరాలపై ప్రభుత్వ పరంగా పూర్తి సమాధానం చెప్పాలని లేఖలో పేర్కొన్న యనమల
లేఖలో అంశాలు:-
తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 పాలనలో రూ.1.39 లక్షల కోట్ల అప్పులు మాత్రమే. చేసింది.ఎఆర్ బిఎం పరిమితికి లోబడి మాత్రమే నాడు టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసింది. 2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల కన్నా వైసీపీ ప్రభుత్వం రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసింది.
1 లక్ష కోట్లు అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు చేసినట్లు కాగ్ తన నివేదికలో గణాంకాలతో సహా నిర్ధారించింది. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికే 1,18,003 కోట్లు అని కాగ్ తేల్చింది.ఇవి కాక రూ.18 వేల కోట్ల మేరకు విద్యుత్ సంస్థల బకాయిలు, లెక్కలు చూపని సాగునీటి, తాగునీరు రంగాల పెండింగ్ బిల్లులు, పంచాయితీ సంస్థల నుండి తీసుకున్న రూ.20 వేల కోట్లు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన బకాయిలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లను దాటింది.
మితిమీరిన అప్పుల కారణంగా 2024 సంవత్సరంలో రూ.42 వేల కోట్లు అప్పులుగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం దేశంలో సగటున 14 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 9 శాతం మాత్రమే ఉంది. ట్రెజరీ తో సంబంధం లేకుండా కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాల ఆధారంగా కేంద్రం నుండి ఎక్కువ అప్పులకు అనుమతి పొందింది.