– శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తీసుకెళ్తుంటే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు?
– తుంగభద్ర డ్యామ్‌లో ఏపీనీటి వాటాను తెప్పించాలి
– డోన్‌లో రోడ్లు వేస్తేనే అంతా అభివృద్ధి జరిగినట్లా ?
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు
– కర్నూలులో హైకోర్టును ఏ రోజున ఏర్పాటు చేస్తారో ఆర్ధిక మంత్రి బుగ్గనకు చెప్పే ధైర్యం ఉందా ?
– టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి
రాయలసీమ సాగు-తాగునీటి ప్రాజెక్టులపై సంపూర్ణ అవగాహన ఉన్న కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి.. సీమ ప్రాజెక్టులపై వైసీపీని ప్రశ్నాస్త్రాలతో ముప్పుతిప్పలు పెట్టారు. ప్రధాన ంగా తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ వాటాను తెప్పించాలన్న డిమాండ్‌తో, ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను ఆత్మరక్షణలో పడేశారు. కోట్ల ఏం మాట్లాడారంటే..
ఆర్థిక మంత్రి బుగ్గనకు ఇరిగేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంతసేపు దోచుకోవడం, వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ద్యాసలో ఉన్నారు తప్ప.. రైతులు సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రాజెక్టులకు వద్దకు రండి. ఎవరు ఏమి చేశారో చర్చిద్దాం. డోన్‌లో రోడ్లు వేస్తేనే అంతా అభివృద్ధి జరిగినట్లా ? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తీసుకెళ్తుంటే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు?
గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించా లి. వర్షాలు పడక రైతులు అల్లాడుతున్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు కనపడటం లేదా ? తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ వాటా నాలుగు టీఎంసీలు ఉంది. ఆ నీటి వాటాను తెప్పించా లి. కర్నూలులో హైకోర్టును ఏ రోజున ఏర్పాటు చేస్తారో ఆర్ధిక మంత్రి బుగ్గనకు చెప్పే ధైర్యం ఉందా ? హైకోర్టు ఏర్పాటు చేస్తామని కర్నూలు ప్రజలను మభ్యపెడుతున్నారు.