Suryaa.co.in

Andhra Pradesh

దొంగ ఓట్ల బాబు బోగస్ కంప్లైంట్

– దొంగ ఓట్ల ఒలింపిక్‌ హీరో చంద్రబాబు
– వన్‌ సిటిజన్‌.. వన్‌ ఓట్ అనేది వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం
– తన దొంగ ఓట్ల మెథడాలజీ బెడిసికొడుతుందనే ఆందోళనలో బాబు
– అందుకే, మాపై ఫ్రస్టేషన్‌తో బోగస్‌ ఫిర్యాదిచ్చాడు
– నాడు ‘సేవామిత్ర’.. నేడు ‘మై టీడీపీ’ యాప్‌లతో మాల్‌ప్రాక్టీస్‌
– ఓట్ల గల్లంతు, దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియకు నాందిపలికింది బాబే
– ఓటరు కులమేంటని అడుగుతున్న కుల ఉన్మాది బాబు
– ఓటరు పొలిటికల్‌ ఫ్రిఫరెన్స్‌ ఏంటని అడిగే హక్కు బాబుకెవరిచ్చారు..?
– ఓటర్‌ ప్రొఫైల్‌ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదిచ్చాం
– ఓటర్‌ ఐడీతో ఆధార్‌లింక్‌ చేయాలి
– 2014 నుంచి ఓటర్లజాబితా అక్రమాలపై విచారణ చేపట్టాలి
– కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ
– ఎంపీ వి. విజయసాయిరెడ్డి వెల్లడి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)ని కలిసింది. దొంగ ఓట్ల ఏరివేతపై టీడీపీ దుష్ప్రచారాన్ని సీఈసీ దృష్టికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తీసుకెళ్లారు. సీఈసీతో భేటీ అనంతరం ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏమన్నారంటేః

వైఎస్‌ఆర్‌సీపీ వినతిపత్రం అందజేతః
ఓటర్ల జాబితాలు, దొంగ ఓట్ల ఏరివేతకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ను ఈరోజు మేము కలిశాము. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము వినతిపత్రం అందించాం. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓటర్ల మాల్‌ప్రాక్టీస్‌పై మేము అనేక అంశాల్ని కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించాం. వాటన్నింటిపై కమిషన్‌ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు.

దొంగ ఓట్ల ఒలింపిక్‌ హీరో చంద్రబాబు
ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల చేరివేతకు సంబంధించి ఒక ఆట ఉన్నట్లైతే.. ఆ ఆటల పోటీలో మొదటి విజేతగా చంద్రబాబు నిలుస్తారు. చంద్రబాబు నేతృత్వంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ ఏ విధంగా జరిగిందనేది మేము ఎన్నికల కమిషన్‌కు వివరించాం. ఉదాహరణకు లక్ష్మీ అనే మహిళ పేరును రకరకాల స్పెల్లింగ్‌లతో ఒకసారి, వయస్సు మారుస్తూ మరోసారి, ఇంటిపేరు మార్చి ఇంకోసారి, ఆమె భర్త పేరు మారుస్తూ.. డోర్‌నెంబర్‌ సబ్‌డివిజన్‌ చేసి .. ఇలా ఒకే వ్యక్తి పేరుతో రకరకాల మార్పులతో పదేసి ఓట్లు చేరివేతలో చంద్రబాబు సిద్ధహస్తుడుగా ఎలా పనిచేయగలిగాడనేది ఎన్నికల సంఘానికి మేము ఆధారాలతో సహా అందించాం.

పౌరులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలనేది ఎన్నికల కమిషన్‌ ప్రధాన ఉద్దేశం. అలాంటిది, ఎన్నికల కమిషన్‌ నిబంధనలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ రోడ్లపై అనాథల్లా తిరిగే వారిని, స్థిరనివాసం లేని సంచారులను సైతం ఏదొక డోర్‌ నెంబర్‌ మీద ఓటర్లుగా చేర్చి పెట్టుకున్నాడు ఈ చంద్రబాబు.

వెన్నుపోటు బాబు ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణకా..?
ఉల్టాచోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్న సామెతకు అసలు సిసలైన అర్ధం చంద్రబాబునాయుడు. తాను ఎవరినైతే వెన్నుపోటు పొడుస్తాడో.. మరలా అతనికే పూలదండ వేస్తాడు. ఎన్టీరామారావును బతికున్న రోజుల్లో బాగా చూసుకున్న వారిని వదిలేసి.. ఆయన్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వచ్చి ఎన్టీఆర్ పేరుతో రూపొందించిన రూ.100 నాణెం ఆవిష్కరణ సభలో పాల్గొనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

పారదర్శక ఓట్ల జాబితా వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం
ఒకే డోర్‌ నెంబర్‌పై నమోదైన డూప్లికేట్‌ ఓట్లు, డబుల్‌ ఎంట్రీ ఓట్లు వంటి బోగస్‌ ఓట్లను ఏరివేయాలని.. పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరగాలనేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలనే సిద్ధాంతాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నమ్ముతుంది. ఆచరణలోకి తెస్తుందని చెబుతున్నాం.

2015 నుంచి టీడీపీ దొంగ ఓటర్ల వివరాల్ని అందించాం
చంద్రబాబు హయాంలో మాపార్టీ ఓట్ల గల్లంతుతో పాటు టీడీపీ వ్యక్తుల దొంగ ఓట్లు చేర్పునకు సంబంధించి అన్ని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి వివరించాం. 2015 నుంచి 2017 వరకు ఎన్ని దొంగ ఓట్లును నమోదు చేశారు.. మా పార్టీ మద్ధతు దారుల ఓట్లను ఎన్ని తొలగించారనేది టేబుల్‌ ఫార్మ్‌లో మేము ఎన్నికల అధికారులకు అందించాం.

బాబు తప్పుడు విధానాలు మాకు అబ్బవు
2019 ఎన్నికలకు ముందు 3.98 కోట్లమంది ఓటర్లు ఉంటే.. ఈరోజుకు 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. అంటే, ఒక లక్ష ఓటర్ల తేడా మాత్రమే ఉంది. ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించి వైఎస్‌ఆర్‌ సీపీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు ఆనాడు ఏ విధంగానైతే రాజకీయంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశాడో.. ఆ విధానాల్ని మా పార్టీ అమలు చేయలేదని, అలాంటి కార్యకలాపాలకు మేము పాల్పడలేదని స్పష్టంగా చెబుతున్నాను.

63 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు తేలాయి
జనాభా సంఖ్యతో ఎన్నికల జాబితా ఓటర్లను పోల్చితే సగటున ప్రతీ వెయ్యి మందికి ఓటర్ల వివరాల్ని చూశాం. రాష్ట్రంలో 63 నియోజకవర్గాల్లో 20 చోట్ల 15,800 దొంగ ఓట్లు నమోదైనట్లు తేలింది. అదే 40 నియోజకవర్గాల్లో 5,800 నుంచి 6000 వరకు ఇంచుమించుగా దొంగ ఓట్లు తేలాయి. ఇవన్నీ ఏఏ జిల్లాల్లో ఏఏ నియోజకవర్గాల్లో ఉన్నాయనేది 63 నియోజకవర్గాలకు సంబంధించిన దొంగ ఓట్ల వివరాల్ని టేబుల్‌ ఫార్మ్‌లో ఎన్నికల సంఘానికి అందించడం జరిగింది.

ఓటమి భయంతోనే మాపై ఫిర్యాదు
చంద్రబాబు ఇప్పుడు ఓటర్ల జాబితాలపై ఎందుకు వణికిపోతున్నాడనేది కూడా ఎన్నికల సంఘానికి మేము వివరించాం. 2019 ఎన్నికలకు ముందు చేర్చిన దొంగ ఓటర్లే ఈనాటిదాకా జాబితాలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మేము క్షేత్రస్థాయిలో జాబితాలపై రీసర్వే ప్రక్రియ చేస్తూ.. ఆధార్‌తో ఓటర్‌ ఐడీని లింక్‌ చేస్తే తాను చేర్పించిన దొంగ ఓట్ల వివరాలన్నీ బయటకొస్తాయనే ఆందోళనతో చంద్రబాబు ఉన్నాడు. ఆ ఫ్రస్టేషన్‌తోనే ఆయన వైఎస్‌ఆర్‌సీపీపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘానికి మాపై బోగస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు.

నాడు సేవామిత్ర.. నేడు మై టీడీపీ యాప్‌తో..
గతంలో సేవామిత్ర యాప్‌ను ఉపయోగించి టీడీపీ మద్ధతుదార్లు.. ఇతర పార్టీల సానుభూతిపరులెవరనేది తేల్చి చంద్రబాబు సక్సెస్‌ అయ్యాడు. ఆ రకమైన జల్లెడ పట్టి వైఎస్‌ఆర్‌సీపీ ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగిస్తున్నారని తెలుసుకుని మేం ఆనాడు పోరాడిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడేమో అదేబాటలో ‘మై టీడీపీ’ యాప్‌ అంటూ ఓటర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాడో .. ఆ సమాచారాన్ని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నాడో అనేదాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. అశోక్‌ డాకవరం అనే వ్యక్తి టీడీపీ తరఫున ఓటర్‌ ప్రొఫైలింగ్‌ సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాడో.. దాంతో ఆయన ఓటర్‌కు తెలియకుండానే ఓటు తొలగింపు, చేరివేతకు సంబంధించిన దరఖాస్తుల్ని ఎలా మేనేజ్‌ చేస్తున్నాడనేది ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించాం.

చంద్రబాబు మెథడాలజీలో కుల ఉన్మాదం
ఓటరు సర్వేలో కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలతో చంద్రబాబు మెథడాలజీని అశోక్‌ అనే వ్యక్తి అమలు చేస్తున్నాడు. ఓటర్‌ పొలిటికల్‌ ఫ్రిఫరెన్స్, పొలిటికల్‌ పార్టీ ఛాయిస్‌ అనేది ఈ అశోక్‌ అనే వ్యక్తికి ఏం సంబంధం ఉందని అడుగుతున్నాడు..? ఇతని అవసరమేంటి..? అదేవిధంగా ఓటరు యొక్క కులం ఏంటని మరొక ప్రశ్న అడుగుతున్నారు. దీన్నిబట్టి చంద్రబాబు మెథడాలజీలోనే కుల ఉన్మాదం ఎంతగా పెరిగిందో అర్ధమవుతుంది. సభ్యసమాజంలో ఉన్న ఏ వ్యక్తీ.. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఓటరు దగ్గరకి వెళ్లి నీ కులమేంటని అడగగలరా..? అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఇలాంటివి ఖచ్చితంగా ఓటరును అడగకూడనివి అని.. చాలా నేరమైన విషయాలుగా మా వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తుంది. అదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం.

‘వన్‌ సిటిజన్‌.. వన్‌ ఓట్‌’ సిద్ధాంతంతో మా డిమాండ్‌లివి..
ఎన్నికల సంఘం ముందు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము ప్రధానంగా రెండు డిమాండ్‌లను పెట్టాం. ఓటర్‌ ఐడీతో ఆధార్‌కార్డు లింకు చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. దీనిద్వారా చంద్రబాబు దొంగ ఓట్లు చేర్పించే దురాలోచనకు మేం బ్రేకులేయాలని కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా ఆధార్‌ లింకుతో బయోమెట్రిక్‌ సదుపాయం ఉంటుంది. వన్‌ సిటిజన్‌.. వన్‌ ఓట్‌ అనే వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధాంతం నెరవేరుతుంది.

మరో ముఖ్యమైన విషయమేమంటే, చంద్రబాబు ఈరోజు వైఎస్‌ఆర్‌సీపీ దొంగ ఓట్లు చేరుస్తుందని దొంగే.. దొంగా, దొంగా.. అన్నట్లు రంకెలేస్తున్నాడు. వాస్తవానికి చంద్రబాబు చేసే ఓటర్ల జాబితా మాల్‌ప్రాక్టీస్‌పై మేము వైఎస్‌ఆర్‌సీపీ తరఫున 2018లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కనుక, ఇప్పుడు మరలా మేము కోరుతున్నదేమంటే.. 2014 నుంచి నేటి వరకు ఓటర్ల జాబితాలపై ప్రత్యేక విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. దొంగ ఓట్లు చేరివేత, నిజమైన ఓటర్ల వివరాల గల్లంతుకు ఎవరు పాల్పడ్డారనే వాస్తవం నిగ్గుతేల్చాల్సిన అవసరముందని మేం ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాం.

LEAVE A RESPONSE