రాష్ట్రంలో రాజకీయ గాలి మారింది…తెలుగుదేశం గెలుపు ఖాయం
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ఇంటికే
భవిష్యత్ కు గ్యారెంటీ లో ప్రతి ఇంటికి పథకాల హామీ పత్రం
కాకినాడలో తెలుగు దేశం పార్టీ జోన్ 2 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సభకు హాజరైన ప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
• తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతోంది. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బ్రహ్మండంగా విజయవంతం అయ్యాయి.
• ఏ ఎన్నికలు జరిగినా మనము గెలుస్తున్నాం. 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు మనమే గెలిచాం.
• ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలిచింది. 30 ఏళ్ల నుంచి గెలవనిచోట కూడా గెలిచింది. ప్రజల్లో మార్పు ప్రారంభమైంది. టీడీపీ జైత్ర యాత్ర మొదలైంది.
• దళితులు, బీసీలు పెద్ద ఎత్తున మనకు మద్దతు పలుకుతున్నారు. రాజకీయ గాలి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో స్పష్టంగా అర్థం అవుతోంది.
• టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మనకు 23 సీట్లు వస్తే హేళన చేశారు. ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ మారింది. రేపు ఏ ఎన్నికలు పెట్టినా గెలిచేది తెలుగుదేశమే.
• రాష్ట్రాన్ని రివర్స్ లో నడిపించి సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.
• రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు..ఎవరూ సంతోషంగా లేరు.
• నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన పాలన ఎప్పుడూ చూడలేదు.
• రాష్ట్రంలో నిత్యావసరాలు మండిపోతున్నాయి. కందిపప్పు కేజీ రూ.200 అయ్యింది.
• ఇసుక, మద్యం, కరెంటు చార్జీలతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, వేధింపులు.
• కాకినాడలో దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. ప్రశాంతమైన కోనసీమలో కూడా అరాచకాలు సృష్టించారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.
• ఇవన్నీ ప్రజల్లో చర్చ జరగాలి. మనం ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ’ అనే కార్యక్రమం మొదలు పెట్టాం.
• 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బాదుడే బాదుడుతో ప్రజలపై పడిన భారాన్ని వారికి వివరిస్తూనే, మనం వస్తే ఏం కలిగే లబ్ధి కూడా వారికి చెప్పాలి.
• 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ భారీగా పెంచాం.
• 200 రూపాయల పెన్షన్ ను 2 వేలు చేశాం. ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం.
• రైతన్నల కోసం లక్షన్నర రుణమాఫీ చేశాం. ఒకే దఫాలో రూ.50 వేలు మాఫీ చేశాం. రైతులకు సబ్సిడీలు ఇచ్చాం. అన్న క్యాంటీన్ లు పెట్టాం. పెళ్లి కానుక అందించాం. ఆ పథకాలు అన్నీ జగన్ రాగానే రద్దు చేశాడు.
• ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ గ్రామాల్లో చర్చించాలి.
• మనం చేసిన పనులు, జగన్ చేసిన నష్టం….మళ్లీ మనం వచ్చిన తరువాత మనం అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించాలి.
• అన్నీ ఆలోచించి మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. మహాశక్తి లో భాగంగా తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఏడాదికి రూ.15000 ఆర్థిక సాయం చేస్తాం.
• పథకం అమలులో ఎలాంటి కోతలు ఉండవు. నా సంతకంతో ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం. చెప్పిన మాటపై నిలబడే పార్టీ తెలుగు దేశం పార్టీ.
• మద్యపాన నిషేదం అని నాడు మాటలు చెప్పిన జగన్…ఇప్పుడు ఏం చేస్తున్నాడు. మనం ఇలా మాట మార్చం.
• ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందజేస్తాం.
• సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. అధికారంలోకి వచ్చిన తరువాత పీ – 4 విధానంతో పేదరికం పోగొడతాం.
• దీపం పథకం ప్రారంభించింది నేనే. మళ్లీ దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అవసరం అయితే నాలుగో సిలిండర్ కూడా పేద వర్గాలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం
• ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
• దేశానికి అన్నంపెట్టే గోదావరి జిల్లాలు నేడు సాగు మానేసే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 50 నుంచి 80శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 35 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గిపోయింది.
• టీడీపీ హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకు న్నాం. 5.13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేడు రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగం 35 శాతానికి చేరుకుంది.
• అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత యువగళం కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
• అధికారంలోకి వచ్చిన తరువాత వెనుకబడిని వర్గాలైన బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం.
• 5 ఏళ్లలో చిన్న రోడ్డు వేయలేని సైకో సీఎం…మూడు రాజధానులు కడతాను అంటున్నాడు
• మూడు రాజధానులు అని ప్రజల్ని నమ్మించి, అసలు రాజధానే లేకుండా చేశాడు. జగన్ కు విధ్వంసం తప్ప మరేమీ తెలీదు.
• నాడు ఇరిగేషన్ పై రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. పట్టిసీమ కట్టి ఇటు కోస్తాకు…అటు సీమకు నీళ్లు ఇచ్చాం.
• తెలుగు దేశం అధికారంలో ఉండి ఉంటే రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేవాళ్లం.
• భవిష్యత్ లో పోలవరం పూర్తి చేసి మూడు పంటలకు నీళ్లు ఇస్తాం. నదుల అనుసంధానం చేసి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు.
• రాష్ట్రంలో ఇసుకాసురులు తయారయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దొరుకుతుందా? మన హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం.
• ఉచిత ఇసుకతో పలు వర్గాల ప్రజలు బతికారు. జీవనోపాధి లభించింది.
• నేడు ప్రభుత్వ ఇసుక దోపిడీ వల్ల 40 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు.
• జిల్లాల వారీగా రీచ్ లు పంచుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక మాఫియాకు డబ్బులు కట్టలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
• నాలుగున్నరేళ్లలో ఇసుకలోనే రూ.40 వేల కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారు. అందుకే మనం ఇసుక సత్యాగ్రహం అని పిలుపునిచ్చాం.
• రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలతో బాదుడు. ఇప్పుడు రాష్ట్రంలో కరెంట్ కోతలు.
• మన హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదు. జగన్ 8 సార్లు ఛార్జీలు పెంచి బాదేశాడు.
• రోజుకో పేరు పెట్టి….నాడు 200 వచ్చే బిల్లును ఇప్పుడు వెయ్యి చేశాడు. ఈ రోజు హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని.
కరెంట్ ఛార్జీల బాదుడుపై చంద్రబాబు సెటైర్లు
రజనీ కాంత్ కొద్దిరోజుల క్రితం ఒక సభలో చెప్పిన తాజా డైలాగ్ ను ప్రస్తావిస్తూ కరెంట్ బాదుడుపై సెటైర్లు
• ఈ రోజు చెపుతున్నా కరెంట్ కోతలు లేని చోటు లేదు…..కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు….ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ! అంటూ కామెంట్స్
• మద్యనిషేధం అన్నాడు….మద్యం రేట్లు పెంచి జగన్ దోచుకుంటున్నాడు.
• జగన్ ను మళ్లీ నమ్మితే రూ.400 కరెంట్ బిల్లు రూ.4 వేలు అవుతుం ది….60 రూపాయల మందు బాటిల్ 500 అవుతుంది. ప్రజలు అప్రమత్తం గా ఉండాలి.
• వచ్చే ఎన్నికల్లో మనం అప్రమత్తంగా ఉండాలి…..ఓట్లు ఇప్పటి నుంచే చెక్ చేసుకోవాలి. జగన్ ఎక్కడో ఆఫీస్ పెట్టి మనకు పడే అవకాశం ఉన్న ఓట్లు తీసేస్తున్నాడు.
• యువగళం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక సైకిల్ ఆగే ప్రసక్తే లేదు. సైకిల్ అన్ స్టాపబుల్. ఇక బ్రేకులు వేసే అవసరం లేదు. దూసుకుపోవడమే. ప్రతి నియోజకవర్గం నుంచి సైకిల్ అసెంబ్లీకి రావాలి.
• తప్పుడు పార్టీ వైసీపీ. ఎన్నికల సమయంలో ప్రతి సారీ నాపై ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అలాంటి వాటికి ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు.
• జగన్ పని అయిపోయింది. జగన్ ఇంటికి పోవడం ఖాయం..