ఎంపీ విజయసాయిరెడ్డి
సెప్టెంబరు,2:
టిడిపి ప్రభుత్వ హయంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కిమ్,క్యాపిటల్ సిటి మాస్టర్ ప్లాన్ తయారీ దేశంలో అతిపెద్ద స్కామ్ అని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఆయన ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమీషన్ గా తీసుకున్న 118 కోట్ల లెక్క చూపని ధనం గురించి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబుకు ఆయన ప్రశ్నించారు..సెల్ కంపెనీల ద్వారా టిడిపి అధినేత చంద్రబాబుకు ముట్టిన రూ.118 కోట్లు ఆయనకు (చంద్రబాబు) సముద్రంలో నీటి బొట్టుతో సమానమని చెప్పారు.
ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యారని ఆయన గుర్తు చేశారు.. సి.ఆర్.డి.ఏ ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందని చెప్పారు..
చంద్రబాబు పొత్తు కోసం ఢిల్లీ వెళితే పాత ఐటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందనన్నారు. తవ్వితీయాలే గానీ ఇలాంటివి పది వేల అక్రమాలు బయటపడతాయని చెప్పారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం, ఢిల్లీలో చక్రం తిప్పి చంద్రబాబు గారు చేసిన పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని వెల్లడించారు.
తన సంపద పెంచుకోవడం కోసమే 14 ఏళ్లు సిఎంగా ‘శ్రమ’ పడ్డారని ఆయన అన్నారు..ఆయన కటిక పేదవారు కనుకే కుప్పంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా అని ఎద్దేవా చేశారు. ‘విజనరీ’ అంటే దోచుకోవడంలో ఆరితేరడమా? అని ఆయన ప్రశ్నించారు..
చిరస్మరణీయుడు వైయస్సార్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా
అనేక సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన చిరస్మరణీయుడని కొనియాడారు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా విజయసాయిరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు..