కెసిఆర్ సీఎం అయ్యాకే, తెలంగాణ సస్యశ్యామలం
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లే గ్రామాల రూపు రేఖలు మారాయి!
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మన లాంటి పథకాలున్నాయా?
అక్కడ చేయలేని దద్దమ్మలు మనకు ఏదో చేస్తామంటే నమ్మాలా?
ఊళ్ళకు వచ్చే ఆ పార్టీల నేతలను ఉరికిచ్చి తరమండి
కెసిఆర్ కు మోసం చేస్తే కన్నతల్లికి మోసం చేసినట్లే!
మా అండదండలు మీకు ఉంటాయి…బిఆర్ఎస్కు అండగా నిలవండి
ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పరకాల నియోజకవర్గంలో రూ.27 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య
సంగెం, సెప్టెంబర్ 6 : దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన 60 ఏండ్ల కాంగ్రెస్, 10 ఏండ్ల బిజెపి పాలన వల్లే మనకీ కష్టాలు దాపురించాయి. ఆ పాపాలను కడుక్కోవడానికే సరిపోతున్నది. కేవలం 10 ఏండ్లల్లోనే కెసిఆర్ సీఎం అయ్యాకే, తెలంగాణ సస్యశ్యామలం అయింది. కాళేశ్వరం నీటితో ప్రజల కాళ్ళు కడిగిన ఘనత ఆయనది. ఆయన మనసున్నమహారాజు, అందువల్లే, ఆయన మానస పుత్రికలు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లే గ్రామాల రూపు రేఖలు మారాయి! మనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. మన గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలించాయి. అని రాష్ట్ర పంచాయతీరాజ్; గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో మన లాంటి పథకాలున్నాయా? అక్కడ చేయలేని దద్దమ్మలు మనకు ఏదో చేస్తామంటే నమ్మాలా? ఊళ్ళకు వచ్చే ఆ పార్టీల నేతలను ఉరికిచ్చి తరమండి అంటూ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవ్వాళ కెసిఆర్ వల్లే మనం ఇంతగా అభివృద్ధి చెందాం. కెసిఆర్ కు మోసం చేస్తే కన్నతల్లికి మోసం చేసినట్లే!నని వ్యాఖ్యానించారు.
మా అండదండలు మీకు ఉంటాయి…బిఆర్ఎస్కు మీరు అండగా నిలవండి అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గంలో రూ.27 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యలు కలిసి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం, పరకాల నియోజకవర్గంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామంలో..
రూ.3 కోట్ల 10 లక్షల విలువైన సిసి రోడ్లు, మహిళా భవనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతివనం, క్రీడా ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు. అలాగే పంట నష్ట పరిహారం చెక్కులను బాధిత రైతులకు అందచేశారు.
అనంతరం సంగెం మండలం కాపులకనపర్తి గ్రామంలో రూ.8 కోట్ల 18 లక్షల 30 వేల విలువైన సిసి రోడ్లు, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతివనం, గ్రామపంచాయతీ భవనం, రైతు వేదిక, బి.టి.రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆతర్వాత పంట నష్ట పరిహారం చెక్కులను బాధిత రైతులకు పంపిణీ చేశారు.
ఆ తర్వాత గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షల విలువైన మహిళా భవనం, ఖబరస్థాన్ ప్రహారిగోడ, సిసి రోడ్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవనం, గ్రామ పంచాయతీ భవనం, ఎస్సి కమ్యూనిటీ హాల్ ప్రహారిగోడ, మహిళా భవనాలకు ప్రారంభోత్సవాలు జరిపారు. బి.టి.రోడ్లు, గౌడ సంఘం ప్రహారిగోడ, రజక సంఘం భవనం, సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పంట నష్టపరిహారం చెక్కులను బాధిత రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో వేర్వేరుగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదు. ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదు, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ కష్టాలన్నింటికీ కారణం కాంగ్రెసే కదా? 60 ఏండ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలన సరిగా లేకే ఆ పార్టీని ఏనాడో ప్రజలు తిరస్కరించారు. బిజెపిని బోగస్ పార్టీగా గుర్తించారు. ఆ పార్టీకి మన రాష్ట్రంలో నూకల్లేవు. ప్రజలు బిఆర్ ఎస్‌కు అండగా నిలవాలి. మీకుఅండగా మేమంతా నిలుస్తాం అని అన్నారు.
గతంలో గ్రామాలు ఎట్లుండే, గ్రామాల్లో కరెంటు, నీళ్ళు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోవాలని ప్రజలకు మంత్రి తెలిపారు. సిఎం కెసిఆర్ వచ్చాక తెలంగాణలో అమలు అవుతున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, పెన్షన్లు, ఊరూరా రోడ్లు, మంచినీరు, సాగునీరు వంటి అనేక అంశాలను మంత్రి సోదాహరణగా వివరించారు. ఇలాంటి పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అక్కడ ఇవ్వలేని వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువే ఇస్తామని ప్రకటిస్తున్నారు.
అక్కడ చేయలేని దద్దమ్మలు ఇక్కడ ఏమైనా చేయగలరా? అంటే వారికి అధికారం యావ తప్ప ప్రజల ధ్యాస లేనే లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్, బిజెపిలను ఎద్దేవా చేశారు. మహిళల సాధికారతోనూ మనమే నెంబర్ వన్ గా ఉన్నారు. మన మహిళలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి శిక్షణ ఇచ్చి వస్తున్నారు. ఆయా చోట్ల మనలాగా పరిస్థితులు లేవు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అత్యంత వెనుకబాటు తనం ఉంది. ఇంకా మహిళలు బిందెలు పట్టకుని కీలోమీటర్ల కొద్దీ బావుల వద్దకు వెళుతున్నారని మంత్రి తెలిపారు.
22వేల కోట్ల రుణాలను మహిళలకు ఇచ్చిన ఘనత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత మన సీఎంకెసిఆర్ కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందుకే సీఎం కెసిఆర్‌కు మనమంతా అండగా ఉండాలని, ఆయనకు అన్యాయం చేస్తే, కన్నతల్లికి అన్యాయం చేసినట్లేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పరకాల నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే దొరికారని, అభివృద్ధి కాముకుడైన చల్లా ధర్మారెడ్డి వల్లే పరకాల గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. ఆయనకు అండగా నిలవాలని ప్రజలకు హితవు పలికారు.
ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని, రాష్ట్రంలో వచ్చిన అన్ని పథకాలను సాధ్యమైనంత ఎక్కువే పరకాల నియోజకవర్గానికి తెచ్చినట్లు ఆయన చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి తన పరిధిలోని శాఖల నిధులు కూడా తమకు కావాల్సినన్నిఇచ్చినట్లు చెప్పారు. పరకాల అన్ని రంగాల్లో ముందుందన్నారు. పరకాల ప్రజల రుణం తీర్చుకునే విధంగా మరింత అభివృద్ధికి పాటు పడతామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, ఒకే రోజు 27 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకోవడం సంతోషంగాఉందన్నారు. గ్రామాలు అభివృద్ధిలో దేశంతో పోటీ పడుతున్నాయని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.