పోటీలను ప్రారంభించిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు
నేటి నుండి మూడు రోజుల జరగనున్న రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీలు
ఒంగోలు: లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియం వేదికగా ఆంద్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ మరియు ప్రకాశం జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 13 బాల బాలికల బ్యాట్మింటన్ సబ్ జూనియర్ చాంపియన్ షిప్ 2023 పోటీలు సందడిగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా స్టేడియనికి విచ్చిసిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు,ఆంద్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాధ్ ను జుల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు జె.ఎస్ లక్షణ రెడ్డి,లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ అద్దంకి మురళి కృష్ణ పుష్ప గుచ్ఛంతో స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బ్యాట్మింటన్ పోటీలను నిర్వహిస్తున్న లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ అధ్యక్షులు మురళి కృష్ణ ను అభినందించారు. క్రీడలపై ఉన్న ఆసక్తితో వ్యయప్రయాసలతో అత్యాధునిక, వసతులతో ఒంగోలు లో స్టేడియం ఏర్పాటు చేసి బ్యాట్మింటన్ క్రీడను అభివృద్ధి చేస్తూ ఎంతో మంది ఔత్సహిక బ్యాట్మింటన్ క్రీడాకారులను ప్రోత్సహం అందించి వారు జాతీయ అంతర్జాతీయ బ్యాట్మింటన్ క్రీడాకారులగా తీర్చిదిద్దే భాద్యత చేపట్టిన లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ కృషి అభినందనీయమని అన్నారు.
హైదరాబాద్, విజయవాడ,బెంగళూరు వంటి ప్రదేశాలలో వుండే విధంగా ఆధునిక వసతులు,నైపుణ్యం కలిగిన కోచ్ లు ఉండే విధంగా లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ అందరికి అందుబాటులో ఉందని కొనియాడారు.భవిష్యత్ లో లార్డ్ కృష్ణ ఇండోర్ స్టేడియం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శిద్దా రాఘవరావు తెలిపారు.
పోటీలలో గెలుపు ఓటములు సహజం అని క్రీడా స్పూర్తితో పోటీలలో పాల్గొని తల్లిదండ్రులకు,మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని క్రీడాకారులను కోరారు.పోటీలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం శిద్దా రాఘవరావు టోర్నమెంట్ న్యాయ నిర్ణేతలను,కోచ్ లను ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి వచ్చిన బాల బాలికల క్రీడాకారులని పరిచయం చేసుకొని వారికి తన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారక నాధ్, లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ అద్దంకి మురళి కృష్ణ,సీనియర్ బ్యాట్మింటన్ క్రీడాకారులు, ఆంద్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పి.అంకమ్మ చౌదరీ,ప్రకాశం జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు జె.ఎస్.లక్షణ రెడ్డి,అసోసియేషన్ కార్యదర్శి పి.విజయ కృష్ణ,నితిన్, పాణ్య ప్రాపర్టీస్ చైర్మన్ పత్తిపాటి ప్రసాద్, సి.ఓ.ఓ పత్తిపాటి మౌనీష్ లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ సభ్యులు రఘు బాబు,అశోక్ రెడ్డి,డి.శ్రీనివాస్,కె.శ్రీనివాస్, కె.రమణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు జరిగిన పోటీల వివరాలను లార్డ్ కృష్ణ బ్యాట్మింటన్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ తెలిపారు. మొదటి రోజు మొత్తం 13 జిల్లాల నుండి 231 మంది బాల బాలికలు తమ పేర్లు నమోదు చేసుకున్నారని.అండర్ 13 బాలుర సింగిల్స్ విభాగంలో 139 మంది క్రీడాకారులు, అండర్ 13 బాలికల సింగిల్ విభాగంలో 72 మంది క్రీడాకారులు, అండర్ 13 బాలుర డబుల్స్ విభాగంలో 50 మంది క్రీడాకారులు, అండర్ 13 బాలికల డబుల్స్ విభాగంలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారని మురళి కృష్ణ తెలిపారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు రౌండ్స్ పూర్తి అయ్యాయి అని శనివారం ప్రీ క్యోట్రర్స్,క్క్యోట్రర్స్ పూర్తి చేసుకుని ఆదివారం సెమి ఫైనల్స్ అనంతరం ఫైనల్ పోటీలు జరుగుతా యని తెలిపారు