-ఎన్నికలప్పుడు స్టాలిన్ దేవాలయాల్లో పూజలు చేశాడు
– బిజెపి తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికలప్పుడు అన్ని దేవాలయాల్లో పూజలు చేశాడు స్టాలిన్. పుత్రప్రేమలో మునిగి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనుకేసుకొస్తున్నారు.
తండ్రీ కొడుకులు కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, తమ వైఫల్యాల నుంచి, తమ ప్రభుత్వంలోని అవినీతి మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే డీఎంకే పార్టీ గందరగోళం సృష్టిస్తోంది.ఉదయనిధి తన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై గారి ఆధ్వర్యంలో పాదయాత్ర ఘనంగా కొనసాగుతోంది.రామేశ్వరం నుంచి మొదలైన యాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు.ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతోంది.
తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ప్రజాధరణ చూసి డీఎంకే పార్టీ తట్టుకోలేకపోతోంది.సనాతన ధర్మాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధితో పాటు ఎం. రాజాలపై చర్యలు తీసుకోవాలి.కాంగ్రెస్ తో పాటు I.N.D.I.A. భాగస్వామ్య పార్టీలు ఊసరవెల్లిలా సన్నాయి నొక్కులు నొక్కుతు మాట్లాడుతున్నారు.సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా కేసు నమోదు చేయాలి.
ఇప్పటికైనా దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిని అనర్హుడిగా ప్రకటించి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.తమిళనాడు బిజెపి శాఖ ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది.యాగాలకు, యజ్నాలకు కేరాఫ్ అని చెప్పుకునే కేసీఆర్.. సనాతన ధర్మాన్ని కించపర్చేలా చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు?