Suryaa.co.in

Andhra Pradesh

జనం మన పార్టీ నేతల ముఖాన ఉమ్మేసి, తొక్కుకుంటూ వెళ్తారు

యడ్యూరప్పకు ఒక రూల్… చంద్రబాబుకు మరొక రూలా? ముకుల్ రోహత్గి
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే హైకోర్టు తీర్పు ఉంటుంది… శుక్రవారం చంద్రబాబు విడుదల ఖాయం
న్యాయానికి న్యాయమే జరుగుతుంది… మంచికి, సమాజ శ్రేయస్సుకు , చంద్రబాబు నాయుడుకి న్యాయం జరుగుతుంది
సిబిఎస్ఈ సిలబస్ గాలికొదిలేసిన జగన్… ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ అంటున్నాడు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తప్పు మీద తప్పులు చేస్తూ దరిద్రపు వేషాలు శృతిమించితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గంగతో రాంబాబు చిత్రం క్లైమాక్స్ లో అధికార మదమెక్కిన ప్రతి నాయకుడు ప్రకాష్ రాజ్ తొక్కుకుంటూ వెళ్లినట్లుగానే ప్రజలు తిరగబడి మన పార్టీ నేతల ముఖాన తొలుత ఉమ్మేసి, తొక్కుకుంటూ వెళ్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ నేతలను హెచ్చరించారు.

రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి వీర వెంకట సత్యనారాయణ అనే ఖైదీ డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. తెదేపా అధినేత, ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుకి రేపు ఏదైనా అపకారం జరిగితే మనల్ని కాపాడడానికి పోలీసులు, వారి ఆయుధాలు కూడా పనిచేయవు. కరోనా అంటించి గతంలో ఇదే పాలకులు కొందరిని చంపించిన దాఖలాలు ఉన్నాయి . ఇప్పుడు దోమలు కుట్టి చంద్రబాబు నాయుడు కి ఏదైనా అపకారం జరిగితే… ప్రజల నుంచి మన పార్టీ నాయకులను కాపాడే వారే లేరు. ప్రజలు తిరగబడి మనల్ని తొక్కుకుంటా వెళ్లే పరిస్థితిని తీసుకురావద్దని ఆయన కోరారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఒక రూల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరొక రూలా? అంటూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ని ప్రశ్నించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై ఒక వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, అవినీతి నిరోధక చట్టం 17A నిబంధన కింద ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని లోయర్ కోర్టు తేల్చి చెప్పి, ఒక చక్కటి తీర్పు ఇచ్చింది. లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

అనంతరం సుప్రీంకోర్టులో ఇదే కేసు పై జస్టిస్ చంద్ర చూడ్, హిమా కోహ్లీ బెంచ్ బెంచ్ ముందు యడ్యూరప్ప తరపున ముకుల్ రోహత్గి వాదనలను వినిపించారు. అవినీతి నిరోధక చట్ట సవరణ అనంతరం తీసుకువచ్చిన 17 A నిబంధన ఈ కేసు కు అప్లికబుల్ అవుతుందని వాదించగా, ద్విసభ్య ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును ఇచ్చింది. ఇప్పుడు అదే ముకుల్ రోహత్గి సిఐడి తరఫున వాదనలు వినిపిస్తూ, అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అప్లికబుల్ కాదని వాదించడం ఆశ్చర్యకరంగా ఉంది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఒక రూల్… చంద్రబాబు నాయుడు కి మరొక రూల్ ఉంటుందా? అని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. యడ్యూరప్ప పదవి కాలం ముగిసిన తర్వాతే ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు పదవీకాలం ముగిసిన నాలుగున్నర ఏళ్ల అనంతరం ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంతో భయపడి, మా పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్న ఉద్దేశంతో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వై నాట్ 175 నుంచి 17 స్థానాలకు దిగజారిన తర్వాత, దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని తెలిసి… ఇలా తమ అన్యాయాలను అడుగడుగునా అడ్డుకుంటూ పోతే మన పార్టీ పరిస్థితి ఏమిటి అని భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చంద్రబాబు నాయుడు పై దాడికి దిగారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

కస్టడీ పిటిషన్ పై అంత తొందరేముంది?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 19వ తేదీ వరకు ఎటువంటి విచారణ చేపట్టవద్దని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వు చేస్తూ, రెండు రోజుల అనంతరం తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతలోనే ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిసిన తర్వాత ఈరోజు ( గురువారం) సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. ఇదే విషయమై నేను ఎంతోమంది న్యాయ కోవిదులతో మాట్లాడాను. కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వులో ఉన్న నేపథ్యంలో , రేపు హైకోర్టు తీర్పు ఇస్తుందని తెలిసిన తరువాత కూడా , ఈరోజు కస్టడీ పిటిషన్ విచారణకు చేపట్టారని తెలిసి వారంతా నివ్వెర పోతున్నారు. హైకోర్టు తీర్పు కోసం వేచి చూడాలి. అంతేకానీ కస్టడీ పిటిషన్ పై వాదనలను విని సాయంత్రం తీర్పు ఇస్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారని వారు అన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కక్షపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, ఈ కేసు నమోదు వెనుకనున్న ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతూనే ఉంది. చివరకు లోక్ సభ లో ప్యానెల్ స్పీకర్ ప్రేమ్ చంద్రన్ కోర్టులో పెండింగ్ లో ఉన్న మ్యాటర్ పై మాట్లాడడం సబ్జుడీస్ అవుతుందని హెచ్చరించినా, బీసీ నేత , ఎంపీ రామ్మోహన్ నాయుడు వారిస్తున్న ఆయన్ని అవమానిస్తూ మిథున్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఏసీబీ న్యాయమూర్తి నిబంధనల మేరకు చంద్రబాబు నాయుడు ని కస్టడీకి ఇవ్వనని కరెక్ట్ తీర్పు ఇస్తారో లేదో చూడాలి.

ఈ కేసులో సిఐడి కొత్తగా ఏసీబీ కోర్టు ముందు ఉంచిన ఆధారాలు అంటూ ఏమీ లేవు. తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఆధారాల కోసమే చంద్రబాబు నాయుడు ని తమకు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరడం ఆశ్చర్యంగా ఉంది. ఆధారాలున్నవి లేకుండానే సాధారణంగా అయితే చంద్రబాబు నాయుడు ని కస్టడికి ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఏసీబీ కోర్టు కస్టడీకి ఇస్తే, ఐదు గంటల తర్వాత ఆయన్ని విచారణ చేపట్టే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడుని ఏసీబీ న్యాయస్థానం కస్టడీకి ఇస్తే విజయవాడ తరలిస్తారా?, లేకపోతే లంబూ, జంబు లు రాజమండ్రి జైలుకే వెళ్లి విచారిస్తారా??, అన్నది ప్రశ్నార్థకమే. ఏసీబీ కోర్టు కనుక కస్టడీకి ఇస్తే గురువారం నాడు రాత్రికి రాత్రే చంద్రబాబు నాయుడుని విజయవాడ తరలిస్తారా? … శుక్రవారం ఉదయం తరలిస్తారా?

ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే రేపు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటీషన్ లో చంద్రబాబు నాయుడు కి కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. న్యాయానికి న్యాయం జరుగుతుంది. మంచికి, సమాజ శ్రేయస్సుకు , చంద్రబాబు నాయుడు కి న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఖర్చుకే నైపుణ్య శిక్షణ అభివృద్ధి పథకాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం వలే బయటకు వస్తారన్న నమ్మకం నాకుంది. న్యాయ వ్యవస్థ పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. అంగళ్లు కేసులో చంద్రబాబు నాయుడు పై పీటీ వారెంట్ జారీ చేశారు.

ఇప్పటికే ఈ కేసులో 79 మంది బెయిలు పై బయటకు వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు ని ఈ కేసులో అరెస్ట్ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కుట్ర నెరవేరదు. అయినా చంద్రబాబు నాయుడు ఎన్ ఎస్ జి సెక్యూరిటీ కలిగిన నాయకుడు. ఎన్ ఎస్ జి సెక్యూరిటీ అధికారుల కళ్ళు కప్పి, పోలీసుల హత్యకు పథ క రచన చేశారని ఆయనపై కేసు పెట్టడం దారుణం. చంద్రబాబు నాయుడుకి అటువంటి ఆలోచనలు ఉండి ఉంటే, ఈ దరిద్రం మనకు ఉండేదా ? అని ప్రజలు ఒక్కసారి ఆత్మవలోకనం చేసుకోవాలి.

ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడుతో పాటు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ అవినీతి నిరోధక చట్టంలో 17A నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందే. ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు పై పిటి వారింట్ జారీ చేసిన కోర్టు ముందు నిలబడదు. లోకేష్ తప్పించుకోవడానికి ఢిల్లీలో ఉన్నారంటూ కొంతమంది పనికిమాలిన వెధవలు మాట్లాడుతున్నారు. లోకేష్ కు ఏమైనా నోటీసులు ఇచ్చారా?, నోటీసులు ఇస్తే ఆయన విచారణకు హాజరు కాకుండా ఢిల్లీలో ఉన్నారా? తన తండ్రికి వచ్చిన కష్టానికి బాధ్యత కలిగిన కొడుకుగా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుసుకుంటూ మద్దతును కూడగడుతున్నారు.

ఒకవేళ హైకోర్టులో తీర్పు సానుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఏదో రకంగా లోకేష్ ను కూడా అరెస్టు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఫైబర్ గ్రిడ్ లో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కు లబ్ధి చేకూరిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం టెండర్ ను పొడిగించారన్న కారణంగానే కేసు నమోదు చేశారు.

ఫైబర్ గ్రిడ్ లో A2 గా ఉన్న నాగేశ్వరరావు ఇప్పటికే బెయిల్ పొందారు. ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులోనూ ఇప్పటికే A2 గా ఉన్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ పొందారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు ని కేసుల్లో ఇరికించాలన్న ఉద్దేశంతో పిటి వారెంట్లు జారీచేసి కోర్టు ముందు ప్రజెంట్ చేయడం ద్వారా, జైలులోనే ఉంచాలని దురాలోచనను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ అవినీతి నిరోధక చట్టంలోని 17A అప్లికబుల్ కావడంతో అటువంటి దుస్సాహాసం చేయవద్దు. దుష్టుడు దుస్సాహాసమే చేస్తారని తెలుసు…దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని రఘు రామకృష్ణంరాజు హెచ్చరించారు.

చంద్రబాబు వయసు కైనా గౌరవం ఇవ్వాలి కదా?
చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు నిరంతర ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి.. రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి డెంగ్యూ వ్యాధితో ఒక ఖైదీ మృతి చెందారని, నారా చంద్రబాబు నాయుడుకి కూడా దోమలు కుడుతున్నాయని నారా లోకేష్ ఎంత బాధతో ఈ విషయాన్ని చెప్పి ఉంటారు. జైలులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. చంద్రబాబు నాయుడుని అవసరమైతే ఆసుపత్రిలో పెట్టి ఆయన ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.

ఉత్తరప్రదేశ్లో అపర్ణ అనే ఐఏఎస్ ను అరెస్టు చేయడానికి సిఐడి చీఫ్ గా సునీల్ ఉన్న సమయంలో ఒక గ్యాంగ్ వెళ్లి, లక్నో పోలీస్ కమిషనర్ ను కలిస్తే ఇదే విషయాన్ని లక్నో కమిషనర్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, మరో గంట పాటు ఏపీ సిఐడి పోలీసులు లక్నోలో ఉంటే అరెస్టు చేయాలని ఆదేశించడంతో పరుగో… పరుగు అంటూ రాష్ట్ర సిఐడి పోలీసులు పారిపోయి వచ్చారు. ధర్మం నాలుగు పాదాలతో వర్ధిల్లుతుందంటే అది ఉత్తర ప్రదేశ్ లోనే. దొంగ కేసులు పెట్టడం, దొంగతనంగా ఎత్తుకెళ్లడమే సిఐడి పోలీసులకు తెలిసిన పని.

నాపై నమోదు చేసిన కేసులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సహకరించడంతో ఎత్తుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు విషయంలో సహకరించకపోవడంతో చేసేది లేక చేతులు ముడుచుకు కూర్చున్నారు. సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సమయమనం పాటించి, తీర్పు రేపటికి వాయిదా వేస్తే మంచిదని రఘు రామకృష్ణంరాజు సూచించారు.

విద్యా విధ్వంసాన్ని మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి
రాష్ట్రంలో విద్యా విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెర లేపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్ ను అమలు చేస్తానని చెప్పిన ఆయన, ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ సిలబస్ ను అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు . బై జూస్ ద్వారా ఆన్లైన్ విద్యా విధానం అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు బై జూస్ సంస్థ రేపో మాపో ఎత్తిపోయే కంపెనీ. ఆ కంపెనీ సీఈఓ రాజీనామా చేశారు. బైజూస్ కు రాష్ట్ర ఖజానాను డబ్బులను జగన్మోహన్ రెడ్డి దోచి పెట్టారు.

ఏడు నెలల క్రితం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సీబీఎస్ఈ సిలబస్ ను అమలు చేస్తానని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి, సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయకముందే, ఆయనకు ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ అమలు చేయాలని కల వచ్చింది. అనుకున్నదే తడువుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంటర్నేషనల్ సిలబస్ అమలు చేస్తానంటూ ప్రకటించారు. ఇంటర్నేషనల్ సిలబస్ కలిగిన పాఠశాలలు దేశంలోనే 200 లేవు. కెనడాలో కేవలం 136 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు మించి స్కూల్లు లేవు. ఇంటర్నేషనల్ సిలబస్ ను వివిధ దేశాలలో దౌత్యధికారులుగా పనిచేసే వారి పిల్లలు అభ్యసిస్తూ ఉంటారు.

ఒక దేశం నుంచి, మరొక దేశానికి దౌత్యధికారులు బదిలీ అయినప్పుడు వారి పిల్లలకు ఎటువంటి విద్యాపరమైన సమస్యలు తలెత్తకుండా ఇంటర్నేషనల్ సిలబస్ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగానే ఐదు వేల ఇంటర్నేషనల్ సిలబస్ స్కూల్ ఉంటే, రాష్ట్రంలో ఏకంగా 62 వేల పాఠశాలలలో ఇంటర్నేషనల్ సిలబస్ అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇంటర్నేషనల్ సిలబస్ లో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. ఒక్కొక్క టీచర్ కు 19 నుంచి 21 లక్షల రూపాయల వేతన ప్యాకేజీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగిని రిక్రూట్ చేయలేదు.

ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఉద్యోగాలలో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇప్పుడు శిక్షణ ఎవరు ఇస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ పేరిట తమకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే, టీచర్ ఇంతచొప్పున కమిషన్ ఇస్తామని కోటు వేసుకుని వచ్చిన వారు ఏమైనా ప్రతిపాదన పెట్టారా?, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ సిలబస్ అని అంటున్నారా అని రఘురామ కృష్ణంరాజు సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ సిలబస్ లో మన రాజ్యాంగం గురించి, సంస్కృతి, సాంప్రదాయాలు నాగరికత గురించి పాఠ్యాంశాలు ఉండవు. మన దేవుడి గురించి పిల్లలకు బోధించే అవకాశం ఉండదు.

కేవలం క్రిస్టియన్ మతాన్ని, క్రీస్తు జీవిత గాధ గురించే పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడతామని చెబుతుంటే రఘురామ కృష్ణంరాజు వంటి వారు అడ్డు చెబుతున్నారని రేపు తల్లిదండ్రులను రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. జాతీయ విద్యా విధానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మాతృభాషలో విద్యార్థులకు బోధన చేయాలన్న నిబంధన స్పష్టంగా ఉంది. పొరుగునే ఉన్న తమిళనాడులో మాతృభాషలో పరీక్షలు రాస్తే పదిహేను శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి మన విద్యా వ్యవస్థను ఏమి చేయాలనుకుంటున్నారు.

ఇంటర్నేషనల్ సిలబస్ అమలు కోసం ముందుకు వచ్చిన వారికి డబ్బులు ఇస్తే వారు అందిన కాడికి తినేస్తే రేపు విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?. ఇక్కడి పోటీ పరీక్షలకు ఇంటర్నేషనల్ సిలబస్ సరిపోదు. నీట్ వంటి పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే సీబీఎస్ఈ తో పాటు, ఇప్పటివరకు రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానమే మేలు. ఇంటర్నేషనల్ విద్యా విధానాన్ని అమలు చేయాలనుకోవడం పిచ్చి ఉన్మాద చర్య అవుతుంది. విద్యా వ్యవస్థను విధ్వంసం చేయడానికి ఈ పిచ్చి చేష్టలు. త్వరలోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెల్ల వారిని వారిని వెనక్కి పంపి విద్యా వ్యవస్థను బాగు చేసుకుందాం.

ఇంగ్లీష్ మీడియం తో పాటు మాతృభాషలోనూ విద్యార్థులకు విద్యను బోధించే చర్యలు తీసుకుందాం. అన్ని భాషలోనూ విద్యార్థులు ప్రావీణ్యం సాధించేలా కృషి చేద్దాం.. జగన్ తీసుకొస్తానంటున్న వ్యవస్థ మానసిక దురావస్తఅని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇక చిరుద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత వారి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్లు ఉంటాయి. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుళ్లు ఇప్పటికే డిగ్రీ పూర్తి చేశారు. ఒక చిరుద్యోగికి 35 ఏళ్లకు పెళ్లి అయినా, వారి పిల్లలకు పాతికేళ్లకే డిగ్రీ ఎడ్యుకేషన్ పూర్తవుతుంది.

చిరుద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అంటూ క్యాబినెట్ నోటు పెట్టిన వారికి, సాక్షి దినపత్రికలో ఈ వార్త రాసిన వారికి , చెప్పిన వారికి బుద్ధి ఉండాలన్నారు. తెలంగాణతో పాటే డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి సన్నాహాలను చేసుకుంటున్నారు. కులం చూడం… మతం చూడమని చెప్పే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని న్యాయస్థానాలలో 83 మంది తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రభుత్వ న్యాయవాద పదవులను కట్టబెట్టారు. మళ్లీ ఆయనే నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE