విజయవాడ : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర… కర్ణాటక విజయం… తెలంగాణాలో కాంగ్రెస్ కు నయా జోష్ వెరసి… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్నాయి. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ కు మద్ధతు లభిస్తుంది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రముఖ డాక్టర్ విజయ్ కుమార్ తన అనుచరులతో కలిసి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు సౌదీ అరేబియాలో కూడా మంచి డాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విజయ్ కుమార్ పార్టీలో చేరడం శుభ పరిణామమని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని, కాంగ్రెస్ బలోపేతానికి క్రుషి చేస్తానని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
కడప జిల్లా నుంచి…
ఉమ్మడి కడప జిల్లా మైదకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి కూడా గురువారం 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్మన్ సాకే శంకర్ ఆధ్వర్యంలో, మాలమహానాడుకు చెందిన జీ.వెంకటరమణ, పీ.మహేష్, ఎస్.వెంకటరమణ, పీ.మనోహర్, కే.గంగులయ్య, హెచ్.రాజేష్, శిఖామణి, వెంకటేశులు, ఏ.శ్రీనివాసులు, ఆర్.కే.కిషోర్ లకు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.