– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం. ధారు నాయక్
జగన్ మోహన్ రెడ్డి, ఆయన పేటిఎం బ్యాచ్ తెలుగుదేశంపై విషం కక్కుతూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేశాడని దుష్ప్రచారం చేసింది. పాలన చేతగాక జగన్‌రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలితే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. మా నేత వ్యవస్థలను మేనేజ్ చేస్తే స్కిల్ కేసులో నేటికి రిమాండ్ విధించి 25 రోజులైన ఎందుకు జైల్లోనే ఉన్నారు?
వైకాపా ప్రభుత్వం, సి.ఐ.డి స్కిల్ కేసు క్వాష్ కాకుడదనే దురుద్దేశంతో అబద్దాలతో కోర్టులను అయోమయానికి గురిచేస్తున్నారు. మంగళవారం నాడు సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్‌పై వాదనలు ముగిసి ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందనే సమయంలో హైకోర్టు సబ్‌మిట్ చేసిన పత్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలని కోరి తీర్పును వాయిదా వేయించడం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే.
జస్టిస్ ఈజ్ డిలేయిడ్..జస్టిస్ ఈజ్ డినైడ్ అన్న న్యాయ సూత్రం సిఐడీ తరపున వాదిస్తున్న న్యాయవాదులకు తెలియదా? మా అధినేతను 25 రోజులుగా అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టాడాన్ని సైతం జగన్ రెడ్డి కోర్టులను, న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని అనుకోవాలా? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా సి.ఐ.డి అధికారులు ఈ కేసును ఏదో ఒక రకంగా లాగి చంద్రబాబు నాయుడిని ఎక్కువ రోజులు జైల్లోనే ఉంచాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు.
రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉన్న పార్టీ తెలుగుదేశం. జగన్‌రెడ్డి ప్రభుత్వం, సిఐడీ ఎన్ని కుట్రలు చేసిన చివరికి గెలిచేది న్యాయమే. పదవులు, హోదాల కోసం జగన్‌రెడ్డి ఆడమన్నట్లు ఆడుతున్న అధికారులు రేపు చట్టం ముందు దోషులుగా నిలబడతారని గుర్తించుకోండి.