-ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించాలి
– దొంగ ఓట్లపై ఎన్నికల కమిషనర్ కు టీడీపీ ఫిర్యాదు
– సానుకూలంగా స్పందించిన కమిషనర్
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం సచివాలయందగ్గర మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని పూర్తి వివరాలతో ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం ద్వారా వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కమిషనర్ ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భించాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్క ఎలక్షన్ కూడా ప్రజా ఆమోదంతో గెలిచిన సందర్భాలు లేవు. ఎప్పుడూ మేనిప్లేట్ చేసి గెలవడం జగన్ కు అలవాటైంది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఎలక్షన్స్, ప్రతి ఎన్నికల్లోనూ అదే విధంగా గెలిచారు. రానున్న కాలంలో అయినా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓట్ల దొంగలు రాష్ట్రంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వారికి అనుకూలంగా వున్నవారి పేర్లను బూత్ లలో చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారు.
జరుగుతున్న ఈ తతంగాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సెంట్రల్ ఎన్నికల కమీషన్ కి కూడా ఫిర్యాదు చేసి యున్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఉపయోగించి ఎన్నికల విధానాన్ని భ్రష్టు పట్టించారు. వీటన్నింటిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. పర్చూరులో జరిగిన సంఘటన పిన్ పాయింట్ గా కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు తీసుకున్నారు. వెంటనే అధికారులను సస్సెండ్ చేశారు. ఫిర్యాదు అందగానే చర్యలు తీసుకోవాలని కోరాం.
తిరుపతి ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయి. మేం కంప్లైంట్ ఇచ్చాం. నామమాత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు తప్ప తదనంతరం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదు. పర్చూరు, తిరుపతిలో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి ఆపారు. వెంటనే దానిపై ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. పయ్యావుల కేశవ్ ఫిర్యాదుతో ఉరవకొండ నియోజకవర్గంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఇంకా లోతుగా చర్యలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. వైసీపీ నాయకులు వాలంటీర్లను ఉపయోగించుకొని ఫారం 6, 7 లు విపరీతంగా అప్లై చేస్తున్నారు.
అర్హత కలిగినవారిని మాత్రమే ఓటర్ లిస్టుల్లో చేర్చాలని కమీషన్ కు తెలిపాం. దానిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కమిషనర్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 5 అప్లికేషన్ ల కంటే ఎక్కువగా పెట్టడానికి అవకాశం లేదు. నేడు 57 మంది దాదాపు వెయ్యేసి అప్లికేషన్లు పెట్టారు. సుమారు 2,500 మంది పది నుంచి వంద అప్లికేషన్స్ పెట్టి దొంగ ఓట్ల కింద చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేం పేర్ల వారిగా నాలుగు కంటే తక్కువ అప్లికేషన్ లు పెట్టామని జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా పేర్లతో సహా కమీషనర్ కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాం.
ఆయన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇది సంతోషించదగ్గ విషయం. ఇప్పటికైతే మేం ఇచ్చిన అప్లికేషన్స్ పైన యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకా దాన్ని ఉధృతం చేయాలి. వైసీపీ నాయకుల మాటలు విని ఓటర్ లిస్టుల్లో అవకతవకలు చేస్తే వారు తగు మూల్యం చెల్లించుకోక తప్పదు. పద్ధతి ప్రకారం చేయాలి.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని, జగన్ ను రాజకీయంగా ఉరి తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబుపై సంబంధం లేని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి 34 రోజులుగా జైల్లో పెట్టారు. ఇంతవరకు ఎక్కడా అవినీతి జరిగిందనిగానీ, డబ్బులు పట్టుబడ్డాయనిగానీ నిరూపించబడలేదు. జగన్ అరెస్టు అయ్యే నాటికి ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ బయటికి రాలేదు. నిజాయితీపరుడు, తెలుగు జాతి గర్వించే వ్యక్తి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మకుటంలేని మహారాజు చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు. యావత్ తెలుగు జాతే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నవారు దీన్ని ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు.
చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసినప్పటి నుండి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని వైసీపీ సైకోలు పిచ్చి కలలు కంటున్నారు. అది కాస్త భూమరాంగ్ అయింది. ప్రతి ఒక్కరు వైసీపీ వికృత సైకో చేష్టలను తిడుతున్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని, జగన్ ను రాజకీయంగా ఉరి తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు తెలియదు, నేను లండన్ వెళ్లాను, పోలీసులు ఎత్తి పడేశారని, తన ప్రమేయమే లేదని ఎగతాళిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో ఈ అరెస్టు జరిగిందన్నాడు. రాష్ట్ర ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చాడు.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, పరిణామాల్ని, విధానాలను, అక్రమ కేసుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక రాజకీయ, ప్రతిపక్ష పార్టీగా మాకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాం. లోకేష్ ను, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రపు హక్కు లేదు. అమిత్ షా సానుకూలంగా స్పందించారు. జగన్ చేసింది తప్పు, చంద్రబాబు అరెస్టులో మా ప్రమేయం లేదని అమిత్ షా చెప్పారు. ఈ వ్యవహారాలను గమనిస్తున్నామని, మా సపోర్టు ఎప్పుడూ న్యాయానికి, ధర్మానికి ఉంటుందని అమిత్ షా స్పష్టంగా చెప్పారు.
మేం అమిత్ షాను కలవాలని పురందేశ్వరి, కిషన్ రెడ్డి లను అడిగితే.. ఫలానా సమయానికి రండని చెబితే మేం వెళ్లే సరికి వారు అక్కడ ఉన్నారు తప్ప కలిసి వెళ్లలేదు. అందరూ కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులపై కూడా ఉంది కావున పురందేశ్వరి ఆ విధంగా వెళ్లారే తప్ప ప్లానింగ్ ప్రకారం ఏమీ వెళ్లలేదు. వైసీపీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ ఆరిపోయే దీపం. వైసీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంది. ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు. ఉత్తరాంధ్ర ప్రజలు కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు. వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని చిందరవందర చేశారు. వైజాగ్ ని కబ్జా చేశారు. ఆస్తులను దోచుకున్నారు.
ప్రతి ఒక్కర్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్, వైసీపీ నాయకులు ప్రజలు అమాయకులనుకుంటున్నారు. వారు తెలివైనవారు. ఉత్తరాంధ్రపై జగన్ కు ప్రేమ లేదు. 4 సంవత్సరాల 8 మాసాలైంది. ఉత్తరాంధ్ర ప్రజల వలసలు ఆపడానికి ఏమైనా చేశారా? ఏ ప్రాజెక్టుకైనా ఒక్క పైసా ఖర్చు పెట్టారా? ఒక్క ఇండస్ట్రీనైనా తెచ్చి ఒక్క యువకుడికైనా ఉద్యోగం తెచ్చావా? ఉత్తరాంధ్రలోని ప్రకృతి ఇచ్చిన సంపదను దోచుకుంటున్నారు. బెంగుళూరు, ఇడుపులపాయ, కడప, లోటస్ పాండ్, తాడేపల్లి లలో కట్టిన విలాసవంతమైన ప్యాలెస్ లు చాలక ప్రకృతి ఇచ్చిన రుషి కొండను నాశనం చేసి అక్రమంగా భవనాలు నిర్మించారు.
వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను నాశనం చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. రాష్ట్ర ప్రజలు తమకు ఈ నాలుగేళ్లల్లో జరిగిన అన్యాయంపై కక్ష తీర్చుకునేందుకు సమయం కోసం వేచి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, తాడికొండ ఇన్ ఛార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.