Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో జగన్ స్కీములు వర్సెస్ చంద్రబాబు స్కాములు

ఏపీలో మంచికి చెడుకి మధ్య సమరం
ఎంపీ విజయసాయిరెడ్డి

అక్టోబర్ 18: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఎవ్వరికైనా టక్కున గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేసే సంక్షేమ పథకాలు, స్కీములు, అయితే ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అగ్రనేత చంద్రబాబు పేరు వినగానే ఆయన చేసిన స్కాంలు గుర్తుకు వస్తాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచికి చెడుకు మధ్య సమరం జరుగుతోందని, మంచి పక్షాన సీఎం జగన్ నిల్చుంటే చంద్రబాబు చెడుకు కాపుకాస్తున్నాడని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు.

ప్రజల ఆస్తికి కన్నం వేసిన చంద్రబాబు
ప్రజలే తన ఆస్తి అంటూ చంద్రబాబు ప్రజల ఆస్తికే కన్నం వేశాడని, దొరికినంత దొచుకున్నాడని విజయసాయి రెడ్ది అన్నారు. చంద్రబాబు ప్రజల ఆస్తి అని, ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ మెదడు దెబ్బతిన్న టీడీపీ నేతల విచిత్రమైన స్టేట్ మెంట్లు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదని, గొప్ప క్రీడాకారుడు కాదని ప్రజల సొమ్ము దోచుకొని ఆధారాలతో సహా దొరికిపోయి జైలుపాలైన నిందితుడు, వెన్నుపోటుదారుడని అన్నారు.

కాంగ్రెస్ కు ఓటువేస్తే ఓటు వ్యర్థం చేసుకున్నట్టే
కాంగ్రెస్ కు ఓటు వేయడమంటే అనిశ్చితికి, అవినీతికి, గందరగోళ పాలసీలకు ఓటువేసినట్లేనని మొత్తంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఓటు వ్యర్దం చేసుకున్నట్టేనని విజయసాయి రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు వీక్ గా ఉండడంతో నిర్ణయాలన్నీ పార్టీ హైకమాండ్ తసుకుంటున్నదని అన్నారు.

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కి అభినందనలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తెలుగు హీరో అల్లు అర్జున్ కు అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరో కావడం గర్వంగా ఉందని అన్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి సారధ్యంలో 6 అవార్డులు అందుకున్న ఆర్ ఆర్ ఆర్ టీంకు అభినందనలు తెలియజేశారు.

21 లక్షల మందికి ఒక్కరోజులోనే కుల ధృవీకరణ పత్రాలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల కారణంగా కేవలం ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయగలుగుతున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న 30 రోజులకు గానూ కుల దృవీకరణ పత్రాలు జారీ అవుతాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కేవలం ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 21 లక్షల మందికి కేవలం ఒక్క రోజులోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు తెలిపారు.

LEAVE A RESPONSE