టీడీపీలో అందరూ గజ దొంగలనే సీఎం.. జగనే ఒక పెద్ద గజదొంగ
జగన్ చుట్టూ ఉండే గణం పెద్ద గజదొంగలు
తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
డ్వాక్రా, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు ప్రతి వర్గాన్ని జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆచంట సునీత మాట్లాడిన మాటలు…
జగన్ రెడ్డిది ఉద్ధరించే సంక్షేమం కాదు.. మోసకారి సంక్షేమం. ఆడబిడ్డలను ఉద్ధరిస్తానని చెప్పి అఘాదంలోకి నెట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్యాలెస్ లు కట్టుకుంటున్న జగన్ కు మహిళలకు ఆసరా డబ్బులివ్వడానికి మనసు రావటంలేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తాను డ్వాక్రా అక్క చెల్లెమ్మలను ఉద్ధరించేశానని చెబుతున్నారు. ఆసరా ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేశానని మాయ మాటలు చెబుతున్నారు. నేడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలకు కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చానని చెబుతున్నారు. సున్నా వడ్డీకి, పావలా వడ్డీకి రుణాలిచ్చి ఆదుకున్నానని చెబుతున్నారు. ఇవన్నీ మోసకారి మాటలే. బటన్ నొక్కడానికి ఎమ్మిగనూరు కు వెళ్లి అక్కడఎమ్మిగనూరులో జగన్ మరో మోసానికి తెర లేపారు. కోటి 14 లక్షల మంది డ్వాక్రా మహిళలకు మరోసారి కుచ్చుటోపి పెట్టారు.
ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, గీత అని చెప్పి మాట మార్చి మడమ తిప్పారు
ఎన్నికలకు ముందు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, గీత అని గొప్పగా చెప్పుకున్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. మొట్ట మొదటి సంతకం డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీపై పెడతానని మోసపూరిత మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. ఒక్క విడతలో రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఆసరా పథకం ద్వారా నాలుగు విడతలుగా అంతంతమాత్రం రుణమాఫీ చేశారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. కోటి 14 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 11.12 లక్షల డ్వాక్రా గ్రూపులున్నాయి. వీరందరినీ మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలను చంద్రబాబు ఢ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారిని ముందుకు తీసుకెళ్లారు.
చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు కోట్లాది రూపాయలు రుణాలిచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది
డ్వాక్రా సంఘాలకు కోట్లాది రూపాయలు రుణాలిచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన ఘనత గత ప్రభుత్వం, చంద్రబాబునాయడుది మాత్రమే. ఇసుక రీచ్ లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు ఢ్వాక్రా మహిళలను భాగస్వామ్యం కల్పించారు. నేడు ఢ్వాక్రా సంఘాలను వైసీపీ సభలకు జనాలను తరలించే సంఘాలుగా మార్చారు. చంద్రబాబు 13,500 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆర్థిక అసమానతలకు తావులేకుండా చెప్పిన దానికన్నా ఎక్కువగా రుణమాఫీ చేశారు.
ప్రతి మహిళకి రూ. 20 వేల రూపాయలు సహాయం చేసిన ఘనత చంద్రబాబుది. జగన్ మొదటి విడత రుణమాఫీ అన్నప్పుడు 77 లక్షలన్నాడు. రెండవ విడత 76 లక్షలని తప్పు లెక్కలు చెప్పారు. మూడవ విడత 2022 సెప్టెంబర్ లో రుణమాఫీకి నొక్కాల్సిన బటన్ 2023 మార్చిలో నొక్కాడు. రక రకాలుగా సభ్యుల సంఖ్య తగ్గిస్తూ సభ్యులకు రావాల్సిన రుణమాఫీని తగ్గించారు. కోటి 14 లక్షలున్న డ్వాక్రా మహిళల్ని 78 లక్షలకు కుదించారు. చంద్రబాబు రూ. 5 లక్షల వరకు సున్నా వడ్డీకి రుణాలిచ్చారు. జగన్ అధికారంలోకి రాగానే దాన్ని 3 లక్షలకు కుదించాడు. అవి కూడా సరిగా ఇవ్వడంలేదు.
నామమాత్రపు రుణమాఫీ చేసి జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు
నామమాత్రపు రుణమాఫీ చేసి జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఢ్వాక్రా సంఘాల్ని చాలా పటిష్టం చేసి తన మానసిక పుత్రికలుగా చంద్రబాబు చూశారు. జగన్ డ్వాక్రా మహిళల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారి సంక్షేమం కోసం పనిచేసిన దాఖలాలు లేవు. చంద్రన్న లక్ష కోట్లు డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. జగన్ గృహ నిర్మాణాల పేరుతో మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులను చూపించి బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంది ఈ ప్రభుత్వం. జగన్ హయాంలో 25 శాతం కూడా రుణాలు పొందలేదు.
రూరల్ ఏరియాలో వారి ఆర్థిక స్థితిగతులను బట్టి రెండు, మూడు లక్షలు రుణాలు తీసుకొని లబ్ధి పొందిన పరిస్థితులు లేవు. అమ్మ ఒడి ద్వారా డబ్బులిచ్చి నాన్న బుడ్డీ ద్వారా ఆ డబ్బులను లాక్కుంటున్నాడు. మద్యంను యదేచ్ఛగా అమ్మించి మహిళల మాంగల్యాలు తెంచుతున్నాడు. పెన్షన్లు, చేయూత ఇచ్చానని చెప్పడం అబద్ధం. విద్యుత్ బిల్లులు, బస్ ఛార్జీలు, గ్యాస్, నిత్యవసర ధరలు పెంచి సామాన్య మహిళలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఆసరా పేరుతో అక్కచెల్లెమ్మలను జగన్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది. ఢ్వ్రాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను చూపి రాష్ర్ట ప్రభుత్వం రుణాలు తీసుకోవడం నీచం. బిల్ గేట్, బిల్ క్లింటన్ ల పక్కన డ్వాక్రా మహిళల్ని నిలిపి..
ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ పటంలో చూసిన ఘనత చంద్రబాబుది
ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ పటంలో చూసిన ఘనత చంద్రబాబుది. జగన్ ప్రభుత్వం అభయహస్తం డబ్బులు సైతం కాజేసింది. పొదుపు మహిళల డబ్బును కూడా వదలలేదంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. నా అక్క చెల్లెమ్మలని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక మహిళల్ని మోసం చేశారు.. పసుపు కుంకుమ పథకం కింద రూ.18,500 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయాంలో ప్రతి మహిళ రూ.20 వేల వరకు లబ్ధి పొందింది. జగన్ హయాంలో ఏమాత్రం లబ్ధి పొందలేదు.
కృష్ణా జిల్లాలో ఒక అర్బన్ గ్రూపు 6 లక్షల రుణం తీసుకున్నారు. 30 వేలు చెల్లిస్తే వారికి 5 లక్షల 80 వేలు రుణమాఫీ అయింది. అలాగే గుంటూరు జిల్లాలో బీసీ గ్రూపు 5 లక్షల రుణం తీసుకున్నారు. వారికి దాదాపు 4 లక్షల 88 వేల రూపాయలు వారు రుణం చెల్లిస్తే 12 వేలు మాత్రమే రుణమాఫీ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్టీ గ్రూపు 3 లక్షలు తీసుకొని 2 లక్షల 99 వేల రూపాయలు చెల్లిస్తే 11 వేల రూపాయలు రుణమాఫి అయింది. ఇలా జగన్ ప్రభుత్వం ఆర్థిక అసమానతలను చూపిస్తోంది. చంద్రబాబు ఆర్థిక అసమానతలను రూపుమాపారు. ప్రతి ఒక్కరికి సమానంగా రుణాలు అందాలని ఒక మంచి ఉద్దేశంతో పసుపు కుంకుమ పథకం కింద ప్రతి మహిళకు రూ.20 వేలు ఇవ్వడం జరిగింది.
తనకు అక్క చెల్లెమ్మలంటే ప్రాణం అని జగన్ కపట ప్రేమ చూపిస్తుంటాడు
తనకు అక్క చెల్లెమ్మలంటే ప్రాణం అని కపట ప్రేమ చూపిస్తుంటాడు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ ద్వారా ఏం లబ్ధి చేకూర్చారో చెప్పాలి. అర్బన్ ఏరియాలో ఎక్కువ మోతాదులో డబ్బులు తీసుకొన్న వారికి తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఎవరికి కూడా ఈ ఆసరా ద్వారా రుణమాఫీ జరగలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ మాట్లాడుతూ.. తాను మహిళల్ని ఆదుకున్నాను, ఎప్పుడు వారికి అండగా ఉంటాను, గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అన్నారు. ,మీరా? ఈ రోజు ఈ రాష్ట్రం గురిచి మాట్లాడేది?
ముందస్తు అరెస్టులు చేయించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనివుంది. న్యాయమైన కోర్కెలు తీర్చండి, మాకు జీతాలు పెంచండని బయటికి వచ్చి అడిగే పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. మహిళలందరూ వైసీపీని అంతమొందించే వరకు నిద్రపోము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. టీడీపీ పారదర్శకంగా పరిపాలిస్తే వైసీపీ నీచంగా పరిపాలిస్తోంది. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారు.. ఈ మోసపూరిత ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తగిన బుద్ధి చెబుతారని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు.