– నిత్యమూ మీరు పత్తేపారాలు నడిపే సంజన, సుకన్యకి లేఖ ఎందుకు రాయలేదు?
– అరగంటలో ఏమేమి చేస్తారంటూ లేఖాస్త్రం ఎందుకు వదలలేదు?
– టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎదురుదాడి
జైల్లో ఉండి ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖను ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలతో లేఖాస్త్రం సంధించారు. అయితే దానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎదురుదాడి చేస్తూ… అంతకుమించిన వ్యంగ్యాస్త్రాలతో లేఖ సంధించారు. బుద్దా వెంకన్న లేఖ సారాంశం ఇదీ..
మురికి నోటి పారుదల శాఖ మంత్రి అంబటి గారికి ప్రేమతో రాయు ప్రతి లేఖ
నిత్యమూ మీరు పత్తేపారాలు నడిపే సంజన, సుకన్యకి లేఖ ఎందుకు రాయలేదు? అరగంటలో ఏమేమి చేస్తారంటూ లేఖాస్త్రం ఎందుకు వదలలేదు? పిచ్చి జగన్ బ్రాండ్ పచ్చి మందు కాకుండా దుబాయ్ లో మద్యం ఎందుకు కొన్నారు? దుబాయ్ ఏ కన్యతో వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే టెక్నికల్ డీటెయిల్స్ లోకి పోకుండా మీకు ప్రేమతో ప్రతి లేఖ రాస్తున్నాను.
అయ్యా అంబటి…నువ్వు లెటర్ రాసి రాంగ్ అడ్రస్‌కి పోస్టు చేశావు. నువ్వు రాయాల్సిన లేఖలు వీరికి..
1.కృష్ణా జలాలు హక్కులు వదులుకున్న మీ పిచ్చి జగన్ కి, రాష్ట్ర హక్కుల కోసం కేంద్రానికి లేఖ రాయాలి.
2.పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు ఆమోదించమని కేంద్ర జలవనరుల శాఖా మంత్రికి రాయాలి.
3.ఇరిగేషన్ మంత్రిగా పిల్ల కాలువ తవ్వలేని నువ్వు, సాగునీరు ఇవ్వలేని నువ్వు రైతన్నలకు క్షమాపణ చెపుతూ లేఖ రాయాలి.
4.కాపు జాతిపై నోటి దూలతో నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు కాపులకి క్షమించమని కోరుతూ ఉత్తరం రాయాలి.
5.నియోజకవర్గం లో ఒక్క అభివృద్ది పని చేయలేకపోయినందుకు గెలిపించిన ప్రజలకు సారీ చెపుతూ లేఖ రాయాలి.
6. పారిశుధ్య కార్మికుడు చనిపోతే వచ్చిన CM సహాయ నిధిలో వాటా అడిగి, వారు ఇవ్వకపోవడంతో చెక్కు వెనక్కి తీసుకున్నందుకు సిగ్గుపడుతూ మన్నించమని వేడుకుంటూ లేఖ రాయాలి.
7. నీటిపారుదలశాఖా మంత్రిగా ఉంటూ లస్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేని నీ చేతగానితనాన్ని ఒప్పుకుంటూ ఉత్తరం రాయాలి.
8. పిచ్చి మందు తాగలేక దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని..నీ పిచ్చి జగన్ కి లేఖ రాయాలి అంబటి..
9. బాబాయ్‌కి గొడ్డలిపోటు వేసిన అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నీ పిచ్చి జగన్‌ని తప్పు ఒప్పుకోమంటూ లేఖ రాయాలి.
మైడియర్ కాంబాబూ! నీ ఏజేంటి? నీ గేజేంటి? నువ్వు చేసే గలీజు పనులేంటి? ఆ గలీజు చేతులతో లేఖలు రాయడం ఏంటి? ఓహో నువ్వు దుబాయ్‌లో ఉంటే, ఐప్యాక్ పేటీఎం బ్యాచులు ఈ లేఖ రాసేశాయా? అయ్యో రాంబాబు..నీ దుస్థితికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం తప్పా ఏం చేయలేను. నేను రాసిన లేఖ చదువుకుని సమాధానం పంపుతావని ఆశిస్తూ …
ఇట్లు
నీ ప్రియ మిత్రుడు
బుద్దా వెంకన్న