Suryaa.co.in

Telangana

మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోతుందా?

లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు
గతంలో గోదావరిలో వరదలు వచ్చినప్పుడు పంప్హౌజ్లు మునిగిపోయి మోటార్లు మునిగి వేల కోట్ల నష్టం వచ్చింది
ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారు
ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతున్నది
దసరా తర్వాత రెండో లిస్ట్ విడుదల
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్టాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగాయి. ఇంజనీర్లు రాజకీయనాయకులు అక్కడికి వెళ్తే.. వాళ్లను పరిశీలించనీయకుండా అడ్డుకుంటున్నారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు.

మా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ కుంగిన బ్రిడ్జిని పరిశీలించేందుకు ఇవాళ వెళ్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇంజనీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వారి అనుమానాలు నిజమేనని తెలుస్తున్నది. ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారు.

80 వేల పుస్తకాలు చదివి, సూపర్ ఇంజనీర్ గా అవతారమెత్తి, ఇంజనీరింగ్ నిపుణుల మాటలు ఖాతరు చేయకుండా ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేండ్లలోనే ఈ ప్రాజెక్టులో కొంత భాగం కుంగిపోయింది.

గతంలో గోదావరిలో వరదలు వచ్చినప్పుడు పంప్హౌజ్లు మునిగిపోయి.. మోటార్లు మునిగి వేల కోట్ల నష్టం వచ్చింది ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతున్నది. లోపాలు బయటపడుతున్నాయి. ఏటా 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. రైతులకు అందిస్తా అన్న కేసీఆర్.. గత ఐదేండ్లలో రైతులకు ఎన్ని టీఎంసీల నీళ్లు అందించారో చెప్పాలి. గత ఐదేండ్లలో 150 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి.. వాటిని మళ్లీ కిందకు వదిలారు.

ఈ ప్రాజెక్టు సేఫ్టీపైన వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటిని పిలిచి, ప్రాజెక్టును పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నాం.

మొదటి లిస్ట్లో 52 మంది పేర్లను పార్టీ జాతీయ నాయకత్వం ఇవాళ ప్రకటించింది. మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మున్సిపల్చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. దసరా తర్వాత రెండో లిస్ట్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారు. ఈ నెలలో అమిత్ షా గారు 27న వస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రానున్నారు. దసరా తర్వా బీజేపీ ఎన్నికల కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం.

బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది.. దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటాం. తెలంగాణను గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిపాలించాయి. ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలకు అతీతంగా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. కుటుంబ, అవినీతి పరిపాలన మీద మేము పోరాటం చేస్తున్నం. బీఆర్ఎస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారం ఇవ్వాలని మేము ప్రజలను కోరుతున్నాం.

వ్యక్తిగతంగా డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఓటరను కలుస్తాం. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నది. నేను ఈ సందర్భంగా అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ మాత్రం.. పాలక పార్టీ ఒత్తిడికి తలగ్గొద్దు. ఆ పార్టీ చెప్పినట్టు విని ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారు.

ప్రభుత్వ ఒత్తిడిలకు మీరు లొంగద్దు… అధికారులకు చట్ట ప్రకారం నడుచుకోవాలి. వారికి బీజేపీ అండగా ఉంటుంది. రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత చాలా కాలం తర్వాత ఇవాళి బీజేపీ ఆఫీసుకు వచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు. సస్పెన్షన్ ఎత్తేసిన నడ్డా గారికి ధన్యవాదాలు. జనసేన అధినేత తో ప్రాథమికంగా కలిసాం . పొత్తు అంశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. విజయదశమి సందర్బంగా హిందువులందరికి శుభాకాంక్షలు. బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున నా తరపున బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు

LEAVE A RESPONSE