AP: వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గడంతో రాష్ట్రంలో ఉల్లి, టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల 1న విజయవాడలో కిలో ఉల్లి ధర 30 ఉండగా, ప్రస్తుతం 55కు చేరింది. కిలో టమాటా ధర 16 నుంచి 30కి చేరింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధర 100 పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.