న్యూ ఢిల్లీ :విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2లక్షల 50 వేల సాయం ప్రకటించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితి పై ఆరా తీస్తున్నారు.