ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైలు భద్రతా సమీక్ష కోసం జీవీఎల్ చేసిన డిమాండ్‌కు అంగీకారం తెలిపిన రైల్వే చైర్పర్సన్
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైలు భద్రతను మెరుగుపరిచేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూ, బిజెపి రాజ్యసభ ఎంపి శ్రీ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్పర్సన్ శ్రీమతి జయవర్మ సిన్హాను కలిసి విశాఖపట్నం పార్లమెంటులోని కొత్తవలస దగ్గర జరిగిన రైలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
చైర్‌పర్సన్‌తో సమావేశమైన ఎంపీ జీవీఎల్ నరసింహారావు గత ఐదు నెలల్లో రెండు పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైలు భద్రతపై సమగ్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైల్వే భద్రతను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు త్వరితగతిన తీసుకుంటామని ఛైర్పర్సన్ శ్రీమతి జయవర్మ సిన్హా ఎంపీ జీవీఎల్‌కు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.