Suryaa.co.in

Telangana

కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టుగా మోసం మాటలు చెప్పం

కాంగ్రెస్ చేసిందే చెప్తుంది చెప్పేదే చేస్తుంది.
డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలే
ఆరు గ్యారెంటీల అమలకు నిధులు లేకుంటే.. బిఆర్ఎస్ మేనిఫెస్టో అమలుకు నిధులు ఉన్నాయా?
సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చెప్పినట్టుగా మోసం మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదని, చెప్పిందే చేస్తది, చేసేదే చెప్తుందని సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క అన్నారు.

మండలంలోని మోటమర్రి, రాయణపేట, అల్లపాడు, గోవిందపురం, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల్లో భట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు.బిఆర్ఎస్ పాలకులు ప్రజలకు చెందాల్సిన సంపదను దోపిడీ చేసినందున ఆసంపద ప్రజలకు అందలేదన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని అనడానికి కేసీఆర్ కేటీఆర్ కు బుద్ధుండాలని దుయ్యబట్టారు.కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకుంటే.. బిఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. మాయమాటలతో ఎవరిని మోసం చేస్తారు? ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిప్పులు చెరిగారు.

ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బిఆర్ఎస్ మోసం చేసినట్లుగా కాంగ్రెస్ మోసం చేయదని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు
ప్రజలను మోసం చేయడం బిఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పాలకుల దోపిడి అరికడితే చాలని, పరిపాలన అనుభవం కలిగిన మాకు ఆర్ గ్యారంటీ అమలకు నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలో తెలుసని చెప్పారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని 10 ఏండ్లుగా ఇందిరమ్మ ఇల్లు కూడా సీఎం కేసీఆర్ ఇవ్వలేదన్నారు.

దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజల సంపద ప్రజలకు పంచబడాలన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలని భావించే ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావడానికి చేయ్యి గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఆరు గ్యారంటీలు కావాలనుకునే ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

LEAVE A RESPONSE