కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ ఫార్మర్ లో రేవంత్ రెడ్డి చేయిపెట్టి 24 గంటలు నిలబడాలి
కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు
కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు
మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు
సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు
బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్
పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు. తెలంగాణ రాకముందు ఇందిరా పార్క్ సాక్షిగా పవర్ హాలిడేలను తట్టుకోలేమని అనేక పరిశ్రమలు దీక్షలు చేస్తుండేవారు. కరెంట్ లేక చీకట్లో బ్రతికిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఏ రైతైనా రాత్రి పూట మోటార్ వేయడానికి వెళ్తున్నారా ? ఎందుకు రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతుండు ?
తెలంగాణ స్వ రాష్ట్రం గా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 18,453 మెగావాట్లకు పెరిగింది. నాడు సోలార్ పవర్ ఉత్ప త్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరచి ఈగణాంకాలని చూడాలి. కర్నాటక, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ లో ఇంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారా ? రేవంత్ ఎందుకు ప్రజల చెవిలో పువ్వులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
సోనియా గాంధీని బలి దేవత అన్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల పై దాడి చేసి రైపుల్ రెడ్డిగా మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది. చంద్రబాబు చెంచా గా, తెలంగాణ విద్రోహిగా పని చేసిన రేవంత్ రెడ్డికి అసలు అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఉందా ?
అమరావతిలా ఇక్కడ 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ మాటలోనే రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటికి వచ్చింది. రియలెస్టేట్ దందా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.
యువకుల చేత కూరగాయలు అమ్మిస్తానని చెబుతున్నాడు రేవంత్ రెడ్డి. కెటీఆర్ లాంటి నాయకుడు దూరద్రుష్టితో టెక్నాలజీ , టెక్నాలజీ కాంపిటెన్సీ పెరగాలని పని చేస్తుంటే.. మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు, సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు. ఇలాంటి అసమర్ధులు మన తెలంగాణకి కావాలా ? దయచేసి ప్రజలు అర్ధం చేసుకోవాలి.
”హనుమంతుడి ముందు చిట్టెలుక కుప్పిగంతులు వేసినట్లు కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు. కేసీఆర్ ముందు మాట్లాడే అర్హత లేని రేవంత్ రెడ్డి సవాళ్ళు చేయడం హాస్యాస్పదం. ప్రజలు కోడంగల్ లోనే రేవంత్ రెడ్డికి కర్రుకాల్చి వాత పెట్టారు. కామారెడ్డిలో కసరుకక్కిస్తారు. దగుల్బాజీ, రౌడీ, బ్రోకర్, సొంత పార్టీ టికెట్లును అమ్ముకున్న దొంగ రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీ మెట్టు ఎక్కనీయకూడదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు” అని పేర్కొన్నారు బిఆర్ఎస్ సినియర్ నేత డా. దాసోజు శ్రవణ్.
ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. జరుగుతున్న ఎన్నిక గర్వానికి, అగర్వానికి అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నరనరాన కులోన్మాదం నింపుకొని, సొంత పార్టీ నాయకులని కాళ్ళతో తన్నుతూ, బీసి,ఎస్సి, మైనార్టీ వర్గాల్ని బానిసలుగా చూసే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతుంటే నవ్వాలో, ఏడవాలో అర్ధం కాదు. కామారెడ్డిలో మిడతల దండు అని చెబుతున్న రేవంత్ రెడ్డికి అసలు సిగ్గువుందా? ఒక్క కేసీఆర్ పై దాడి చేయడానికి అటు మోడీ ఢిల్లీ దండు, రాహుల్ గాంధీ ఢిల్లీ దండు, డీకే శివకుమార్ దండు.. మూకుమ్మడిగా అడ్డగోలుగా ప్రయత్నిస్తున్నాయి. అసలు దొంగలు, మిడతల దండు, దండుపాళ్యం ముఠా నాయకుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ” అని విరుచుకుపడ్డారు దాసోజు శ్రవణ్.
ఉచిత విధ్యుత్ పై కామారెడ్డిలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తుండు. ఇరవై నాలుగు గంటల పవర్ లేదని రేవంత్ రెడ్డి చెబుతుండు. మేము కూడా సవాల్ చేస్తున్నాం. అదే కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ ఫార్మర్ లో రేవంత్ రెడ్డి చేయిపెట్టి 24 గంటలు నిలబడాలి. ఏం కాకపొతే కరెంట్ లేనట్లే లెక్క. అసలు రేవంత్ రెడ్డికి బుద్ధి వుందా ? పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై నాలుగు గంటకు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ గారి ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేస్తుండు” అని మండిపడ్డారు.
తెలంగాణ రాకముందు ఇందిరా పార్క్ సాక్షిగా పవర్ హాలిడేలను తట్టుకోలేమని అనేక పరిశ్రమలు దీక్షలు చేస్తుండేవారు. కరెంట్ లేక చీకట్లో బ్రతికిన పరిస్థితి. రాత్రి పూట మోటార్ వేసుకోవడానికి వెళ్లి పురుగుపుట్ర కాటుకు గురై దాదాపు మూడు వేలమంది రైతులు చనిపోయిన దుస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఏ రైతైనా రాత్రి పూట మోటార్ వేయడానికి వెళ్తున్నారా ? ఎందుకు రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతుండు. కష్టం జ్ఞానం పెంచుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి” అని సూచించారు దాసోజు.
తెలంగాణ స్వ రాష్ట్రం గా ఏర్పడే నాటికి స్థాపిత విద్యు దుత్ప త్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 18,453 మెగావాట్లకు పెరిగింది. నాడు సోలార్ పవర్ ఉత్ప త్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరచి ఈగణాంకాలని చూడాలి. కర్నాటక, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ లో ఇంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారా ? ఎందుకు ప్రజల చెవిలో పువ్వులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కెటీపీఎస్ ఏడవ ఫేజ్ నిర్మాణం పూర్తయింది. భూపాల్ పల్లి, జయపూర్ ప్లాంట్స్ నిర్మాణం పూర్తి కావడం వలన 18 వందల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.
జూరాల పులి చింతల నుంచి 360, భద్రాది పవర్ స్టేషన్ వలన 1080 మెగా వాట్ల పవర్ అందుబాటులోకి వచ్చింది. దామర్ల చర్ల నుంచి నాలుగువేల మెగావాట్ల పవర్ అందుబాటులోకి వస్తుంది. 22వేల 502 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం, నాణ్యమైన ట్రాన్స్ ఫార్మార్స్, డిస్ట్రిబ్యుషన్ నెట్ వర్క్ ని మెరుగుపరిచి ఒక అద్భుతమైన మోడల్ లో నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ ను కామారెడ్డికి వచ్చి సవాల్ ఎదుర్కోవాలని పనిమాలిన సవాల్ చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తున్న కేసీఆర్ ను సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు’’అని స్పష్టం చేశారు.
పధకాలని సరిగ్గా అమలు చేయకపోవడం వలనే కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచారని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి అసలు మతిగతి వుందా? ఇంత చిల్లర వ్యక్తి తెలంగాణకి అవసరమా? ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఏవో కారణాలతో హత్య గావించబడ్డారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే చంపారా? దీనికి రేవంత్ రెడ్డి ఏమని సమాధానం చెబుతాడు? ఇంత చిల్లరగా ఎందుకు మాట్లడుతుండు? రేవంత్ చిల్లర మాటలు చూస్తుంటే.. రాజకీయాలపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయి’అని పేర్కొన్నారు
దళితబంధు లాంటి పథకాన్ని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయలేదు. దళితుల గురించి ఆలోచించి పని చేస్తున్న కేసీఆర్పై ఎందుకు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ? అని ప్రశ్నించారు. మధ్యపానం గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి నిజంగానే నిబద్దత వుంటే.. మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో వున్న కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించి తర్వాత మాట్లాడాలి’’ సూచించారు.
ఆదిలాబాద్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు గండ్ర సుజాత రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని హెచ్చరిస్తుంది. మహిళల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆదిలాబాద్ వెళ్లి మాట్లాడాలి. మునుగోడు శ్రవంతి దగ్గర మాట్లాడాలి. అసలు మహిళలని గౌరవించే సంస్కారం రేవంత్ రెడ్డికి ఉందా ? అని నిలదీశారు.