Suryaa.co.in

Telangana

హైదరాబాద్‌పై చంద్రబాబు ముద్ర శాశ్వతం

– బాబు ఆలోచనలే హైదరాబాద్ అభివృద్ధికి సోపానాలు
– ఆయన ముద్ర చెరిపినా చెరగనిది
– బాబు ఆలోచనలే కంపెనీల రాకకు పునాది
– సీబీఎస్ ఫోరం ఆధ్వర్యంలో హైటెక్‌సిటీ స్విలర్‌జూబ్లీ సంబరాలు
– సావనీర్ ఆవిష్కర్

హైదరాబాద్ నగరంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ముద్ర చెరిపినా చెరగనిది అని సీబీఎన్ ఫోరం స్పష్టం చేసింది. ఇప్పటి హైదరాబాద్ అభివృద్ధి-సంపదకు నాడు చంద్రబాబు వేసిన బీజాలే కారణమని సీబీఎన్ ఫోరం నేతలు పేర్కొన్నారు. హైటెక్‌సిటీ నిర్మించి 25 ఏళ్లయిన సందర్భంగా ఫోరం హైదరాబాద్‌లో సంబరాలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ఫోరం సభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు అంటే ఒక విజ్ఞానం, జగన్ అంటే ఒక విధ్వంసం అన్నారు. అభివృద్ధికి-అరాచకానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని లక్షలమంది తెలుగువాళ్లు కోట్లాదిరూపాయలు సంపాదిస్తు, ఆ సంపదను సొంత గడ్డకు పంపిస్తున్నారంటే అది చంద్రబాబు పుణ్యమేనన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నాయంటే అది చంద్రబాబు వేసిన పునాదులేనన్నారు.

చీకటి తర్వాత వెలుగు వస్తుందని, అలాగే మళ్లీ తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు రూపంలో మంచిరోజులు రాబోతున్నాయన్నారు. చంద్రబాబుడు అడుగుజాడలే నేటి ఐటి యువతకు ఆదర్శప్రాయమన్నారు. కష్టపడితే పోయేదేమీలేదన్నారు. ఏపీలో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ఎవరి స్థాయిలో వారు పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సునీత, అమర్, కిరణ్‌కల్పన, శ్రీధర్, శైలజ, సుమన్, మానస, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తొలుత సీబీఎన్ ఫోరం హెటెక్ సిటీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి, సావనీర్ ఆవిష్కరించారు.

LEAVE A RESPONSE