Suryaa.co.in

Andhra Pradesh

ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

– డీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి :- విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయిన వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనుంది.

ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. చేసే సాయానికి కూడా అంతశాతం..ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించింది. బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.

LEAVE A RESPONSE