– ఎలిగేషన్ వచ్చిన మురళీధర్ రెడ్డి ఈ ఓటర్ లిస్ట్ ను ఏ విధంగా కాపాడతాడు
-ఓటర్ లిస్టులో అవకతవకలు సరిదిద్దాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా
మంగళవారం అమరావతి, వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, తెలుగుదేశం పార్టీ నేతలు కోనేరు సురేష్, పిల్లి మణిక్యాల రావులతో కలిసి వెళ్లిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను కలిసి ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకల పై చర్యలు తీసుకోవాలని దొంగ ఓట్లను తొలగించి ఒక ఫ్యామిలీ ఓట్లను ఒకే చోట ఉంచేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
175 నియోజకవర్గాల్లో ఓటర్ లిస్టులో ఉన్న దొంగ ఓట్లను తొలగించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఒకే చోట ఉంచాలని వినతి పత్రం అందించాం. ఓటమి భయంతో జగన్ రెడ్డి ఓటర్ల లిస్టును అపవిత్రం చేస్తూ తప్పుడు పనుల జగన్నాటకానికి తెరలేపాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఓటు హక్కును వైసీపీ నేతలు తీసేసి ఓటర్ లిస్ట్ లో అవకతవకలకు పాల్పడుతున్నారు.
ముఖ్యమంత్రి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కలిసి తాడేపల్లి కొంపలో కూర్చొని ఓట్ల ఆవకతవకల దుర్మార్గాలు చేస్తున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి స్పెల్లింగ్ కరెక్షన్ తో ఒకే వ్యక్తికి నాలుగు పక్క పక్క నియోజకవర్గాల్లో ఓట్లు వేసేటట్టు దొంగ ఓట్లు చేరుస్తున్నారు.
మైలవరంలో 34 వేల ఓట్లను సంబంధంలేని ప్రాంతాల్లో ఓటర్లు తెలుసుకోలేని విధంగా 295 బూతుల్లో విసిరి వేశారు. చంద్రబాబు నాయుడు జరుగుతున్న అవకతవకలను పసిగట్టి సంవత్సర కాలంగా పార్టీ కార్యకర్తలు నాయకులను హెచ్చరించబట్టి ఈ పాపాలన్నీ బయటకు వచ్చాయి.
మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆప్తుడు సన్నిహితుడు ఎలిగేషన్ వచ్చిన అధికారి ఈ ఓటర్ లిస్ట్ ను ఏ విధంగా కాపాడతాడు. బి ఎల్ వోలు ఎక్కువ శాతం సచివాలయ ఉద్యోగులే. సచివాలయాలను వాలంటీర్ల కనుసన్నల్లో పెట్టారు. వాళ్లు 95% వైసీపీ కార్యకర్తలేనని విజయసాయిరెడ్డి చెప్పాడు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి పనిచేస్తున్న టీచర్ల వ్యవస్థను పక్కనపెట్టి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కలిసి ఓటర్ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. ఓటర్ లిస్టులో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు అరికట్టాలని చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.