• ఎన్నికలు సమీపిస్తున్నా ఓటర్ల జాబితా ప్రక్షాళన కొలిక్కి రాకపోవడానికి వైకాపానే కారణం
• మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు
పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు పెట్టాల్సిన టార్గెట్లను అర్హల ఓట్లు తొలగించేందుకు నియోజకవర్గాల వారీగా టార్గెట్ లు పెట్టి మరీ తొలగించడం వైసీపీ అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగపై ఒత్తిడి తెచ్చి మరీ ఓట్లు తొలగింపుపై టార్గెట్లు విధించడం దుర్మార్గం. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతో తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రలేని రాత్రులు గడుపుతూ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతూ పెద్దఎత్తున ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతీ నియోజకవర్గంలో టార్గెట్ లు పెట్టి ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్రలకు తెరతీశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో ప్రతిపక్ష ఓటర్లను ఇష్టానుసారం మార్చేశారు. ఏ బూత్‌లో చూసినా బోగస్ ఓట్లే దర్శనమిస్తున్నాయి. ఒకే కుటుంబంలోని ఓట్లు వివిధ పోలింగ్ కేంద్రాలకు మార్పు చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు తారుమారు చేశారు. ఫోటోలు ఒకేలా ఉన్నాయంటూ ఓటర్లకు నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితాలో ఇప్పటికీ 8.5 లక్షల అనర్హుల ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు 4.30 లక్షలు, మృతుల ఓట్లు 4.20 లక్షలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు పెడుతున్నా ఫలితం లేకపోవడానికి కారణం వైకాపా పార్టీనే.
ప్రజాస్వామ్యానికి ఆయువపట్టైన ఓటు హక్కును ప్రజలకు లేకుండా చేస్తున్న వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి.
ఎన్నికలకు మూడు నెలలు లేని సమయంలో కూడా గంపగుత్తగా ఫామ్-7 లు నమోదు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒక రాజ్యాంగ సంస్థను తప్పుదోవ పట్టించడం గతంలో ఎన్నడూ చూడలేదు. అధికారపార్టీ నాయకులు తెల్ల కాగితంపై పేర్లు రాసిస్తే ఈఆర్ఓలు, డీఈఓలు ఏ విధంగా ఓట్ల నమోదు చేస్తారు? జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో ఒక్క రోజు నివాసం లేకపోయినా ఆయన ఓటు మాత్రం పులివెందులలోనే ఉండాలి…సామాన్యుల ఓట్లు మాత్రం తొలగించాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో వైకాపా నాయకులు అధికారులపై ఒత్తిడి చేసి ఓట్ల అక్రమాలకు పాల్పడం దుర్మార్గం. ఇప్పటికైన ఎన్నికల అధికారులు అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా చట్టబద్దంగా వ్యవహరించాలి.