-ఆ ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి సాత్మానందేందర ల వందల కోట్ల అక్రమాలు, వసూళ్లు పై సిబిఐ, ఈ డీ విచారణ జరిపించాలి
-విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్ లు అమ్మిన వ్యక్తి శారదా పీఠాధిపతి ఎలా అయ్యాడో తేల్చాలి?
-శారదాపీఠం భూములు కబ్జా నుంచి భీమిలి భూమి గ్రావెల్ అమ్మకం వరకు అడుగడుగునా అక్రమాలు అన్యాయాలు
-శాసనసభ్యులు, మంత్రులు ఉన్నతాధికారుల నుంచి శారదా పీఠం తీసుకున్న కానుకలు వందల కోట్ల లోనే
-స్పెషల్ ఫ్లైట్, ప్రోటోకాల్, స్పెషల్ సెక్యూరిటీ స్వామి కి అవసరమా?
-స్వరూపానందేంద్ర ను నమ్ముకొంటే కేసీఆర్ కి పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో జగన్ కి!
-వైభవ వెంకటేశ్వర ఆలయం తో పాటు పలు ఆలయాల కబ్జా కు స్వరూప యత్నం
-జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్
విశాఖపట్నం:- అన్యాయాలు, భూ లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా పోతుంది. క్రైస్తవుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను హిందువుగా చూపించి హిందువుల ఓట్లు వేయించినందుకు కానుక రాష్ట్ర ప్రభుత్వం స్వామికి 250 కోట్ల రూపాయల విలువైన చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టింది.
జీవీఎంసీ నాలుగో వార్డ్ పరిధిలోకి వచ్చే భీమునిపట్నం కి అనుకొని ఉన్న సర్వే నెంబర్ 102 /2 లో 7.70 ఎకరాలు 103 లో 7:30 ఎకరాలు కేవలం 15 లక్షల రూపాయలకు కానుకగా సమర్పించింది. అంతటి ఆగకుండా విశాఖ వి ఎం ఆర్ డి ఏ ను రంగంలోకి దింపి స్వామి కోసం రెండు కోట్ల రూపాయల రహదారిని నిర్మింప చేసింది. ఇంతా చేసిన తర్వాత వేద పాఠశాల, ఆధ్యాత్మిక సేవలు పేరుతో తీసుకున్న ఈ భూములను వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని శారదా పీఠం దరఖాస్తు చేసింది.
అంటే శారదా పీఠం ఉద్దేశం కేవలం వ్యాపారమే. వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెందిన 250 కోట్ల రూపాయల ఆస్తులను శారదా పీఠానికి కట్టబెట్టడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ఈ భూ కేటాయింపులను వెంటనే రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. నకిలీ స్వామిగా, దొంగ స్వామిగా , ఖై నీ స్వామి గా పేరుగాంచిన శారదా పీఠాధిపతి చేతులలో ఉన్న భూములను జగనన్న కాలనీగా మార్చి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఓటేసి గెలిపించిన “నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలకు” నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూమి కేటాయించిన జగన్ తనకు బినామీగా చెప్పుకునే స్వామికి జీవీఎంసీ పరిధిలో 250 కోట్ల రూపాయల విలువైన భూములను దారా దత్తం చేయటం కచ్చితంగా అధికార దుర్వినియోగమే. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కుటుంబానికి బినామీగా చెప్పుకునే సెయింట్ లూక్స్ సంస్థకు గీతం కళాశాల పక్కన 10 ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఆ సంస్ధ అక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరపటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేయకుండా పీఠాలు , మతాధికారులు కోసం పని చేయటం రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. శారదా పీఠం, సెయింట్ లుక్స్ సంస్థల చేతుల్లో 500 కోట్ల రూపాయల కు పైగా విలువచేసే భూములు నగర పరిధిలో ఉన్నాయి. ఈ రెంటిని వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాం.
వేద పాఠశాల, ఆధ్యాత్మిక సేవ పేరుతో భీమునిపట్నం లో భూములు తీసుకున్న నకిలీ స్వామి స్వరూపానంద ఇప్పుడు అందులో వ్యాపారం చేస్తా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం, అది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ముఖ్యమంత్రి ఒత్తిడితో అధికారులు ఫైలు సిద్ధం చేయడం దారుణం. శారదా పీఠం , సెయింట్ లూక్స్ సంస్థల కేటాయింపుల్లో వైఎస్సార్ కుటుంబం ప్రమేయం వున్నందున ఇందులో వారికి కూడా వాటాలు ఉన్నాయని అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ రెండు సంస్థల కేటాయింపులను రద్దుచేసి, భవిష్యత్తులో ఈ తరహా సంస్థలకు భూ కేటాయింపులు జరగకుండా చట్టం చేయాలని కోరుతున్నాం. విశాఖపట్నం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్న స్వరూపానందేంద్ర స్వామికి విశాఖలో 15 ఎకరాల భూమి ఎందుకో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి?
శారదాపీఠంపై ఈడి విచారణ జరపాలి.
విశాఖ వీధుల్లో బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకుంటూ, వీధుల్లో బిక్షాటన చేస్తూ పలువురికి పండు గాడిగా తెలిసిన స్వరూపానంద ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారు? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖుల అందరిని పీఠానికి రప్పించుకుని వారి నుంచి కనీసం రూ. 50,000 నుంచి లక్షల్లో కానుకగా తీసుకునే స్వామి ఆ డబ్బులు అన్నిటికీ లెక్కలు చెప్పాలి. పలు ప్రభుత్వాల నుంచి భూములు రాయితీలు పొందిన శారదా పీఠానికి గత చరిత్ర అంటూ ఏమీ లేదు.
పీఠం ఒక ఆధ్యాత్మిక సంస్థగా కాక స్వరూపానందేంద్ర వ్యక్తిగత సంస్థగా గానే గుర్తింపు పొందింది. మిగిలిన ఆధ్యాత్మికత పెద్దలు ఎవ్వరూ స్వరూపానందేంద్ర ను ఒక స్వామిగా గుర్తించరు. ఇటువంటి వ్యక్తి కి వందల కోట్ల విలువైన భూములు కేటాయించడం, ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలను అప్పగించే ప్రయత్నం చేయటం నిబంధనలకు విరుద్ధం. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజగురువుగా చాలా మందిని బెదిరింపులు , బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న స్వరూపానంద ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక వ్యవహారాలపై పలు అనుమానాలు ఉన్నాయి.
ఆయన పీఠం కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నిర్మించింది. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా నోటీస్ ఇచ్చి కాలక్షేపం చేస్తున్నారు. గతంలో పులి చర్మం మీద కూర్చుని ఆయన చేసిన హంగామా పై అటవీ శాఖ కన్నెర్ర చేసింది. తిరుమల కొండపై పీఠం పేరిట ఆయన స్థలం పొంది ప్రతి నెల లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు.
దేవాదాయ శాఖలో ఆయన హవా అంతా ఇంతా కాదు. సిబిఐ ఈడి వంటి సంస్థలతో సమగ్ర విచారణ జరిపి స్వరూపానందేంద్ర సాత్మ నందేందరల అక్రమాల నువెలికి తీసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
స్వామి బయటకు కదలాలంటే ప్రత్యేక విమానం. బయటకు రావాలంటే భారీ సెక్యూరిటీ. మంత్రుల కంటే ఎక్కువ గా ప్రోటోకాల్. బుగ్గ కార్లు. ఇవి స్వామిజీ లకు అవసరమా? ఈయనా జనానికి మంచి చెప్పేదీ ? చేసేదీ? అత్యంత అవినీతి పరులైన రాజకీయ నాయకులు కంటే ఘోరం స్వామి వ్యవహారం.
జనం కట్టుకొన్న సీతమ్మ ధార సాయిబాబా ఆలయం, మురళీ నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాల కబ్జా కు యత్నం.
జనం చందాలు వేసి కట్టుకొన్న సీతమ్మ ధార సాయిబాబా ఆలయం, మురళీ నగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాల కబ్జా కు స్వరూపానందేంద్ర ప్రయత్నం చేసిన మాట నిజం కాదా? విశాఖపట్నం పెద వాల్తేరు వెంకటేశ్వర స్వామి ఆలయం కబ్జా కు యత్నించారు. తాన పరిధిలో ఆలయాలు లేని బోగస్ పీఠాధిపతి కావడం వల్లే స్వరూపానందేంద్ర ఈ ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు.
శాస్త్రం, వేదాలు , మంత్రాలు రాని ఈ స్వామి పై పూర్తి స్ధాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నం.ఈ కార్యక్రమం లో చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త పి వి స్ న్ రాజు, ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, కిరణప్రసాద్ పోల్గన్నారు.