-కాంగ్రెస్ లీడర్స్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావంతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.దేశంలో త్యాగం అంటే గాంధీ కుటుంబానిదే.ఆ కుటుంబం దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం అర్పించింది..
పదవులను త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీది. త్యాగం అంటే సోనియమ్మది, త్యాగం అంటే రాహుల్ గాంధీది.బీజేపీ నాయకులు అఖండభారత్ అంటున్నారు.గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మోదీజీ? ఉండడానికి సొంత ఇల్లు లేని గాంధీ కుటుంబానికి అవినీతి మరకలు అంటించాలని చూస్తారా?
గాంధీ కుటుంబాన్ని అవమానించిన బీజేపీని ఓడించాలి.దేశంలో మోదీతో మనం యుద్ధం చేస్తుంటే… సందట్లో సడెమియాలా బిల్లా-రంగాలు వీధుల్లో తిరుగుతున్నారు.
సరిగ్గా యాభై రోజులు కాలేదు.. అప్పుడే కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు.ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇప్పటి వరకు పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో రెండు హామీలను అమలు చేయబోతున్నాం. 3650 రోజులు పాలించిన మీరు రాష్ట్రాన్ని దివాళా తీయించారు. దద్దమ్మలారా మీరా మమ్మల్ని ప్రశ్నించేది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.అయినా మేం ఏ సంక్షేమ పథకాలను ఆపలేదు.
ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రంలోని 63 లక్షల రైతుల ఖాతాలకు రైతు భరోసా నగదు బదిలీ చేస్తాంమాట్లాడితే మేస్త్రీ అని విమర్శలు చేస్తున్నారు.
బిడ్డా.. నేను మేస్త్రీనే… మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి భవిష్యత్ ను నిర్మించే మేస్త్రీనే. తెలంగాణను దోచుకున్న బీఆరెస్ ను బొందపెట్టి.. ఘోరీ కట్టే మేస్త్రీనే.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోంది. అక్కడ మోడీకైనా.. ఇక్కడ కేడీకైనా బుద్ది చెప్పేది కాంగ్రెస్ మాత్రమే.గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగరేసాం.. ఇక ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేద్దాం.
వారంలో మూడు రోజులు మీ రేవంతన్నగా మీ మధ్యకు వస్తా.మొన్నటి ఎన్నికల్లో బిల్లా రంగాలకు బుద్ది చెప్పాం.ఈ ఎన్నికల్లో పొలిమేరలు దాటేదాక తరుముదాం.ఇది ఇంటర్వెల్ మాత్రమే… అసలు సినిమా ముందుంది.
ఇంద్రవెల్లి వేదిక నుంచి అసలు సినిమా మొదలవుతుంది.బిల్లా రంగాలు కాదు చార్లెస్ శోభారాజ్ బయటకు రావాలి.పులి బయటకు వస్తే బోనులోకే. బీఆరెస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. మోదీని ఒడిద్దాం.. రాహుల్ గాంధీని ప్రధానిని.కేసీఆర్ కాస్కో.. ఆట మొదలైంది.కొన ఊపిరితో ఉన్న బీఆరెస్ ను బొంద పెడతాం.